Buying a Car in Woman’s Name : ఈ రోజుల్లో కారు కొనడం అనేది ఒక పెద్ద పెట్టుబడితో సమానంగా మారింది. ఇలాంటి సమయంలో కొంచెం తెలివిగా వ్యవహరిస్తే వేలు లేదా లక్షల రూపాయలు ఆదా చేయగలుగుతారు. దానికి అతిపెద్ద ట్రిక్ ఇక్కడుంది. చాలామంది తెలియక కారును తమ పేరు మీద తీసుకుంటారు. కానీ కారును భార్య పేరు మీద కొనుగోలు చేసినా లేదా లోన్ వారి పేరు మీద తీసుకున్నా.. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ఇది డబ్బును ఆదా చేయడమే కాకుండా.. మహిళలను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. భార్య పేరు మీద కారు కొనడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

రోడ్ టాక్స్‌లో మంచి ఆదా

భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో మహిళల పేరు మీద వాహనాన్ని రిజిస్టర్ చేయించుకుంటే.. రోడ్ టాక్స్‌లో తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు 2 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కర్ణాటకలో మహిళల పేరు మీద కారు తీసుకుంటే రోడ్ టాక్స్‌లో సుమారు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు 15 లక్షల రూపాయల కారు కొనుగోలు చేస్తే.. ఇందులో 20 వేల నుంచి 40 వేల రూపాయల వరకు నేరుగా ఆదా చేయవచ్చు.

కారు లోన్‌పై తక్కువ వడ్డీ

బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మహిళలకు కారు లోన్‌పై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. సాధారణంగా ఈ తగ్గింపు 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకు ఉంటుంది. 20 లక్షల రూపాయల కారు లోన్‌ను 7 సంవత్సరాల పాటు తీసుకుంటే.. దీని ద్వారా సుమారు 50 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఆదా చేయవచ్చు. భార్యకు సొంత ఆదాయం ఉంటే.. జాయింట్ లోన్ తీసుకోవడం వల్ల ప్రయోజనం మరింత పెరుగుతుంది.

Continues below advertisement

ఆదాయపు పన్నులో కూడా ఉపశమనం

భార్య పేరు మీద కారు లోన్ తీసుకోవడం వల్ల పన్నులో కూడా ప్రయోజనం పొందవచ్చు. లోన్ అసలు మొత్తంపై సెక్షన్ 80C కింద, వడ్డీపై సెక్షన్ 24B కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. భార్య కూడా పన్ను చెల్లిస్తుంటే.. ఇద్దరూ కలిసి పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా 

కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మహిళా డ్రైవర్లకు తక్కువ ప్రీమియంపై పాలసీలను అందిస్తాయి. గణాంకాల ప్రకారం మహిళలు తక్కువ ప్రమాదాల్లో పాల్గొంటారు.. కాబట్టి ఇన్సూరెన్స్‌పై 5 నుంచి 10 శాతం వరకు తగ్గింపు లభించవచ్చు.

ఈ న్యూ ఇయర్​లో మనీ సేవ్ చేస్తూ.. కారు కొనుక్కోవాలంటే మీ వైఫ్​ పేరు మీద కారు రిజిస్టర్ చేయించి.. బెనిఫిట్స్ పొందేయండి.