Kia Syros Price, Mileage And Features: మీ నెలవారీ జీతం/ఆదాయం రూ. 40,000 నుంచి రూ. 50,000 మధ్య ఉండి & మీ కొలీగ్స్‌ మధ్య కాలర్‌ ఎగరేసి తిరిగేలా ఓ సరికొత్త స్టైలిష్‌ కార్‌ కొనాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు మీరు సరైన వార్త చదువుతున్నారు. కియా ఇండియా, ఈ ఏడాది ఫిబ్రవరి 1న సైరోస్ SUVని లాంచ్‌ చేసింది, అదే నెల మధ్య నుంచి డెలివెరీ ఇవ్వడం స్టార్ట్‌ చేసింది. మీ ఫ్యామిలీ ప్రయాణానికి సురక్షితమైన, బెస్ట్‌ మైలేజ్ ఇచ్చే, స్టైల్‌ లుక్స్‌ ఇచ్చే ఫ్యామిలీ SUV కోసం మీరు సెర్చ్‌ చేస్తుంటే, కిరో సైరోస్‌ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది పవర్‌ & లుక్‌లోనే కాదు, ఈజీ EMI స్కీమ్‌ ద్వారా మీ బడ్జెట్‌కు కూడా సరిపోతుంది.

కియా సైరోస్‌ ధరకియా సైరోస్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 9.50 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి 17.80 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో Kia Syros HTK 1.0 Turbo 6MT (పెట్రోల్) వేరియంట్ ఆన్‌-రోడ్‌ ప్రైస్‌ రూ. 11.33 లక్షలు ఉంటుంది. ఇందులో, బండి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు రూ. 1,40,986, బీమా రూ. 41,371, ఇతర ఛార్జీలు రూ. 1000 కలిసి ఉన్నాయి.

డౌన్ పేమెంట్ మీరు, కియా సైరోస్‌ బేస్‌ వేరియంట్‌ కోసం రూ. 3.33 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 8 లక్షలు బ్యాంకు లోన్‌ వస్తుంది. మీ క్రెడిట్ స్కోరు బాగుంటే ఇంతకంటే ఎక్కువ రుణం మంజూరు కావచ్చు. బ్యాంక్ మీకు 9% వడ్డీ రేటుకు 5 సంవత్సరాల కాలానికి రూ. 8 లక్షలు రుణం ఇచ్చిందని అనుకుందాం.

EMI కాలుక్యులేషన్‌

* 5 సంవత్సరాల కాలానికి ‍‌(60 నెలలు) 9 శాతం వడ్డీ రేటుతో రూ. 8 లక్షల కార్‌ లోన్‌ తీసుకుంటే, మీ EMI నెలకు రూ. 16,607 అవుతుంది. ఈ 60 EMIల్లో మీరు మొత్తం రూ. 1.96 లక్షల వడ్డీ చెల్లించాలి. 

* 6 సంవత్సరాల కాలానికి ‍‌(72 నెలలు) లోన్‌ తీసుకుంటే, EMI రూ. 14,420 (రూ.15,000 కన్నా తక్కువ) అవుతుంది. ఈ 72 EMIల్లో మీరు మొత్తం రూ. 2.38 లక్షల వడ్డీ చెల్లించాలి. 

* 7 సంవత్సరాల కాలానికి ‍‌(84 నెలలు) రుణం తీసుకుంటే, EMI రూ. 12,871 (రూ.13,000 కన్నా తక్కువ) అవుతుంది. ఈ 84 EMIల్లో మీరు మొత్తం రూ. 2.81 లక్షల వడ్డీ చెల్లించాలి. 

EMI, లోన్ మొత్తం, వడ్డీ రేటు & కాలపరిమితి వంటివి కస్టమర్ ప్రొఫైల్ & బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీపంలోని కియా డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

ఇంజిన్ & మైలేజ్ కియా సైరోస్ రెండు శక్తిమంతమైన ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & రెండోది 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. రెండు ఇంజిన్ ఆప్షన్లు మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తాయి. కంపెనీ వెల్లడించిన ప్రకారం, లీటర్‌ పెట్రోల్‌తో కియా సైరోస్‌ SUV గరిష్టంగా 22 km మైలేజీ అందించగలదు. ఈ ప్రకారం, ఇది బడ్జెట్‌ ఫ్రెండ్లీతో పాటు ఫ్యూయల్‌-ఎఫిషియంట్‌ ఆప్షన్‌ కూడా.

ఫీచర్లు & సేఫ్టీ ప్రీమియం ఫీచర్లు & అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ టెక్నాలజీతో కియా సైరోస్‌ను ప్యాక్‌ చేశారు. క్యాబిన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అధునిక ఫీచర్లు ఈ బండి సొంతం, ఇవి ప్రతి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా & ఆహ్లాదకరంగా మారుస్తాయి. కారులో అందిస్తున్న 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఫ్యామిలీ భద్రతకు భరోసా ఇస్తాయి. ఇంకా.. డ్రైవర్‌ మీద ఒత్తిడి తగ్గించేందుకు 360 డిగ్రీల కెమెరా & లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్ల కారణంగా కియా సైరోస్ సేఫ్టీ, స్మార్ట్ & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ SUVగా పాపులారిటీ తెచ్చుకుంది.