BSA Scrambler 650 : భారతీయ టూవీలర్ రంగంలో ఐకానికి బ్రాండ్‌లను తిరిగి పునరుద్ధరించడంలో మహీంద్రా నేతృత్వంలోని క్లాసిక్ లెజెండ్స్‌ కీలక పాత్ర పోషిస్తోంది. జావా యెజ్డీ బ్రాండ్‌ల తర్వాత ఇప్పుడు బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 భారత్ రోడ్లపైకి రావడానికి ముహూర్తం ఖరారైంది. 

Continues below advertisement

మార్కెట్‌లోకి ఎప్పుడు రానుంది?

బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 ఏప్రిల్ 23న అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. గతంలోనే క్లాసిక్‌ లెజెండ్స్‌ కో పౌండర్ తరేజ్‌ ఈ బైక్ రాక గురించి సూచనలు ఇచ్చారు. గతేడాది జులైలో యూకే మార్కెట్‌లో ఇది గ్లోబల్ డెబ్యూ చేసినప్పటికీ ఇప్పుడు మన దేశీయ రోడ్లకు తగిన మార్పులతో అందుబాటులోకి రానుంది. 

ఈ బైక్ చూడటానికి పూర్తి నియో-రెట్రో స్క్రాంబ్లర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. కఠినమైన దారిలో కూడా సునాయాసంగా ప్రయాణించోలా దీనిని రూపొందించారు. దీనికి ఎత్తులో అమర్చిన ఫ్రంట్ మడ్‌గార్డ్ ఉంది. ఫ్లాంట్ సింగిల్‌-పీస్‌ సీటు, వెడల్పాటి హ్యాండిల్‌ బార్, రౌండ్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్, దానికి ప్రొటెక్టివ్ గ్రిల్ ఉంటుంది. సైడ్ ప్యానెల్‌పై 65 అనే గ్రాఫిక్స్‌ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తాయి. 19- అంగుళాల ఫ్రంట్, 17- అంగుళాల రియర్‌ స్పోక్‌ వీల్స్, ఇవి పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ ఎస్‌టీఆర్‌ టైర్లతో వస్తాయి. 

Continues below advertisement

బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 ప్లాట్‌ఫామ్‌పైనే ఈ స్క్రాంబ్లర్‌ కూడా ఆధారపడి ఉంటుంది. ఇందులో 652సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 46బీహెచ్‌పీ పవర్, 55ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్, లోతైనా ఎగ్జాస్ట్‌ నోట్ ఇచ్చేలా రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్‌ కాన్సెస్టర్‌ను కలిగి ఉంటుంది. 

ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఆధిపర్యం కొనసాగుతోంది. అయితే బీఎస్‌ఏ తన స్క్రాంబ్లర్‌ 650 ధరను రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కంటే తక్కువగా ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయల్ ఎన‌ఫీల్డ్‌ బేర్ 650 ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 3.75 లక్షలుగా ఉంది. దీని కంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక కావచ్చు.