చాలా మంది తమ బైక్‌ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపించరు. రైడర్లు కేవలం అవసరానికి తగినట్లుగా కొంచెం కొంచెం పెట్రోల్ పోయించేవారు చాలా మంది ఉంటారు. అయితే బైక్ రిజర్వ్ మోడ్‌లోకి వచ్చే వరకు నడుపుతూనే ఉంటారు. కొంతమంది అయితే అలవాటుగా తమ బైక్‌ను దాదాపు ఎప్పుడూ రిజర్వ్‌‌లోనే నడుపుతుంటారు. ఈ అలవాటు మీ బైక్ ఇంజన్‌కు, దాని పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని మీకు తెలుసా? మరి ప్రతిరోజూ రిజర్వ్‌లో బైక్ నడపడం వల్ల ఇంజన్‌ ఏమవుతుంది, దానిపై ఏ ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

రిజర్వ్ మోడ్ అంటే ఏమిటి? బైక్‌లో రిజర్వ్ మోడ్ అనేది ఒక రకమైన ఎమర్జెన్సీ సౌకర్యం. పెట్రోల్ అయిపోవచ్చినప్పుడు, మీరు దగ్గర్లోని పెట్రోల్ బంకుకు చేరుకోవడానికి వీలుగా బైక్‌ను రిజర్వ్‌లో పెట్టి కొంత దూరం వరకు వెళ్లవచ్చు. దీని అసలు ఉద్దేశ్యం బైక్‌ను ఎప్పుడూ ఈ మోడ్‌లో నడపడం సరి కాదు. ఇది కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే ఇచ్చిన ఓ సౌకర్యం. ఎప్పుడైనా ఒకసారి బైక్ రిజర్వ్‌లో నడిస్తే పెద్ద సమస్య ఉండదు. కానీ మీరు రెగ్యూలర్‌గా ఇదే అలవాటుగా మార్చుకుంటే మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. 

రెగ్యూలర్‌గా బైక్ రిజర్వ్‌లో నడపడం వల్ల ఇంజన్‌పై ప్రభావం

Continues below advertisement

ఇంజన్ పనితీరు దెబ్బతింటుంది - బైక్‌లో తక్కువ పెట్రోల్ ఉన్నప్పుడు మీరు గమనించి ట్యాంకులో ఎంతో కొంత పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ అయిపోయిందరి నిరంతరం రిజర్వ్‌లో నడిపినప్పుడు, ఇంజన్‌కు ఫ్యూయల్ సరైన రీతిలో అందదు. దాంతో ఇంజన్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. దీని ప్రభావం ఒక్కసారిగా కాదు, క్రమంగా కనిపిస్తుంది. మీ బైక్ పికప్ తగ్గవచ్చు, యాక్సిలరేషన్ తగ్గినట్లు అనిపించవచ్చు. బైక్ ఇంజన్ స్మూత్‌నెస్ తగ్గుతుంది. ఎక్కువ రోజులు, రెగ్యూలర్‌గా ఇలా చేయడం వల్ల ఇంజన్ లైఫ్ టైం తగ్గి త్వరగా చెడిపోతుంది. 

బైక్ అకస్మాత్తుగా ఆగిపోవచ్చు - రిజర్వ్‌లో బైక్ రెగ్యూలర్‌గా నడపడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, పెట్రోల్ ఎప్పుడు అయిపోతుందో ఖచ్చితంగా అంచనా వేయలేరు. బైక్ రోడ్డు మధ్యలో, మీ దారిలో ఎప్పుడైనా అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. దాంతో మీరు పక్కకు బండిని నెట్టే అవకాశం లేకపోతే ట్రాఫిక్‌లో ఇబ్బందులు కలగవచ్చు. కొన్నిసార్లు ప్రమాదం సైతం జరగవచ్చు.

ఫ్యూయల్ సిస్టమ్‌లోకి వ్యర్థాలు  - ట్యాంక్‌లో పెట్రోల్ చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఫ్యూయల్ పంప్ అడుగున పేరుకుపోయిన మట్టి, మురికి, వ్యర్థాలు అలాగే లోపలికి వెళ్తాయి. దీనివల్ల ఫ్యూయల్ లైన్ జామ్ అయి ఇంజన్‌లోకి మురికి చేరవచ్చు. ఫలితంగా బైక్ ఇంజిన్ పనితీరు, మైలేజ్ రెండూ దెబ్బతింటాయి.

ఫ్యూయల్ సెన్సార్ దెబ్బతింటుంది -  రెగ్యూలర్‌గా మీరు తక్కువ పెట్రోల్‌తో కనుక బైక్ నడపడం వల్ల ఫ్యూయల్ ట్యాంక్ సెన్సార్ కూడా త్వరగా పాడైపోవచ్చు. సెన్సార్ పాడైతే ఫ్యూయల్ లెవల్ మీకు సరిగ్గా కనిపించదు. రాంగ్ ఇండికేషన్స్ కూడా రావచ్చు. దీనివల్ల తరచూ రిపేర్ చేయాల్సి వస్తుంది. 

బైక్‌లో ఎంత ఇంధనం ఉండాలి బైక్‌లో ఎప్పుడూ కనీసం 2 నుండి 3 లీటర్ల పెట్రోల్ ఉండాలి. అలా చేసినప్పుడు మీ బైక్ ఇంజన్ సరిగ్గా పనిచేస్తుంది. మీ ఫ్యూయల్ పంప్, ఇంజిన్ సురక్షితంగా ఉంటుంది. బైక్ ఇంజిన్ లైఫ్ టైమ్ తగ్గకుండా ఉంటుంది.