Bharat NCAP Top 5 Safest Cars 2025: కొన్నేళ్ల క్రితం వరకు, కారు కొనే ముందు చాలా మంది చూసే ఫీచర్లు - డిజైన్, టెక్నాలజీ, మైలేజీ. ఇప్పుడు, వాటికంటే ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్న అంశం సేఫ్టీ. ఎందుకంటే రోడ్లపై ట్రాఫిక్, వేగం, ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను అంచనా వేయడానికి భారత్ NCAP (New Car Assessment Programme)ని 2023లో లాంచ్ చేశారు. ఇది గ్లోబల్ NCAPతో సమానమైన టెస్టింగ్ స్టాండర్డ్స్‌తో, మన మార్కెట్లో అమ్ముడవుతున్న కార్లను కఠినమైన పరిస్థితుల్లో పరీక్షిస్తుంది. ఇప్పటి వరకు 21 కార్లు టెస్ట్ చేశారు. వాటిలో 5 SUVలు అత్యధికంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి, టాప్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.
5. టాటా పంచ్ EV
AOP స్కోర్: 31.46/32
టాటా పంచ్ EV, భారత్ NCAPలో టెస్ట్ చేసిన తొలి ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. చిన్న సైజ్‌లో ఉండే ఈ కారు యువతలో ఎక్కువ పాపులర్. కేవలం లుక్స్ మాత్రమే కాదు, సేఫ్టీ విషయంలోనూ ఇది అగ్రగామిగా నిలిచింది.
- టాటా పంచ్ EV సేఫ్టీ ఫీచర్లు:
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)
- హిల్ హోల్డ్ కంట్రోల్
- ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
- రియర్ పార్కింగ్ సెన్సార్లు
- TPMS (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్)
4. మారుతి విక్టోరిస్
AOP స్కోర్: 31.66/32
హ్యుందాయ్ క్రెటాకు పోటీగా లాంచ్ అయిన మారుతి విక్టోరిస్, 2025 సెప్టెంబర్‌లో టెస్ట్ చేసి వెంటనే 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది మారుతి గ్రాండ్ విటారాకు సిబ్లింగ్. మిడ్-సైజ్ SUV కావడంతో పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది.
సేఫ్టీ ఫీచర్లు:
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్స్ & రిమైండర్స్
- ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్)
- ISOFIX యాంకర్లు
ZX+ & ZX+(O) వేరియంట్స్‌లో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా అందుబాటులో ఉంటుంది
3. మహీంద్రా BE 6
AOP స్కోర్: 31.97/32
మహీంద్రా BE సిరీస్‌లో వచ్చిన BE 6 ఒక బోర్న్ EV. అంటే, మొదటి నుంచే ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌తో తయారైంది. స్టైల్ పరంగా మోడ్రన్‌గా, సేఫ్టీ పరంగా అద్భుతంగా ఉంది.
సేఫ్టీ ఫీచర్లు:
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- రియర్ కెమెరా
- పార్కింగ్ సెన్సార్లు
- TPMS
- డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ సిస్టమ్
2. మహీంద్రా XEV 9e
AOP స్కోర్: 32/32
ఈ SUV, Bharat NCAPలో పూర్తి స్కోర్ సాధించిన మొదటి కార్లలో ఒకటి. కూపే SUV లుక్స్‌తో కాస్త స్టైలిష్‌గా కనిపించే ఈ కారు, సేఫ్టీ విషయంలో మాత్రం టాప్ లెవెల్‌లో ఉంది.
సేఫ్టీ ఫీచర్లు:
- 6 ఎయిర్‌బ్యాగ్స్ (బేస్ వేరియంట్ నుంచే)
- ISOFIX యాంకర్లు
- రియర్ డిస్క్ బ్రేకులు
- TPMS
ఈ SUV మొత్తం లైనప్‌కి ఇదే సేఫ్టీ రేటింగ్ వర్తిస్తుంది.
1. టాటా హారియర్ EV
AOP స్కోర్: 32/32
2025 జూన్‌లో టెస్టింగ్ జరిగిన టాటా హారియర్ EV, Bharat NCAPలో అత్యధిక మార్కులు సాధించింది. పవర్‌ఫుల్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో పాటు భద్రతలోనూ ఎలాంటి రాజీ లేకుండా దీనిని రూపొందించారు.
సేఫ్టీ ఫీచర్లు:
- 6 ఎయిర్‌బ్యాగ్స్
- అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్స్ & రిమైండర్స్
- ESC
- ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
ఈ టాప్ 5 SUVలు ఒకటే చెబుతున్నాయి - ఇప్పుడు కారు అంటే కేవలం స్టైల్, పవర్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా. EV మార్కెట్‌లో బోర్న్ EVలు (Mahindra BE 6, XEV 9e, Tata Harrier EV) యువతకు బెస్ట్ ఆప్షన్లు. బడ్జెట్ రేంజ్‌లో చూడాలనుకుంటే Maruti Victoris, Punch EV మంచి ఎంపికలు. ప్రతి ఫ్యామిలీ సురక్షిత ప్రయాణాన్ని ముఖ్యమని దృష్టిలో పెట్టుకుంటే, ఇవి రోడ్డుపై అత్యంత విశ్వసనీయ SUVలు అని చెప్పవచ్చు.