BGauss OoWah MAX Plu Price, Range And Features Telugu: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునేవాళ్లకు BGauss గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కంపెనీ, కొత్త OoWah MAX Plus స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.23 లక్షలు. ఇప్పటికే ఉన్న OoWah EX కంటే ఇది పైస్థాయిలో ఉంటుంది.

Continues below advertisement

పట్టణాలు &నగర ప్రాంతాల్లో డైలీ జర్నీని సులభంగా మార్చే లక్ష్యంగా ఈ స్కూటర్‌ను రూపొందించినట్లు BGauss తెలిపింది. ముఖ్యంగా తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవాళ్లను, యువతను దృష్టిలో పెట్టుకుని దీన్ని డిజైన్‌ చేసినట్లు వెల్లడించింది.

పెద్ద బ్యాటరీOoWah MAX Plusలో ప్రధాన మార్పు బ్యాటరీ. ప్రస్తుతం ఉన్న OoWah EXలో ఉన్న బ్యాటరీ కంటే 0.7kWh ఎక్కువ సామర్థ్యంతో 3kWh LFP బ్యాటరీని ఇందులో అందించారు. ఈ బ్యాటరీని స్కూటర్‌ నుంచి విడదీసి ఇంటిలోకి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకోవచ్చు. 

Continues below advertisement

రేంజ్‌ARAI ధ్రువీకరించిన క్లెయిమ్డ్ రేంజ్ 145 కి.మీ.

స్కూటర్‌లో PMSM హబ్ మోటార్‌ను కొనసాగించారు. దీని పీక్‌ పవర్‌ 2.4kW కాగా, కంటిన్యుయస్‌ పవర్‌ 1.5kW. బ్యాటరీ సామర్థ్యం పెరిగినా గరిష్ట వేగంలో మార్పు లేదు. గంటకు 60 కి.మీ. టాప్ స్పీడ్‌ను ఇది అందిస్తుంది.

బ్యాటరీ & మోటార్ రెండింటికీ IP67 రేటింగ్ ఉంది. బ్యాటరీ CAN టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని ద్వారా బ్యాటరీ & వాహనం మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు

750W ఛార్జర్ ఉచితంOoWah MAX Plusతో 750W ఛార్జర్‌ను అదనపు ధర లేకుండా అందిస్తున్నారు. ఈ ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 55 నిమిషాలు పడుతుంది.

1,350W ఛార్జర్‌తో 100 శాతం ఛార్జింగ్‌ను 2 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని కంపెనీ స్పెసిఫికేషన్ షీట్‌లో పేర్కొంది. ఈ ఛార్జర్ ధర & అందుబాటుపై స్పష్టత లేదు.

OoWah EXతో పోలిస్తే ఈ కొత్త స్కూటర్‌లోని కొలతల్లోనూ పెద్దగా మార్పులు లేవు. సీటు ఎత్తు 765mm & గ్రౌండ్ క్లియరెన్స్ 160mm. అయితే పెద్ద బ్యాటరీ కారణంగా కర్బ్ వెయిట్‌ 104 కిలోలకు పెరిగింది, OoWah EX బరువు 97 కిలోలు. సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్ స్థలం ఉంది.

కొత్త ఫీచర్లురివర్స్ అసిస్ట్, డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి కొత్త ఫీచర్లను ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చేర్చారు. OoWah MAX Plusలో అన్ని లైట్లు LED. డ్రమ్ బ్రేకులు, CBS వంటి ఫీచర్లు ఉన్నాయి. లింప్ హోమ్ మోడ్ & USB ఛార్జింగ్ సదుపాయం కూడా అందించారు.

వాహనం & ఛార్జర్‌పై 3 సంవత్సరాలు లేదా 36,000 కి.మీ. వారంటీ ఇస్తున్నారు. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ. వారంటీ ఉంది. ఈ వారంటీని 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ. వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.

ధర & కలర్ ఆప్షన్లుBGauss OoWah MAX Plus ధర రూ.1.23 లక్షలు. ఇది ఎక్స్-షోరూమ్ ధర. 

ఇది కూడా చదవండి: R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు

రంగులుఎమరాల్డ్ షాడో, జామున్ పంచ్, ట్యాంగీ టోమా & జెస్టీ రెడ్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

OoWah EX కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్ముడవుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.94,990. EX మోడల్‌ కూడా ఇదే నాలుగు రంగుల్లో లభిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.