Kia Carens Clavis Vs Maruti Suzuki XL6 - Price And Features: ప్రీమియం ఫీచర్లు, గ్రేట్ కంఫర్ట్ & పవర్‌ఫుల్ ఇంజిన్లు ఉన్న కార్లు మార్కెట్‌లోకి లాంచ్ కావడంతో, ఇప్పుడు MPV సెగ్మెంట్‌లో గతంలో కంటే పోటీ పెరిగింది. కియా కారెన్స్ క్లావిస్ ఎంట్రీతో మారుతి సుజుకి XL6కు గట్టి పోటీ ఎదురైంది. ఈ రెండు MPV (మల్టీ పర్పస్ వెహికల్)ల్లో ఏది మీ కుటుంబానికి సరైనదో నిమిషాల్లో అర్ధం చేసుకోవచ్చు.
ధరకియా కారెన్స్ క్లావిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.50 లక్షల నుంచి ప్రారంభమై రూ. 21.50 లక్షల వరకు ఉంటుంది. మారుతి సుజుకి XL6 ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.83 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.83 లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్క ప్రకారం మారుతి XL6 కంటే క్లావిస్ బేస్ వేరియంట్ చవకగా వస్తుంది. అయితే, XL6 టాప్ వేరియంట్ క్లావిస్ టాప్ వేరియంట్ కంటే తక్కువ ధర పలుకుతోంది.
ఇంజిన్ & పనితీరు ఇంజిన్ & పనితీరు పరంగా చూస్తే, క్లావిస్‌లో ఎక్కువ ఆప్షన్లు, శక్తివంతమైన ఇంజిన్‌లు ఉన్నాయి. ఈ MPV మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో లాంచ్ అయింది - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (113 bhp, 144 Nm), 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (158 bhp, 253 Nm) & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ (113 bhp, 250 Nm). ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఈ కార్ 6-స్పీడ్ మాన్యువల్, iMT & 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో చాలా స్మూత్‌గా రన్నింగ్ చేస్తుంది. మరోవైపు, మారుతి XL6 1.5-లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ (102 bhp, 137 Nm) & CNG వెర్షన్ (86.6 bhp, 121.5 Nm)లో అందుబాటులో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకువెళ్తుంది. XL6 CNG వేరియంట్ 26.32 kmpl మైలేజీని ఇస్తుంది. క్లావిస్, తన పవర్ పెర్ఫార్మెన్స్‌తో మెరుగ్గా ఉంటుంది.
ఫీచర్లు డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్స్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా & 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కియా కారెన్స్ క్లావిస్‌లో కనిపిస్తాయి. మారుతి XL6లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, సుజుకి కనెక్ట్ & 360 డిగ్రీల కెమెరా వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి. ఫీచర్లు & ఆధునిక సాంకేతికత విషయంలో క్లావిస్ ఒక అడుగు ముందుంది.
డిజైన్ & సైజ్‌క్లావిస్ డిజిటల్ టైగర్ ఫేస్, LED DRLs & 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో చాలా మోడర్న్‌గా కనిపిస్తుంది. ఇది, మారుతి XL6 కంటే 95mm పొడవు & 25mm వెడల్పు ఉంటుంది, అందువల్ల కార్ క్యాబిన్ మరింత విశాలంగా అనిపిస్తుంది. XL6 టఫ్ SUV డిజైన్‌తో లాంచ్ అయింది, అయితే ఈ డిజైన్ కొంచెం పాతగా కనిపిస్తుంది.
ప్రయాణీకుల భద్రతప్రయాణీకుల భద్రత కోసం కియా కారెన్స్ క్లావిస్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ESP వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. మారుతి XL6లో 4 ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్ & ESP ఉన్నాయి, ADAS సాంకేతికత లేదు. వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు అమర్చారు.
ఏది బెస్ట్?ఓవరాల్‌గా చూస్తే, కియా కారెన్స్ క్లావిస్ ఫ్యూచర్ రెడీ & భద్రత విషయంలో నమ్మదగిన MPVగా కనిపిస్తుంది. మీకు ఎక్కువ ఫీచర్లు, ఆధునిక సాంకేతికత & శక్తిమంతంగా పని చేసే ప్రీమియం MPV కావాలనుకుంటే Kia Carens Clavis ఒక మంచి ఎంపిక. మీ బడ్జెట్ కొంచెం పరిమితంగా ఉండి, మైలేజీకి ప్రాధాన్యత ఉంటే మారుతి సుజుకి XL6 CNG వేరియంట్ ప్రయోజనకరంగా ఉంటుంది.