Best SUV For Senior Citizens India: 60 ఏళ్లకు పైబడిన పెద్దవారి కోసం ఒక SUV కొనాలనుకుంటే, కేవలం లుక్స్‌, పవర్‌ మాత్రమే కాకుండా కంఫర్ట్‌, ఎక్కడం–దిగడంలో సౌలభ్యం, సిటీ డ్రైవింగ్‌లో లైట్‌గా ఫీల్‌ అవ్వడం, స్మూత్‌ ఇంజిన్‌, ఆటోమేటిక్‌ సౌలభ్యం - ఇవన్నీ కూడా చాలా ముఖ్యం.  Mahindra XUV700, Tata Harrier, Hyundai Alcazar... ఈ మూడు మంచి SUVలే. కానీ సీనియర్‌ సిటిజన్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ప్రాక్టికల్‌గా చూసినప్పుడు Hyundai Alcazar బెస్ట్‌ బ్యాలెన్స్‌ ఇచ్చే SUVగా నిలుస్తుంది.

Continues below advertisement

ముందుగా, Hyundai Alcazar ఇంజిన్‌ గురించి చెప్పుకుందాం. ఏడాదికి రన్నింగ్‌ 8,000 నుంచి 10,000 కి.మీ. వరకు రన్నింగ్‌ ఉన్నవాళ్లకు డీజిల్‌ వేరియంట్‌ కొనాలనే ప్రాధాన్యం ఉండదు. డీజిల్‌ వేరియంట్‌ కోసం ఎక్కువ ఖర్చు చేసినా, దానిని తిరిగి కవర్‌ చేసుకునేంత రన్నింగ్‌ 'ఏడాదికి రన్నింగ్‌ 8,000 నుంచి 10,000 కి.మీ.'లలో ఉండదు. అందుకే పెట్రోల్‌ SUVనే ఈ అవసరాలకు బాగా సరిపోతుంది. పెట్రోల్‌ ఇంజిన్‌ వైబ్రేషన్స్‌ తక్కువగా, స్మూత్‌గా పని చేస్తుంది, పెద్దవారికి ఇది చాలా ఇంపార్టెంట్‌.

Continues below advertisement

ఇప్పుడు SUVల పోలిక దగ్గరకు వెళితే... XUV700, Harrier రెండూ శక్తిమంతమైన SUVలు అయినా.... పరిమాణం, బరువు పరంగా పెద్దవే. సిటీ డ్రైవింగ్‌లో వీటి స్టీరింగ్‌, మాన్యూవరింగ్‌ కొంచెం హెవీగా అనిపించవచ్చు. పెద్దవారికి, ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన వారికి, ఇది కొద్దిగా కష్టతరంగా మారే అవకాశం ఉంది.

అదే సమయంలో, Hyundai Alcazar మాత్రం కాస్త కాంపాక్ట్‌గా, లైట్‌గా, చాలా ఈజీగా నడిపేలా ఉంటుంది. Hyundai బ్రాండ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ రిఫైన్‌డ్‌గా పని చేస్తుంది, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కూడా స్మూత్‌గా గేర్లు మారుస్తుంది. ఇది పెద్దవారి డ్రైవింగ్‌ స్టైల్‌కు పూర్తిగా సరిపోతుంది.

అత్యంత కీలకమైన విషయం - కారులోకి ఎక్కడం, దిగడం చాలా సులభం. SUV బాడీ ఉన్నా, సీటు పొజిషన్‌ కూడా ఎక్కువ ఎత్తులో ఉండదు. పెద్దవాళ్లు కాళ్లను ఎక్కువ ఎత్తు ఎత్తాల్సిన అవసరం లేకుండా కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. XUV700, Harrierతో పోలిస్తే Alcazarలో ఈ యాక్సెస్‌ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

రైడ్‌ క్వాలిటీ గురించి చెప్పాలంటే, Alcazar సస్పెన్షన్‌ సాఫ్ట్‌గా ఉంటుంది. చిన్న గుంతల్లో అయినా, కఠినమైన రోడ్లపై అయినా పెద్దవారికి గట్టి జర్క్‌ వచ్చే అవకాశం తక్కువ. దీర్ఘ ప్రయాణాల్లో కూడా ఇది సాధారణంగా అలసట రాకుండా ఉంచే విధంగా పనిచేస్తుంది.

సేఫ్టీ, ఫీచర్లు, క్లాస్‌లో బెస్ట్‌ కనెక్టివిటీ అన్నీ కలిపి Alcazar ఒక పూర్తి SUV ఫీలింగ్‌ ఇస్తుంది. బ్యాక్‌ సీట్లో కూర్చునే పెద్దవారికి కూడా లెగ్‌ రూమ్‌, కంఫర్ట్‌ విషయంలో మంచి స్పేస్‌ ఉంటుంది.

పొడవైన SUV కావాలి, అదే సమయంలో డ్రైవ్‌ చేయడానికి లైట్‌గా ఉండాలి అనుకుంటే Alcazarనే ఉత్తమ ఎంపిక.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.