Best SUV Cars: భారతీయ రహదారులపై ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ కార్ల ఆధిపత్యం ఉండేది. కానీ నేడు వినియోగదారుల మొగ్గు ఎస్‌యూవీల వైపు మళ్లింది. పది లక్షల రూపాయల లోపు ధరలో ప్రస్తుతం 26 రకాల ఎస్‌యూవీ మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ విభాగంలో మారుతి సుజుకి, హ్యూందాయ్, టాటా, మహీంద్ర, కియా వంటి కంపెనీలు పోటాపోటీగా కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
పెరుగుతున్న ఎస్‌యూవీల ప్రాధాన్యత
వినియోగదారులు ఎస్‌యూవీలను ఎంచుకోవడానికి ప్రధాన కారణం టి రోడ్ ప్రెజెన్స్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్. అంతేకాకుండా, ఈ బడ్జెట్‌లో కూడా నేడు అత్యాధునిక భద్రతా ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ ధర పరిధఇలో లభించే కార్లలో దాదాపు 18 మోడల్స్ 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రతతో వస్తున్నాయి. అలాగే 7 కార్లు గ్లోబల్ సేఫ్టీ టెస్టుల్లో 5స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురుక్షితమైనవిగా నిలిచాయి.
అందుబాటులో ఉన్న టాప్ మోడల్స్
టాటా పంచ్
దీని ధర 5.59 లక్షల నుంచి 10.54 లక్షల వరకు ఉంటుంది. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది.
హ్యూందాయ్ ఎక్స్టర్
ఇది 5.80 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ మైక్రో ఎస్‌యూవీ, లీటర్కు 19.2 నుంచి 27.1 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్
6.85 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ కారు, స్టైలిష్ లుక్, 28.5 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇచ్చే సీఎన్జీ ఆప్షన్‌తో లభిస్తుంది.
టాటా నెక్సాన్
భద్రతకు మారుపేరుగా నిలిచిన నెక్సాన్ ధర 7.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మహీంద్రా థార్
అడ్వెంచ్ ప్రియుల కోసం 9.99 లక్షల ప్రారంభ ధరో థార్ అందుబాటులో ఉంటుంది.
కియా సోనెట్
ప్రీమియం ఫీచర్ల కోరుకునే వారికి 7.30 లక్షల ప్రారంభ ధరతో ఇది మంచి ఎంపిక.
ఎలక్ట్రిక్ విభాగంలో ఉన్న ఆప్షన్స్
పర్యావరణ హితమైన ప్రయాణం కోరుకునే వారికి కోసం ాటా పంచ్ ఈవీ అందుబాటులో ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 315 నుంచి 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
ప్రస్తుతం కంపెనీల తమ పాత మోడళ్లను అప్‌డేట్ చేయడంతోపాటు టాటా కర్వ్ వంటి కొత్త మోడళ్లను కూడా 9.66 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. పండుగ సీజన్లలో, ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈ కార్లపై మరిన్ని ఆర్లు వచ్చే అవకాశం ఉంది.
మీకు ఎక్కువ మైలేజీ కావాలంటే సీఎన్జీ లేదా పెట్రోల్ వేరియంట్లను,లాంగ్ డ్రైవ్స్ కోసం అయితే డీజిల్ వేరియంట్లను ఎంచుకోవచ్చు. నగరాల్లో ప్రయాణానికి సులభంగా ఉండాలంటే అటోమేటిక్ వేరియంట్లు, డ్రైవింగ్‌పై పూర్తి నియంత్రణ కావాలనుకుంటే మాన్యువల్ వేరియంట్లు ఎంచుకోవాలి. ప్రస్తుతం పది లక్షలలోపు కార్లలో కూడా సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లైస్ ఫోన్ ఛార్జింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటివి లభిస్తున్నాయి.
