Best Hybrid Cars India 2026: ప్రస్తుత రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి బిజినెస్ మేగ్నెట్స్ వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఒకే ఒక్క పెద్ద మండిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు. ఆఫీసుకో, లాంగ్ ట్రిప్‌కో వెళ్లాలంటే బండి ఫ్యూయల్ ట్యాంక్‌వైపు, తర్వాత జేబు వైపు చూడాల్సి వస్తోంది. ఇలా పెట్రోల్ ఖర్చులు భరించ లేక అలాగని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనలేక నలిగిపోతున్న వారు లక్షల్లో ఉన్నారు. ఇలాంటి వారి సమస్యకు పరిష్కారంగానే అందుబాటులోకి వచ్చింది హైబ్రిడ్‌ కార్లు. 

Continues below advertisement

హైబ్రిడ్ కార్లు ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లోనూ నడుస్తాయి, అవసరమైనప్పుడు పెట్రోల్‌ను వాడుకుంటాయి. ఒకే కార్‌లో అటు ఈవీ సైలెంట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, ఇటు పెట్రోల్ కార్ లాంగ్ రేంజ్ భరోసా ఇస్తాయి. అలాగని మైలేజీ తగ్గుతుందనే ఆలోచన కూడా వద్దు. రెగ్యులర్‌ పెట్రోల్ కార్లు ఇచ్చే మైలేజీ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి మంచి మైలేజీ ఇచ్చి సామాన్యుడి ఆలోచనల్లో ఉండే టాప్ మోడల్స్‌ గురించి తెలుసుకుందాం. 

హైబ్రిడ్ టెక్నాలజీలో రకాలు ఉన్నాయా?

ఈ మధ్య కాలంలో కార్ల ప్రస్తావన వచ్చింది అంటే చాలు చాలా మంది నోటు నుంచి హైబ్రిడ్ అనే మాట గట్టిగా వినిపిస్తుంది. దీనికి పెరుగుతున్న ప్రాధాన్యతను గుర్తించిన కంపెనీలు కూడా తక్కువ ధరల్లోనే సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు హైబ్రిడ్ కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా రెండు రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఒకటి మైల్డ్‌హైబ్రిడ్. ఎక్కువ మంది దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఒక చిన్న ఇంటిగ్రేటె్‌ స్టార్టర్‌ జనరేటర్ మోటర్ ఉంటుంది. ఇది కేవలం ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఈ మోడల్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో రన్ చేయలేరు. మైలేజీలో కూడా పెద్ద తేడా కనిపించదు. పేరుకే ఇవి హైబ్రిడ్ అయినప్పటికీ వినియోగదారునికి పెద్దగా ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. 

Continues below advertisement

రెండో రకం స్ట్రాంగ్ హైబ్రిడ్‌ టెక్నాలజీ. ఇందులో పెద్ద కెపాసిటీ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తోపాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు పెట్రోల్‌ సేవ్ చేయడానికి పూర్తిగా ఈవీ మోడ్‌లోనే ఉంటుంది. అదే స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిక్‌, పెట్రోల్ ఇంజిన్ రెండూ బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ చేస్తాయి. దీని వల్ల మైలేజీ వస్తుంది. బ్రేక్ వేసినప్పుడు వచ్చే ఎనర్జీతో బ్యాటరీ ఆటోమేటిక్‌గా చార్చ్ అవుతుంది. అంటే ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన పని లేకుండా చేస్తుంది. 

మారుతి సుజుకి గ్రాండ్ విటారా

దేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చిన క్రెడిట్ మారుతీ సుజుకి కంపెనీకే దక్కుతుంది. గ్రాండ్ విటారాతో మార్కెట్‌ లెక్కల్నే మార్చేశారు. టొయోటా భాగస్వామ్యంతో డెవలప్ చేసిన ఈ కార్‌లోని 1.5 లీటర్‌ ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ఇంజిన్ అద్భుతాలు చేస్తోంది. ఇది సిటీ ట్రాఫిక్‌ 60 శాతం ఈవీ మోడ్‌లో రన్ అవుతుంది. అందుకే ఈ కారు మైలేజీ 27.97కిలోమీటర్లుగా చెబుతున్నారు. రోజువారి ప్రయాణాలకు, ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడానికి మంచి ఎంపికా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఈ-సీవీటీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఉంది. దీని వల్ల డ్రైవింగ్ మరింత సులభమవుతుంది. 

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 

మారుతి గ్రాండ్ విటారాకు ట్విన్ బ్రదర్ లాంటిదే ఈ టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ జపాన్ టెక్నాలజీ దిగ్గజం టొయోటా స్వయంగా తయారు చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఇందులో అమర్చారు. దీనిలోని 1490 cc త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కంబైన్ అయి 115 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. మైలేజ్ పరంగా ఇది కూడా లీటరుకు 27.97 km ఇస్తోంది. 

హోండా సిటీ హైబ్రిడ్ e:HEV

సెడాన్ కార్ల లవర్స్ కోసం హోండా కంపెనీ తీసుకొచ్చిన మాస్టర్ పీస్ హోండా సిటీ హైబ్రిడ్ e:HEV. దేశంలో సెడాన్ సెగ్మెంట్‌లో మొట్టమొదటి ప్యూర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ ఇదే. ఇందులో మల్టీ మోడ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంటుంది. హోండా సిటీ హైబ్రిడ్‌లో 1.5-లీటర్ అట్కిన్‌సన్ సైకిల్‌ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు జతచేశారు. ఇది లీటరుకు 27.13 km మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ మాత్రమే కాదు, ఇందులో సేఫ్టీ కోసం హోండా సెన్సింగ్ టెక్నాలజీని కూడా అందించారు. లగ్జరీ లుక్, ప్రీమియం కంఫర్ట్,  అదిరిపోయే మైలేజ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

మారుతి సుజుకి ఇన్విక్టో 

పెద్ద ఫ్యామిలీస్ కోసం, 7-సీటర్‌ లగ్జరీ ప్రీమియం MPV సెగ్మెంట్‌లో మైలేజ్ కింగ్ అనిపించుకుంటోంది ఈ మారుతి సుజుకి ఇన్విక్టో. టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా మారుతి సుజుకి రీబ్యాడ్జ్ చేసి లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఇది. ఇంత పెద్ద సైజ్ ఉన్నప్పటికీ, ఇందులోని 2.0లీటర్‌ పవర్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ వల్ల లీటరుకు ఏకంగా  23.24 km మైలేజ్ ఇస్తుంది. నార్మల్ పెట్రోల్ ఆటోమేటిక్ 7-సీటర్ కార్లు లీటరుకు కనీసం 10 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడమే కష్టంగా ఉన్న తరుణంలో, ఇన్విక్టో డబుల్ మైలేజ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కెప్టెన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.