Best 125cc Scooters India: స్కూటర్ కొనేప్పుడు చాలా మంది రెండు విషయాలను ముఖ్యంగా చూస్తారు - వేగం & కంఫర్ట్‌. ప్రతిరోజూ సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణం చేసే, దాదాపు ఐదున్నర అడుగులు ఎత్తున్న వాళ్లకు ఈ రెండూ చాలా ముఖ్యం. పైగా మీ బడ్జెట్‌ రూ.2 లక్షల వరకు ఉంటే, సిటీ రైడ్స్‌లో దూకుడైన పికప్‌, సాఫ్ట్‌ సస్పెన్షన్‌, నమ్మదగిన బ్రేకింగ్‌, అలాగే లాంగ్‌ రైడ్స్‌లో కూడా అలసట రాకుండా ఉండే రైడింగ్‌ పొజిషన్‌ వంటి విషయాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మీరు 110సీసీ స్కూటర్‌ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి మైలేజ్‌ కోసం బాగానే ఉంటాయి, కానీ సిటీ ట్రాఫిక్‌లో త్వరగా స్పందించే పవర్‌ఫుల్‌ పికప్‌ మాత్రం పెద్దగా ఇవ్వవు.

Continues below advertisement

బెస్ట్‌ చాయిస్‌ 125సీసీ సెగ్మెంట్‌125సీసీ క్లాస్‌లో స్పీడ్‌ అండ్‌ కంఫర్ట్‌ విషయంలో రెండు స్కూటర్లు స్పష్టంగా ముందుంటాయి - Suzuki Access 125 & TVS Ntorq 125. ఇవి రెండూ వేగంగా స్పందించే ఇంజిన్‌, స్మూత్‌ క్రూయిజింగ్‌, బాగా సెట్టయ్యే సస్పెన్షన్‌, అలాగే 5'6" పొడవున్న రైడర్లకూ కంఫర్ట్‌గా ఉండే రైడింగ్‌ పొజిషన్‌తో బాగా ఆకర్షిస్తాయి.

Continues below advertisement

Suzuki Access 125 - సిటీకి పర్ఫెక్ట్‌ కంఫర్ట్‌ + మైలేజ్‌యాక్సెస్‌ 125 అంటే చాలామందికి వచ్చే ఫస్ట్‌ ఇంప్రెషన్‌... లైట్‌వెయిట్‌, స్మూత్‌ ఇంజిన్‌ & సూపర్‌ కంఫర్ట్‌. ఉదయం రష్‌ అవర్‌లో బ్రిడ్జ్‌ మీదకు ఎక్కాల్సినా, గ్రీన్‌ సిగ్నల్‌ పడిన వెంటనే క్షణం ఆగకుండా దూసుకుపోవాలన్నా యాక్సెస్‌ పికప్‌ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. స్కూటర్‌ హ్యాండ్లింగ్‌ కూడా చాలా ఈజీ, ట్రాఫిక్‌ గుండా సునాయాసంగా తీసుకెళ్లొచ్చు. 40 కి.మీ. డైలీ రైడ్‌ చేసే వాళ్లకైతే సీటు కంఫర్ట్‌ కూడా బాగుంటుంది.

TVS Ntorq 125 - స్పోర్టీ రైడర్స్‌కి బెస్ట్‌ చాయిస్‌మీకు వేగం అంటే చాలా ఇష్టం అయితే, ఎన్‌టార్క్‌ 125 మీ కోసమే తయారైంది అనిపిస్తుంది. పికప్‌ చాలా అగ్రెసివ్‌, ట్రాఫిక్‌లో గ్యాప్‌ కనిపించగానే ఒక్కసారిగా వెళ్లిపోతుంది. బ్రేకింగ్‌, రోడ్‌ గ్రిప్‌, స్టెబిలిటీ అన్నీ ఈ క్లాస్‌లో బెస్ట్‌. డిజైన్‌ కూడా యంగ్‌ & స్పోర్టీగా కనిపిస్తుంది. అందుకే 40+ ఏళ్ల రైడర్స్‌కి కూడా ఇది చాలా కంఫర్ట్‌గా & రైడింగ్‌ ఫన్‌గా అనిపిస్తుంది.

125సీసీ కన్నా బెటర్‌మెంట్‌కు వెళ్తే?మీ బడ్జెట్‌ రూ.2 లక్షల వరకు ఉంటే TVS Ntorq 150 కూడా ఒక మంచి ఆప్షన్‌. 125ccతో పోలిస్తే ఇది ఇంకా శక్తిమంతమైన ఇంజిన్‌తో వస్తుంది. హైవే మీద కూడా ఈజీగా గంటకు 70-80 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. కానీ సిటీ రైడ్స్‌ కోసమే ఎక్కువగా ఉపయోగించాలనుకుంటే 125cc మోడల్స్‌ సరిపోతాయి.

మీరు దాదాపు 5'6" పొడవు ఉంటే ఏ స్కూటర్‌ బెటర్‌?

Suzuki Access 125 - చాలా ఈజీ, సీటు తక్కువ ఎత్తుతో ఉంటుంది

TVS Ntorq 125 - కొంచెం ఎత్తుగా ఉన్నా రైడింగ్‌ పొజిషన్‌ కంఫర్ట్‌గా ఉంటుంది

TVS Ntorq 150 - హైటు మీకు సరిపోతుంది, బలమైన ఫీలింగ్‌ ఇస్తుంది

మీ రైడింగ్‌ స్టైల్‌ ఏదైనా, పై మూడింట్లో మీకు ఒక స్కూటర్‌ ఖచ్చితంగా సరిపోతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.