Maruti Victoris Price Mileage Specifications: మంచి కారు కొనాలనుకునే వాళ్లందరిదీ ఒకటే ఆలోచన - “మైలేజ్ బాగుండి డబ్బు ఆదా కావాలి, బాడీ స్ట్రాంగ్‌గా ఉండి ఫ్యామిలీకి భద్రత ఉండాలి.” ₹15 లక్షల బడ్జెట్‌లో ఈ రెండు లక్షణాలు కలిపి దొరకడం కాస్త కష్టం. కానీ ఇప్పుడు మారుతి సుజుకి తీసుకొచ్చిన మారుతి విక్టోరిస్ ఆ గ్యాప్‌ను ఈజీగా ఫిల్ చేస్తోంది.
Maruti Victoris - స్టైలిష్‌గా, బలంగామారుతి విక్టోరిస్ డిజైన్ కాస్త SUV తరహాలో ఉంటుంది. బాడీ స్ట్రక్చర్ దృఢంగా ఉండటంతో రోడ్డు మీద స్టేబిలిటీ బాగుంటుంది. హైవే మీద కూడా హ్యాండ్లింగ్ సెక్యూర్డ్‌గా అనిపిస్తుంది. మారుతి తమ కొత్త మోడళ్లలో ఉపయోగిస్తున్న హై-టెన్సైల్ స్టీల్, ఈ కారు బాడీ స్ట్రెంగ్త్‌కి అదనపు బలం ఇస్తుంది.
మారుతి అంటే మైలేజ్‌మారుతి విక్టోరిస్ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ కాంబినేషన్‌లో లీటరుకు దాదాపు 22 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. అంటే సిటీ డ్రైవింగ్‌తో పాటు హైవే ట్రిప్స్‌కి కూడా ఇది పర్ఫెక్ట్ పార్ట్‌నర్. ఫ్యూయల్ ఖర్చు తగ్గి, మెంటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది - అంటే పొదుపు ఎక్కువగా ఉంటుంది!.
కంఫర్ట్ కూడా మామూలుగా లేదువిక్టోరిస్ ఇంటీరియర్‌లో మారుతి కొత్త డిజైన్ ఫిలాసఫీని ఫాలో అయింది. కేబిన్ స్పేస్ బాగుంది, వెనుక సీట్లో లెగ్‌రూమ్ సరిపడా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు లేదా ఫ్యామిలీ ట్రిప్స్ చేసే వాళ్లకు ఇది చక్కగా సరిపోతుంది. సస్పెన్షన్ సెటప్ బలమైన రోడ్లను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.
ధర & వేరియంట్లుతెలుగు రాష్ట్రాల్లో మారుతి విక్టోరిస్ ధర ₹10,49,900 ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్-రోడ్ ధరతో కలుపుకుని ₹15 లక్షల లోపే మంచి ఫీచర్స్, మైలేజ్, బాడీ స్ట్రెంగ్త్ అన్నీ దొరుకుతున్నాయి. ఇది మాన్యువల్ వెర్షన్‌లో అందుబాటులో ఉండి, ఫీచర్ల పరంగానూ బాగానే బ్యాలెన్స్ అయ్యింది.
హైదరాబాద్, విజయవాడ వంటి మార్కెట్లలో మారుతి విక్టోరిస్ డిమాండ్ పెంచుకుంటోంది. ఈ కారును దీర్ఘకాలం వాడాలనుకునే వాళ్లకు మారుతి సర్వీస్ నెట్‌వర్క్ కూడా ఒక ప్లస్ పాయింట్.
₹15 లక్షల లోపే “మైలేజ్ కూడా బాగుండాలి, బాడీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి” అనుకునే వాళ్లకు మారుతి విక్టోరిస్ పెట్రోల్ మాన్యువల్ ఓ స్మార్ట్ ఆప్షన్. ఇది యువతకీ, ఫ్యామిలీ యూజ్‌కీ సరిపోయే పర్ఫెక్ట్ కాంబినేషన్. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ బడ్జెట్‌లో ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, బాడీ బలం, బ్రాండ్ నమ్మకం - ఈ మూడు ఒకే కారులో కావాలంటే, విక్టోరిస్ గురించి కచ్చితంగా ఆలోచించవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.