Jeep Meridian Review 2025: కారు కొనేప్పుడు... ప్రతిరోజూ ఉపయోగం ఎంత, ఏడాదిలో ఎంతదూరం లాంగ్ ట్రిప్స్‌కి వెళ్లాలి, బడ్జెట్ ఎంత, కారులో లగ్జరీ ఫీలింగ్ ఉండాలి వంటి విషయాలను ప్రతి ఒక్కరూ చూసుకుంటారు. మీరు రోజూ సుమారు 20 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తూ, సంవత్సరంలో ఒకటి-రెండు సార్లు 1000 కిలోమీటర్ల లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తే, రూ.30-40 లక్షల బడ్జెట్‌లో మీకు పర్ఫెక్ట్‌గా సరిపడే SUVల్లో జీప్ మెరిడియన్ ముందు వరుసలో నిలుస్తుంది.
జీప్ మెరిడియన్ ఎందుకు?మొదటి మాట - జీప్ అనే బ్రాండ్‌కే ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. రోడ్డుపై నడిపినప్పుడు లగ్జరీ & ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. పైగా మెరిడియన్ 5-సీటర్, 7-సీటర్ రెండు వేరియంట్లలో దొరుకుతుండటం మంచి లాభం. చిన్న కుటుంబం అయినా, పెద్ద కుటుంబం అయినా, మీ అవసరానికి సరిపోయే కాన్ఫిగరేషన్ తీసుకోవచ్చు.
శక్తిమంతమైన 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్మెరిడియన్ హార్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇది ప్రశాంతంగా, సాఫ్ట్‌గా నడుస్తూనే శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో జంప్ కావాలన్నా, హైవేపై 120 కి.మీ. స్పీడ్‌తో కూడా స్మూత్ క్రూయిజ్ కావాలన్నా ఈ ఇంజిన్ నచ్చక మానదు. రోజూ 20 కి.మీ. డ్రైవ్ చేసేవాళ్లను ఇది అస్సలు ఇబ్బంది పెట్టదు. స్టార్ట్–స్టాప్ ట్రాఫిక్‌లో కూడా ఇంజిన్ రెస్పాన్స్ బాగా విభిన్నంగా ఉంటుంది.
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ - ఈ క్లాస్‌లో బెస్ట్‌మెరిడియన్‌లో ఉన్న 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా పని చేస్తుంది. గేర్ మార్పులు ఆలస్యం లేకుండా, సైలెంట్‌గా జరుగుతాయి. ఇది సిటీ డ్రైవింగ్‌లో పెద్ద ప్రయోజనం. పైగా లాంగ్ ట్రిప్‌లో గంటల తరబడి డ్రైవ్ చేస్తూ ఉన్నా డ్రైవర్‌కి అలసట రాకుండా సాఫ్ట్ డ్రైవింగ్ అనుభవం ఇస్తుంది.
సిటీ డ్రైవింగ్‌లో ఈజీఎత్తైన SUV అయినప్పటికీ, మెరిడియన్ స్టీరింగ్ చాలా లైట్. యూ-టర్న్‌లు, ట్రాఫిక్‌లో లేన్లు మార్చడం, పార్కింగ్ వంటివన్నీ ఆశ్చర్యకరంగా ఈజీగా జరిగిపోతాయి. రోజూ దాదాపు 20 కి.మీ. డ్రైవ్ చేసే డాక్టర్లు, ఇంజినీర్లు, టెకీలు, ఇతర ప్రొఫెషనల్స్ తమ పని ప్రదేశాలకు త్వరగా వెళ్లేందుకు ఈ కారు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.
హైవేలో కంఫర్ట్ + స్టెబిలిటీ అద్భుతం1000 కి.మీ. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు కారు రోడ్డుపై స్థిరంగా ఉండాలి. బాడీ రోల్ తక్కువగా ఉండాలి. క్యాబిన్ నాయిస్ ఇబ్బంది పెట్టకూడదు. మెరిడియన్ ఈ మూడు విషయాల్లోనూ టాప్ క్లాస్. హైవేలో 100+ కి.మీ. వేగంలో కూడా ఈ కారు చాలా స్టేబుల్‌గా ఉంటుంది. సస్పెన్షన్ ట్యూనింగ్ అద్భుతంగా ఉండటం వల్ల రోడ్ బంప్స్ పెద్దగా అనిపించవు.
ఇంటీరియర్ - ప్రీమియం, లగ్జరీలగ్జరీ అనిపించే కారు కావాలంటే, ఇంటీరియర్ క్వాలిటీ చాలా ముఖ్యం. మెరిడియన్ క్యాబిన్ నిజంగా ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది. సీట్లు సపోర్టివ్‌గా, లెదర్ క్వాలిటీ బెస్ట్‌గా, డాష్‌బోర్డ్ లేఅవుట్ మోడర్న్‌గా ఉంటుంది. లాంగ్ జర్నీల్లో సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది.
ఫీచర్లు కూడా ఫుల్‌వెంటిలేటెడ్ సీట్లు, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్, 360° కెమెరా, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు - ఇవన్నీ ఈ SUVలో అందుబాటులో ఉంటాయి.
మీరు మధ్యవయసులో (40+ ఏజ్) ఉన్న ప్రొఫెషనల్ అయితే... రోజూ సిటీ డ్రైవ్‌లో ఈజీగా నడిచే, లాంగ్ ట్రిప్‌లో స్థిరంగా, కంఫర్ట్‌గా అనిపించే, బ్రాండ్ విలువ ఉన్న లగ్జరీ SUV కావాలంటే Jeep Meridian మీ బడ్జెట్‌లో స్మార్ట్ ఎంపిక అని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.