Budget Cars: భారతీయ రహదారులపై ఎస్‌యూవీల హవా పెరుగుతున్నప్పటికీ, సామాన్యుడికి ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్ కార్లే మొదటి ఎంపిగా ఉంటోంది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించడానికి, ఇరుకైన సందుల్లో పార్కింగ్‌ చేయడానికి, తక్కువ నిర్వహణ ఖర్చుతో కారు నడపాలనుకునే వారికి ఐదు లక్షల లోపు లభించే కార్లు వరంలాంటివి. ఈ విభాగంలో ఉన్న ఏడు బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం. 

Continues below advertisement

మారుతి సుజుకి ఎస్‌ప్రెస్సో:- ఈ జాబితాలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే. దీని ఎక్స్‌ షోరూమ్ ధర 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకు ఉంటుంది. ఇది లీటర్‌కు 21.4 నుంచి 32.7 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. పెట్రోల్‌, సీఎన్జీ వేరియెంట్లలో లభిస్తుంది. 

మారుతి సుజుకి ఆల్టో కే10:- దశాబ్దాలుగా మధ్యతరగతికి నమ్మకమైన కారుగా ఉన్న ఆల్టో కే 10 ధర 3.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 24.4 నుంచి 33. 9 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ అత్యంత పొదుపైన కారుగా నిలిచింది. ఇందులో ఆటోమేటిక్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. 

Continues below advertisement

రెనాల్ట్‌ క్విడ్‌:- స్టైలిష్‌ లుక్ కోరుకునే వారికి క్విడ్ మంచి ఎంపిక. 4.30 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు 21. 7 నుంచి 22. 5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్‌, ఎస్‌యూవీ వంటి రూపం దీనికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.

టాటా టియాగో:- ఈ విభాగంలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కలిగిన కారు టాటా టియాగో . దీని ధర 4.57 లక్షల నుంచి ప్రారంభమై 8.10 లక్షల వరకు ఉంటుంది. గ్లోబల్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో దీనికి 4 స్టార్ రేటింగ్ ఉంది. ఇది ప్రయాణికుల భద్రతకు హామీ ఇస్తుంది. 

మారుతి సుజుకి సెలెరియో: అత్యధిక మైలేజీని ఆశించే వారి కోసం సెలెరియో రూపొందించారు. ఇది లీటర్‌కు గరిష్టంగా 34.4 కిలోమీటర్లు(సీఎన్జీ) మైలేజీని అందిస్తుంది. దీని ప్రారంభ ధర 4.70లక్షలుగా ఉంది. 

సిట్రోయెన్ సీ3:- యూరోపియన్ స్టీలింగ్, సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారి కోసం సిట్రోయెన్ సీ3 అందుబాటులో ఉంది. దీని ధర 4.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 18.3 నుంచి 19.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

మారుతి సుజుకి వాగన్‌‌ ఆర్:- కుటుంబ అవసరాలకు ఎక్కువ స్థలం కావాలనుకునే వారికి వాగన్ ఆర్ సరైన ఎంపిక. 4.99 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు 20.5 నుంచి 33. 5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.    మీరు తక్కువ ధరకు సిటీ డ్రైవింగ్ కోసం అయితే ఎస్‌ ప్రెస్సో లేదా ఆల్టో కే 10 కొనుక్కోవచ్చు. భద్రతే ముఖ్యమనుకుంటే మాత్రం 4 స్టార్ రేటింగ్ ఉన్న టాటా టియాగోను ఎంచుకోవచ్చు. మైలేజీ కావాలనుకుంటే మారుతి సెలెరియో లేదా వాగన్ ఆర్ మంచివి.. స్లైల్, డిజైన్ కోరుకుంటే రెనాల్ట్ క్విడ్ లేదా సిట్రోయెన్ సీ3 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.