Electric Motorcycle 2025 Diwali Discounts India: భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా ఎదుగుతోంది. అందుకే, ఈ దీపావళి సీజన్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి బంగారు అవకాశంగా మారింది. ఇప్పుడు, చాలా ప్రముఖ కంపెనీలు స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్లతో ముందుకొచ్చాయి. మీ కోసం... పెర్ఫార్మెన్స్, రేంజ్, ఫీచర్లు అన్నీ అద్భుతంగా కలిపిన టాప్ 5 ఎలక్ట్రిక్ బైకులు ఇవి:
1. Oben Rorr EZ Sigma
మన దేశ రోడ్లకు తగిన విధంగా రూపొందించిన ఈ బైక్ నిండా స్మార్ట్ ఫీచర్లే. 3.4 kWh వేరియంట్ రూ.1.29 లక్షలకు, 4.4 kWh వేరియంట్ రూ.1.39 లక్షలకు లభిస్తుంది (ఎక్స్-షోరూమ్ ధర). టాప్ స్పీడ్ 95 kmph, 0-40 kmph వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుంది. దీని రైడింగ్ రేంజ్ 175 కి.మీ.
ఫీచర్లు - 5 అంగుళాల TFT డిస్‌ప్లే, రివర్స్ మోడ్, GPS సెక్యూరిటీ, రిమోట్ డయాగ్నస్టిక్స్ వంటి స్మార్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 0-80% కేవలం 1.5 గంటల్లో పూర్తవుతుంది.
దీపావళి ఆఫర్: రూ.35,000 వరకూ బెనిఫిట్స్ - రూ.20,000 డిస్కౌంట్, ₹10,000 క్యాష్‌బ్యాక్, గోల్డ్ కాయిన్, ఐఫోన్ గెలుచుకునే ఛాన్స్!
2. Revolt RV400
కమ్యూటర్ సెగ్మెంట్‌లో ప్రజాదరణ పొందిన ఈ మోడల్ ₹1.24 లక్షల నుంచి ₹1.40 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వరకు లభిస్తుంది. 3 రైడ్ మోడ్స్ ఉన్నాయి - ఈకో (150 కి.మీ. రేంజ్), నార్మల్, స్పోర్ట్.
3.24 kWh బ్యాటరీ 0-80% ఛార్జ్ కావడానికి 3.5 గంటలు మాత్రమే పడుతుంది. LED లైట్స్, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, 200 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో రగ్గ్డ్ లుక్స్‌తో కనిపిస్తుంది.
3. Ola Roadster X
ఓలా నుంచి వచ్చిన ఈ బైక్ 11 kW మోటర్‌తో దూసుకెళ్తుంది. X+ వేరియంట్ టాప్ స్పీడ్ 125 kmph, రేంజ్ గరిష్ఠంగా 501 కి.మీ.
7 అంగుళాల టచ్ స్క్రీన్, బ్రేక్-బై-వైర్ సిస్టమ్, జియోఫెన్సింగ్, OTA అప్‌డేట్స్‌తో సూపర్ ఫీచర్లు అందిస్తుంది. రైడ్ మోడ్స్ - ఈకో, నార్మల్, స్పోర్ట్స్.
4. Matter Aera
ఇది దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. 10 kW మోటర్, 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 5 kWh బ్యాటరీతో 125 కి.మీ. రేంజ్ ఇస్తుంది.
₹1.73 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉన్న ఈ బైక్.. 7 అంగుళాల టచ్ స్క్రీన్, స్మార్ట్ పార్క్ అసిస్ట్, కీ లెస్ ఎంట్రీ వంటి టెక్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.
5. PURE EV EcoDryft
ఈ బైక్ సిటీ రైడర్లకు పర్ఫెక్ట్. ధర ₹99,999 (సబ్సిడీతో) నుంచి ₹1.15 లక్షల వరకు ఉంటుంది.
3.0 kWh బ్యాటరీ ఉంది. 3 kW మోటర్‌తో ఈ ఈవీ 130 కి.మీ. రైడింగ్ రేంజ్ ఇస్తుంది. గంటకు 75 km టాప్ స్పీడ్‌తో పరుగులు తీస్తుంది.
డిజిటల్ డాష్, రీజనరేటివ్ బ్రేకింగ్, మూడు రైడ్ మోడ్స్ (డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్) ఉన్నాయి, ఇవన్నీ ఈ బైక్‌ని ప్రాక్టికల్‌గా మార్చాయి.
ఈ దీపావళి ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే, Oben Rorr EZ Sigma అత్యుత్తమ ఆల్ రౌండర్. లాంగ్ రేంజ్, కంఫర్ట్, స్మార్ట్ ఫీచర్లు అన్నీ కలిపిన “ఫెస్టివల్ హిట్” బైక్ ఇదే!.