Diwali 2026 Deals On Electric Cars: దీపావళి పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇది మంచి అవకాశం. ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ తగ్గింపులు ప్రకటించాయి. క్యాష్‌ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్‌, లాయల్టీ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. చిన్న ఎలక్ట్రిక్ కార్ల నుంచి పెద్ద కుటుంబాలకు సరిపోయే ఎలక్ట్రిక్ MPVల వరకు అందుబాటులో ఉన్న 9 బెస్ట్ ఆఫర్ల వివరాలు ఇవిగో..

Continues below advertisement

1. Tata Curvv EV: రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు

ఈ దీపావళికి అత్యధిక ఆఫర్లు అందిస్తున్న కార్లలో టాటా కర్వ్ ఈవీ ముందుంది. పాత సిరీస్ ఎక్స్ మోడళ్లపై గరిష్ఠంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల నగదు తగ్గింపు, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. క్రియేటివ్ వేరియంట్‌పై రూ.2.50 లక్షల నగదు తగ్గింపుతో కలిపి మొత్తం రూ.2.85 లక్షల ప్రయోజనం లభిస్తుంది.

Continues below advertisement

కొత్త సిరీస్ ఎక్స్ వేరియంట్లపై రూ.65,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, రూ.30,000 లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి. దీని ధరలు రూ.17.19 లక్షల నుంచి రూ.19.69 లక్షల వరకు ఉన్నాయి.

2. Tata Harrier EV: రూ.2.75 లక్షల వరకు తగ్గింపు

టాటా హారియర్ ఈవీపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఫియర్‌లెస్ ప్లస్, ఎంపవర్డ్ వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.1 లక్ష ప్రత్యేక ఆఫర్, రూ.75,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, రూ.1 లక్ష వరకు లాయల్టీ బెనిఫిట్ ఉన్నాయి.

అడ్వెంచర్ వేరియంట్లపై రూ.75,000 ప్రత్యేక ఆఫర్‌తో కలిపి మొత్తం రూ.2.50 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. హై ఎండ్‌ ఎంపవర్డ్ AWD స్టెల్త్ 75 ACFC వేరియంట్‌పై మాత్రం రూ.2.25 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి.

ధరలు రూ.21.79 లక్షల నుంచి రూ.29.29 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!

3. MG ZS EV: రూ.2.70 లక్షల వరకు ప్రయోజనాలు

ఎంజీ జెడ్ఎస్ ఈవీ కొనుగోలుదారులు రూ.2.70 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌పై రూ.1.80 లక్షలు, ఎగ్జిక్యూటివ్ ప్రోపై రూ.1.85 లక్షలు, ఎక్స్‌క్లూజివ్ ప్లస్, ఎసెన్స్ వేరియంట్లపై రూ.2.15 లక్షల నగదు తగ్గింపు ఉంది.

అన్ని వేరియంట్లపై రూ.20,000 లాయల్టీ బోనస్, రూ.20,000 కార్పొరేట్ తగ్గింపు కూడా లభిస్తాయి. ఇప్పటికే ఎంజీ కారు ఉన్నవారు కొత్త కొనుగోలుదారుని పరిచయం చేస్తే మరో రూ.15,000 ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు, రూ.25,000 విలువైన ఛార్జర్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.20.75 లక్షల వరకు ఉన్నాయి.

4. Tata Tiago EV: రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు

టాటా టియాగో ఈవీ పాత మోడల్ మిగిలిన స్టాక్‌పై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.70,000 నగదు తగ్గింపు, రూ.50,000 ప్రత్యేక ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.

XZ+ లాంగ్ రేంజ్ వేరియంట్‌పై రూ.1 లక్ష నగదు తగ్గింపు, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ కలిపి రూ.1.25 లక్షల ప్రయోజనం ఉంది. మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.11.14 లక్షల వరకు ఉన్నాయి.

5. Tata Punch EV: రూ.1.45 లక్షల వరకు తగ్గింపు

టాటా పంచ్ ఈవీ పాత మోడల్‌పై రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ.1.10 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది.

మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.90,000 నగదు తగ్గింపుతో కలిపి రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. బేస్ స్మార్ట్ వేరియంట్‌పై రూ.60,000 నగదు తగ్గింపు, మొత్తం రూ.95,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.

పాత పంచ్ ఈవీలో 25kWh, 35kWh బ్యాటరీలు ఉన్నాయి. వీటి ప్రకటిత రేంజ్ వరుసగా 315km, 421km వరకు ఉంటుంది. ఈ ఆఫర్లు పాత మోడల్‌కు మాత్రమే వర్తిస్తాయి. కొత్త 40kWh వెర్షన్‌కు వర్తించవు. ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.14.44 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!

6. Kia Carens Clavis EV: రూ.75,000 వరకు ప్రయోజనాలు

పెద్ద కుటుంబాల కోసం ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ కొనాలనుకునేవారికి కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ మంచి ఎంపిక. ఈ కారుపై రూ.75,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.15,000 వరకు కార్పొరేట్ ఆఫర్ ఉన్నాయి. అయితే ఇందులో నగదు తగ్గింపు లేదు. ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాల్లో ఏదో ఒకటి మాత్రమే పొందవచ్చు.

ధరలు రూ.18.04 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉన్నాయి.

7. Hyundai Creta Electric: రూ.65,000 వరకు తగ్గింపు

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై రూ.65,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ (O) లాంగ్ రేంజ్ HC, ఎక్సలెన్స్ లాంగ్ రేంజ్ HC వేరియంట్లపై గరిష్ఠ తగ్గింపు లభిస్తుంది. ఇతర వేరియంట్లపై రూ.50,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్, బుకింగ్ బోనస్‌లు, అప్‌గ్రేడ్ ప్రయోజనాలు ఉన్నాయి. 

ధరలు రూ.18.03 లక్షల నుంచి రూ.23.82 లక్షల వరకు ఉన్నాయి.

8. Tata Nexon EV: రూ.45,000 వరకు ఆఫర్లు

టాటా నెక్సాన్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ.45,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి.

ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.17.89 లక్షల వరకు ఉన్నాయి.

9. Kia Syros EV: రూ.20,000 వరకు ప్రయోజనం

కియా సైరోస్ ఈవీపై రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రత్యేకంగా నగదు తగ్గింపు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేవు. 

ధరలు రూ.13.50 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉన్నాయి.

గమనిక: అన్ని ధరలు భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధరలు. ఆఫర్లు నగరాన్ని బట్టి, వాహన నిల్వను బట్టి మారవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.