Maruti Suzuki Brezza Automatic vs Honda Amaze Automatic: రూ.10 నుంచి రూ.15 లక్షల బడ్జెట్‌లో ఆటోమేటిక్ కారు కొనాలని భావించే వారు ఎక్కువగా చూసే రెండు మోడళ్లు - మారుతి సుజుకి బ్రెజ్జా & హోండా అమేజ్. ముఖ్యంగా డ్రైవర్‌ + నలుగురు సభ్యులు (మొత్తం ఐదుగురు) సౌకర్యంగా ప్రయాణించగలగడం, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, నగరంతో పాటు హైవేపై కూడా మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలను ప్రాధాన్యంగా చూసే వారికి ఈ రెండు కార్లు ఆకర్షణీయమైన ఎంపికలుగా కనిపిస్తాయి. అయితే ఈ అవసరాలన్నింటినీ కలిపి పరిశీలిస్తే మారుతి సుజుకి బ్రెజ్జా ఆటోమేటిక్ మరింత సరైన ఎంపికగా నిలుస్తోంది.

Continues below advertisement

మారుతి సుజుకి బ్రెజ్జాబ్రెజ్జాలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ పనితీరు సాఫీగా ఉండటంతో పాటు దీర్ఘకాలిక విశ్వసనీయతకు కూడా పేరుగాంచింది. దీనికి జత చేసిన 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ భారతీయ రోడ్లు & ట్రాఫిక్ పరిస్థితులకు బాగా సరిపోతుంది. నగరంలో తరచూ ట్రాఫిక్‌లో ప్రయాణించినా డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటుంది. అదే సమయంలో హైవేపై కూడా స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

మైలేజ్ పరంగా కూడా బ్రెజ్జా మంచి సమతుల్య పనితీరును అందిస్తుంది. నగరంలో సరైన ఇంధన సామర్థ్యాన్ని ఇవ్వడమే కాకుండా, హైవే ప్రయాణాల్లో కూడా పెట్రోల్ వినియోగం నియంత్రణలో ఉంటుంది. రోజువారీ వినియోగంతో పాటు అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్‌లు చేసే వారికి ఇది మంచి ఎంపికగా మారుతుంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే

స్పేస్ విషయంలో బ్రెజ్జా అమేజ్ కంటే స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉంది. ఇది SUV కావడంతో క్యాబిన్ వెడల్పుగా ఉంటుంది. వెనుక సీటులో ముగ్గురు ప్రయాణికులు కూర్చున్నా అమేజ్‌తో పోలిస్తే ఎక్కువ సౌకర్యం ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఈ అదనపు స్థలం చాలా ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా బ్రెజ్జా ఎత్తైన సీటింగ్ పొజిషన్‌ను అందిస్తుంది. దీంతో డ్రైవర్‌కు రోడ్డుపై మెరుగైన విజిబిలిటీ లభిస్తుంది. నగర ట్రాఫిక్‌లో వాహనాన్ని నియంత్రించడం సులభంగా ఉండటమే కాకుండా, గుంతలు ఎక్కువగా ఉన్న రోడ్లపై కూడా SUV గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా మరింత నమ్మకంగా డ్రైవ్ చేయవచ్చు.

హోండా అమేజ్హోండా అమేజ్ కూడా మంచి కారే. హోండా ఇంజిన్ విశ్వసనీయత & స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోసం ఈ సెడాన్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే ఇది కాంపాక్ట్ సెడాన్ కావడంతో బ్రెజ్జా అందించేంత క్యాబిన్ స్పేస్ ఇందులో ఉండదు. ముఖ్యంగా వెనుక సీటులో ముగ్గురు ప్రయాణించే సమయంలో కొంత ఇరుకుగా అనిపించే అవకాశం ఉంది. అలాగే SUVతో పోలిస్తే రోడ్ ప్రెజెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?

మీ ప్రధాన అవసరాలు.. వెనుక సీట్‌లో ముగ్గురికి సౌకర్యవంతమైన క్యాబిన్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, నగరం & హైవేలో మంచి మైలేజ్ అయితే మారుతి సుజుకి బ్రెజ్జా ఆటోమేటిక్ అత్యంత సమతుల్యమైన ఎంపికగా నిలుస్తుంది. విశాలమైన ఇంటీరియర్, విశ్వసనీయమైన 1.5 లీటర్ ఇంజిన్, సౌకర్యవంతమైన 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, SUV డ్రైవింగ్ అనుభవం కలిసి దీనిని పూర్తి ప్యాకేజీగా నిలబెడుతున్నాయి.

మొత్తం మీద రూ.10-15 లక్షల బడ్జెట్‌లో కుటుంబ వినియోగానికి, రోజువారీ నగర ప్రయాణాలకు & అప్పుడప్పుడు హైవే ట్రిప్‌లకు సరిపోయే ఆటోమేటిక్ కారు కోసం చూస్తున్న వారికి మారుతి సుజుకి బ్రెజ్జా ఆటోమేటిక్ మరింత ఆచరణాత్మకమైన & విలువైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.