భారత మార్కెట్‌లో బడ్జెట్ ధరలతో పాటు తక్కువ మెయింటనెన్స్ బైకుల కోసం చూస్తుంటారు. తక్కువ నిర్వహణతో పాటు అధిక మైలేజీ అందించే బైక్‌లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. దీనితో పాటు, బైక్ కొనేటప్పుడు మైలేజీని కూడా చెక్ చేస్తారు. మీరు Hero Splendor, హోండా షైన్ (Honda Shine) లేదా బజాజ్ ప్లాటినా (Bajaj Platina) లలో ఒక బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు బైక్ కొనుగోలుకు పూర్తి చెల్లించి కొనవలసిన అవసరం లేదు. మీరు ఈ బైక్‌లలో ఒకదానిని ఫైనాన్స్ ద్వారా తీసుకోవచ్చు. డౌన్ పేమెంట్ ఆధారంగా ప్రతి నెలా ఏ బైక్ EMI చెల్లించి వాహనం పూర్తిగా సొంతం చేసుకోవచ్చు. అయితే ఏ బైక్ చౌకగా ఉంటుంది, మైలేజీ ఇతర వివరాలు మీరు తెలుసుకోవాలి. 

Continues below advertisement

హీరో స్ప్లెండర్ (Hero Splendor)

Hero Splendor డ్రమ్ బ్రేక్-OBD 2B వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 89,196. ఆయా రాష్ట్రాలు, నగరాలను బట్టి ధరలు మారతాయి. bikewale వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఈ బైక్‌ను రూ. 5,000 డౌన్ పేమెంట్ చేసి కొనుగోలు చేస్తే, మీరు దాదాపు రూ. 84,000 లోన్ తీసుకోవాలి. మీరు ఈ లోన్ 3 సంవత్సరాలు లేదా 36 నెలలకు తీసుకుంటే, మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో నెలకు దాదాపు రూ. 3,000 EMI కట్టాలి. మీరు ఇదే లోన్ 4 సంవత్సరాలకు తీసుకుంటే, మీరు నెలకు రూ. 2,436 EMI చెల్లించాలి.

హోండా షైన్ (Honda Shine)

Honda Shine డ్రమ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 94,415గా ఉంది. అయితే రాష్ట్రాలను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి రూ. 5,000 డౌన్ పేమెంట్ చేస్తే, 9.8 శాతం వడ్డీ ప్రకారం, మీ EMI దాదాపు రూ. 3,300 అవుతుంది. మీరు ఈ లోన్ 4 సంవత్సరాలకు తీసుకుంటే, చెల్లించాల్సిన ఈఎంఐ దాదాపు రూ. 2,586 అవుతుంది.

Continues below advertisement

బజాజ్ ప్లాటినా (Bajaj Platina)

Bajaj Platina ES డ్రమ్ వేరియంట్ ధర రూ. 82,626 గా ఉంది. మీరు ఈ బైక్‌ను రూ. 5,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే, 9.8 శాతం వడ్డీ రేటుతో, మీరు 3 సంవత్సరాలకు నెలకు రూ. 2,786 EMI చెల్లించాలి. మీరు 4 సంవత్సరాలకు లోన్ తీసుకుంటే, మీరు రూ. 2,247 EMI చెల్లించాలి.