Best 125cc Motorcycles For College Students: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా బైక్ ఎక్కే రైడర్లయినా, ప్రతిరోజూ కాలేజ్‌కి వెళ్లే స్టూడెంట్స్ అయినా 125cc బైక్స్‌ను మొదట ప్రిఫర్ చేస్తున్నారు. 125cc సెగ్మెంట్ అంటే స్పీడ్, స్టైల్, పర్ఫార్మెన్స్ అన్నీ కలిపిన పర్ఫెక్ట్ ప్యాకేజీ. ఈ బైక్స్ పవర్ బాగుంటుంది, మైలేజ్ కూడా టాప్. అలాగే, రోజువారీ ట్రాఫిక్‌లో కూడా హ్యాండ్లింగ్ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో 125cc బైక్స్ కేవలం కమ్యూటర్స్ మాత్రమే కాదు - యూత్ కోసం స్పోర్టీ లుక్, కొత్త ఫీచర్స్, టెక్ అప్‌డేట్స్ కూడా ఇస్తున్నారు. అందుకే ఈ సెగ్మెంట్ ఇప్పుడు మరింత హాట్ ఫేవరేట్ అయ్యింది. మరి స్టూడెంట్స్ & బిగినర్ రైడర్స్ కొనడానికి బెస్ట్ 5 బైక్స్ ఏవి?, ఒక్కో బైక్‌ని కాస్త డిటైల్‌గా తెలుసుకుందాం.
Honda CB125 Hornet - స్పోర్టీ లుక్‌తో యూత్ ఫేవరెట్
ఎక్స్-షోరూమ్ ధర ₹1.03 లక్షలుHonda CB125 Hornet అంటే 125cc సెగ్మెంట్‌లో స్పోర్టీ డిజైన్‌తో స్టాండ్ అవుట్ అవుతున్న బైక్. 123.94cc ఇంజిన్ నుంచి దాదాపు 11.14 PS పవర్ వస్తుంది. పవర్ డెలివరీ చాలా స్మూత్, సిటీ ట్రాఫిక్‌లో కూడా ఈ బైక్ మంచి పిక్-అప్ ఇస్తుంది. LED హెడ్‌ల్యాంప్స్, షార్ప్ ట్యాంక్ డిజైన్, మస్క్యులర్ స్టాన్స్... ఇవన్నీ యూత్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్. ప్రీమియం ఫీలింగ్ కావాలి, కాని హయ్యర్ సెగ్మెంట్‌కి వెళ్లాలనిపించకపోతే ఇది బాగుంటుంది.
Hero Xtreme 125R - స్టైల్ & ప్రాక్టికాలిటీ మిక్స్
ఎక్స్-షోరూమ్ ప్రైస్ ₹89,000Hero Xtreme 125R పవర్, మైలేజ్, వెయిట్ బ్యాలెన్స్.. అన్నింట్లో బాగానే స్కోర్ చేస్తుంది. 124.7cc ఇంజిన్ నుంచి 11.55 PS పవర్ వస్తుంది. అర్బన్ రైడింగ్‌లో రెస్పాన్స్ చక్కగా ఉంటుంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, అట్రాక్టివ్ టేడ్, స్పోర్టీ స్టాన్స్ ఇవన్నీ స్టూడెంట్స్‌కి నచ్చే పాయింట్స్. “బ్రాండ్ ట్రస్ట్ + మోడర్న్ లుక్” కావాలనుకునే వారికి పర్ఫెక్ట్.
TVS Raider 125 - 125cc సెగ్మెంట్‌లో టెక్నాలజీ కింగ్
ఎక్స్-షోరూమ్ రేటు ₹80,500125ccలో ఫీచర్స్ పరంగా టాప్ ప్లేస్‌లో ఉన్న బైక్ ఇదే. 124.8cc ఇంజిన్ 11.38 PS పవర్ ఇస్తుంది. మైలేజ్ క్లెయిమ్ దాదాపు 72 kmpl, ఇది సూపర్ సేవింగ్. రైడ్ మోడ్స్, డిజిటల్ డాష్, హయ్యర్ వేరియంట్లలో TFT, ట్రెండీ డిజైన్ అన్నీ యూత్‌నే టార్గెట్ చేస్తున్నాయి. దీని తక్కువ వెయిట్ కొత్త రైడర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ట్రాఫిక్‌లో చకచకా కట్ చేసే ఫీలింగ్ బాగా ఉంటుంది.
Bajaj Pulsar N125 - ఒరిజినల్ పల్సర్ DNA 125ccలో
ఎక్స్-షోరూమ్ ధర ₹91,691Pulsar లైనప్ ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ఆ స్పోర్టీ DNA 125ccలోకి వచ్చింది. 124.4cc ఇంజిన్ 11.8 PS పవర్, 10.8 Nm టార్క్ ఇస్తుంది. కర్బ్ వెయిట్ 140 kg, రోడుపై స్టేబుల్‌గా ఉంటుంది. అట్రాక్టివ్‌గా మలిచిన ట్యాంక్, LED ఆక్సెంట్స్, మస్క్యులర్ బాడీతో కూల్ & బోల్డ్ లుక్ కోరుకునే స్టూడెంట్స్‌కి అదిరిపోయే ఆప్షన్.
Honda SP125 - మైలేజ్ బాస్, రోజువారీ రైడింగ్‌కి బెస్ట్
ఎక్స్-షోరూమ్ ప్రైస్ ₹85,564125ccలో బెస్ట్ కమ్యూటర్ అనగానే Honda SP125 టాప్ లిస్ట్‌లోనే ఉంటుంది. 123.94cc ఇంజిన్ నుంచి దాదాపు 10.87 PS పవర్ వస్తుంది. మైలేజ్ క్లెయిమ్ దాదాపు 63 kmpl. వెయిట్ కూడా చాలా తక్కువ - 116 kg. మొదటిసారి బైక్ ఎక్కేవారికి చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలిగే బైక్ ఇది. కంఫర్ట్, రిలయబిలిటీ, హోండా సర్వీస్ - ఈ మూడు కూడా దీనికి పెద్ద ప్లస్‌లు.
మొత్తంగా చూసుకుంటే, బిగినర్స్ & కాలేజ్ స్టూడెంట్స్ కొనడానికి ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో బెస్ట్ 125cc బైక్స్. స్టైల్ కావాలంటే - Raider, Hornet, Xtreme. మజిల్ లుక్ కావాలంటే - Pulsar N125. మైలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే - SP125. మీ బడ్జెట్, యూజ్ కేస్ ఏదైనా కావొచ్చు... ఈ లిస్ట్‌లో మీ ఫేవరెట్ ఖచ్చితంగా ఉంటుంది!.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.