Bajaj Pulsar NS200 On-road Price And Specifications: బజాజ్‌ పల్సర్‌ NS200 - ఈ పేరు వినగానే యూత్‌లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. స్పోర్టీ లుక్‌, పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, స్ట్రీట్‌ నేకడ్‌ డిజైన్‌ కారణంగా పల్సర్‌ NS200 ఇప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ఈ పండుగ సమయంలో మీరు కూడా ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, డబ్బు ఖర్చు చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు ఇవి.

Continues below advertisement

1. పల్సర్‌ NS200 ఇంజిన్‌ పవర్‌ ఎంత?

బజాజ్‌ పల్సర్‌ NS200లో 199.5cc సింగిల్‌ సిలిండర్‌, లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 24.5hp పవర్‌, 18.7Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ సెటప్‌, హైవేలో స్పీడ్‌ ఇష్టపడే వారితో పాటు  సిటీ రైడింగ్‌కు కూడా బాగా సరిపోతుంది. ఇదే ఇంజిన్‌ పల్సర్‌ RS200లో కూడా ఉపయోగిస్తున్నారు.

Continues below advertisement

2. పల్సర్‌ NS200లో వచ్చిన తాజా అప్‌డేట్స్‌

ఇటీవల పల్సర్‌ NS200కు కొన్ని ముఖ్యమైన ఫీచర్‌ అప్‌డేట్స్‌ అందించారు. కొత్త LCD ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, పల్సర్‌ N150 నుంచి తీసుకున్న స్విచ్‌గేర్‌ ఇందులో ఉన్నాయి. బ్లూటూత్‌ కనెక్టివిటీ ద్వారా టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, కాల్‌, నోటిఫికేషన్‌ అలర్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే 2024 నుంచి ఈ బైక్‌లో LED రిఫ్లెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌ కూడా ఇచ్చారు, ఇది రాత్రి రైడింగ్‌లో మంచి విజిబిలిటీ ఇస్తుంది.

3. పల్సర్‌ NS200 - RS200 మధ్య అసలు తేడా ఏమిటి?

పల్సర్‌ NS200 పూర్తిగా స్ట్రీట్‌ నేకడ్‌ డిజైన్‌తో వస్తుంది. ఫెయిరింగ్‌ లేకపోవడం వల్ల గాలి నుంచి రక్షణ ఉండదు. అయితే సింగిల్‌ పాడ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, కన్వెన్షనల్‌ హ్యాండిల్‌బార్‌ కారణంగా రైడింగ్‌ పొజిషన్‌ చాలా రిలాక్స్‌గా ఉంటుంది.ఫెయిరింగ్‌ లేని కారణంగా ఈ బైక్‌ బరువు కూడా తక్కువే. పల్సర్‌ NS200 కర్బ్‌ వెయిట్‌ (ఫ్యూయల్‌, ఆయిల్స్‌ నింపిన తర్వాత) 158 కేజీలు, అదే RS200 166 కేజీలు ఉంటుంది. రోజూ ఆఫీస్‌ రైడింగ్‌ చేసే వారికి ఇది ఒక ప్లస్‌ పాయింట్‌.

4. పల్సర్‌ NS200కి మార్కెట్లో ఉన్న ప్రత్యర్థులు

ఇండియన్‌ మార్కెట్లో పల్సర్‌ NS200కి గట్టి పోటీ ఉంది. ప్రధానంగా Yamaha MT-15, Hero Xtreme 160R 4V, Honda Hornet 2.0 వంటి బైకులు ఈ సెగ్మెంట్‌లో పోటీ పడుతున్నాయి. అయితే పవర్‌, ఇంజిన్‌ కెపాసిటీ పరంగా పల్సర్‌ NS200 కొంచెం ముందే ఉంటుంది.

5. కలర్‌ ఆప్షన్స్‌, ధర వివరాలు

బజాజ్‌ పల్సర్‌ NS200 నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది, అవి: రెడ్‌, బ్లాక్‌, వైట్‌, బ్లూ. ఈ బైక్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) రూ. 1.32 లక్షలు.

హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ధరఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,32,431RTO: ₹ 21,365ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్సివ్‌): ₹ 12,714మొత్తం ఆన్‌రోడ్‌ ధర: ₹ 1,66,510

విజయవాడ ఆన్‌రోడ్‌ ధరఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹ 1,32,072RTO: ₹ 17,349ఇన్సూరెన్స్‌ (కాంప్రహెన్సివ్‌): ₹ 8,063మొత్తం ఆన్‌రోడ్‌ ధర: ₹ 1,57,484

మొత్తంగా చూస్తే, స్ట్రీట్‌ నేకడ్‌ లుక్‌, శక్తిమంతమైన ఇంజిన్‌, నమ్మకమైన బ్రాండ్‌ విలువ కావాలనుకునే వారికి బజాజ్‌ పల్సర్‌ NS200 ఒక మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. మీరు స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడితే, ఈ బైక్‌ తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.