అన్వేషించండి

Bajaj Pulsar N160 EMI: 7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 

అగ్రెసివ్ డిజైన్, అద్భుతమైన పనితీరుతో 160సీసీ విభాగంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ 160. హైదరాబాద్ వంటి నగరాల్లో రోజువారీ రైడ్‌కుఇది పర్ఫెక్ట్‌ ఛాయిస్‌గా నిలుస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Bajaj Pulsar N160 EMI: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో యువతను అత్యంత ఇష్టమైన 160సీసీ బైక్‌లలో బజాజ్‌ పల్సర్‌ N160 ఒకటి. ఇలాంటి ఫేమస్‌ బైక్‌ ఒకేసారి మొత్తం చెల్లించి కొనాల్సిన పని లేదు. కొంత మొత్తాన్ని డౌన్‌ పేమెంట్ చెల్లించి, మిగతా అమౌంట్‌ను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎంత డౌన్‌ పేమెంట్  చెల్లించాలి? ఈఎంఐ ఎంత కట్టాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

హైదరాబాద్‌లో పల్సర్‌ ఎన్‌ 160 అసలు ధర ఎంత?

బజాజ్‌ పల్సర్‌ ఎన్ 160 సింగిల్ సీట్‌ ట్విన్ డిస్క్‌ వేరియంట్‌ హైదరాబాద్‌లో ఎక్స్‌ షోరూమ్‌ ధర 1,13, 835 రూపాయలుగా ఉంది. దీనిపై ఆర్టీవో ఛార్జీలు 18, 575 రూపాయలు, ఇన్సూరెన్స్‌ 11,976 రూపాయలు చెల్లించాలి. మొత్తంగా చూసుకుంటే ఆన్‌ రోడ్‌ ప్రైస్‌ 1,44, 386 రూపాయలు. ఇది హైదరాబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే రేట్ ఉంటుంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర హైదరాబాద్‌లో గరిష్టంగా 1, 58, 713 వరకు ఉంటుంది. 

డౌన్‌పేమెంట్‌, ఈఎంఐ లెక్కలు సంగతేంటీ?

చాలా మంది వినియోగదారరులు బైక్‌ను ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ బైక్ కొనుగోలు చేయాలంటే ముందుగా మీరు 7, 219 రూపాయలు డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి. మిగతా అమౌంట్ చెల్లించేందుకు బ్యాంకులు లోన్‌ ఇస్తున్నారు. దాన్ని మీరు నెల నెల ఈఎంఐ చెల్లించాలి. ఈ అమౌంట్‌ను పది శాతం వడ్డీతో మూడేళ్ల కాలపరిమితికి బైక్‌ లోన్ తీసుకుంటే నెలకు 4, 953 రూపాయలు చెల్లించాలి. ఈ లెక్కలు వేరియంట్‌ను బట్టి, మీరు లోన్ తీసుకునే కాలపరిమితిని బట్టి మారుతూ ఉంటుంది. 

పల్సర్‌ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది?

పల్సర్‌ ఎన్‌ 160 మొత్తం నాలుగు వెర్షన్‌లలో, 13 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా సింగిల్ ఛానల్ ఏబీఎస్‌, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ లేదా అప్‌సైడ్ డౌన్ ఫోర్స్క్‌ కలిగిన వేరియంట్లను ఎంచుకోవచ్చు.  

డిజైన్ అండే పర్ఫార్మెన్స్‌

పల్సర్‌ ఎనస్‌ 160ను ముద్దుగా బ్లాక్ పాంథర్ అని పిలుచుకుంటారు. పల్సర్‌ ఎన్‌ 250 నుంచి ప్రేరణతో దీన్ని డిజైన్ చేశారు. షార్ప్‌ ట్యాంక్ ప్రౌడ్స్, మస్కులర్‌ ఫ్యూయల్‌ ట్యాక్‌, స్లీక్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ దీనికి ఒక అగ్రెసివ్‌స్ట్రీట్ ఫైటర్ రూపాన్ని ఇస్తున్నాయి. ఈ బైక్‌లోని క్లచ‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. హైస్పీడ్‌లో ఉన్నప్పుడు క్లచ్‌తో పని లేకుండానే గేర్లు మార్చవచ్చని చెబుతున్నారు. 

అత్యుత్తమమైన డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ ఈ బైక్ సొంతం. ఇది అత్యవస సమయాల్లో బైక్‌ను సురక్షితంగా ఆపేందుకు సహాయపడుతుంమది. అధికారికంగా ఈ బైక్ లీటరుకు 51 కిలోమీటర్‌ మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంది. వాస్తవ పరిస్థితుల్లో వినియోగదారులు సిటీ ట్రాఫిక్‌లో 42 నుంచి 47 కిలోమీటర్ల వరకు, హైవేలపై గరిష్టంగా 50 కిలోమీటర్లు వరకు మైలేజీని పొందుతుందని రివ్యూలు చెబుతున్నాయి. 

అద్భుతమైన డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్‌, మెరుగైన బ్రేకింగ్, ఫ్యామిలీ మెంబర్స్‌ సులభంగా కూర్చొనేలా ఉండే సింగిల్ సీట్‌ ఆప్షన్‌ దీనికి ప్లస్‌ పాయింట్లు. టర్నింగ్ రేడియస్‌ చాలా ఎక్కువగా ఉందని, దీని వల్ల ఇరుకైన సందుల్లో తిప్పడం కష్టంగా ఉందని ఇదే పెద్ద మైనస్ అని చెబుతున్నారు. 

పోటీ వస్తున్న బైక్స్‌ ఏవీ 

160సీసీ విభాగంలో పల్సర్‌ N160కి గట్టి పోటీ ఉంది. టీవీఎస్‌ అపాచి ఆర్‌టీఆర్‌ 160 4v మార్కెట్‌ల1,46, 094 రూపాయలకే లభిస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 4V ప్రైస్‌ 1,62, 995 రూపాయలు. స్టైలిష్ లుక్‌తో ఉన్న యమహా FZS FI v4 బైక్‌ 1, 52, 185 రూపాయలకు లభిస్తుంది. 
 

Frequently Asked Questions

హైదరాబాద్ లో బజాజ్ పల్సర్ N160 ఆన్-రోడ్ ధర ఎంత?

హైదరాబాద్ లో బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ ట్విన్ డిస్క్ వేరియంట్ ఆన్-రోడ్ ధర సుమారు 1,44,386 రూపాయలు.

బజాజ్ పల్సర్ N160 కొనడానికి ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి?

ఈ బైక్ కొనుగోలు చేయడానికి కనీసం 7,219 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాలి.

బజాజ్ పల్సర్ N160 EMI ఎంత ఉంటుంది?

10% వడ్డీతో మూడేళ్ల కాలపరిమితికి లోన్ తీసుకుంటే, EMI నెలకు సుమారు 4,953 రూపాయలు ఉంటుంది. ఇది మారవచ్చు.

బజాజ్ పల్సర్ N160 మైలేజ్ ఎంత ఇస్తుంది?

సంస్థ ప్రకారం లీటరుకు 51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. వాస్తవానికి నగరంలో 42-47 కిమీ, హైవేలపై 50 కిమీ వరకు వస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
ఈ నెలలో Honda City, Elevate, Amaze కొనేవాళ్లకు భారీ బెనిఫిట్స్‌ - ₹1.97 లక్షల వరకు డిస్కౌంట్
ఈ నెలలో Honda కారు కొనేవాళ్లకు భారీ ఆఫర్లు - హైదరాబాద్, విజయవాడలో ఎంత లాభం?
Hero Pleasure Plus లో మూడు వేరియంట్లు - వాటి మధ్య తేడాలేంటి, ఏది మీకు బెస్ట్ ఆప్షన్?
Hero Pleasure Plus లో మూడు వేరియంట్లు - వాటి మధ్య తేడాలేంటి, ఏది మీకు బెస్ట్ ఆప్షన్?
ఫిబ్రవరి 2026 ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సేల్స్‌: టీవీఎస్‌ టాప్‌, నెలనెలా పడిపోతున్న ఓలా అమ్మకాలు
ఫిబ్రవరి 2026 ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సేల్స్‌: ఎక్కువ మంది కొన్నది ఈ కంపెనీ స్కూటర్లనే!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget