Bajaj Pulsar N125 Details In Telugu: యూత్‌ను లక్ష్యంగా చేసుకుని బజాజ్ ఆటో తీసుకొచ్చిన పల్సర్ N125, ప్రస్తుతం 125cc సెగ్మెంట్‌లో మంచి పాపులారిటీ ఉన్న బండి. స్పోర్టీ డిజైన్, తక్కువ బరువు, మోడ్రన్‌ ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో ఈ బైక్... Hero Xtreme 125R, TVS Raider 125 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Continues below advertisement

ముఖ్యంగా ఇది పాత పల్సర్ 125 మోడళ్ల మాదిరిగా కాకుండా పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. కొత్త ఇంజిన్, కొత్త చాసిస్, సూపర్‌మోటో స్టైల్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ బైక్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే.

1. ధర ఎంత?

Continues below advertisement

బజాజ్ పల్సర్ N125 ప్రస్తుతం ఒకే LED డిస్క్ బ్లూటూత్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీలో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 92,270. పల్సర్ సిరీస్‌లో అత్యంత అందుబాటు ధరలో లభించే బైక్‌లలో ఇది ఒకటి.

విజయవాడలో ఈ బైక్ ఆన్‌రోడ్ ధర సుమారు రూ. 1,18,557 కాగా, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ రేటు రూ. 1,12,561. ఆన్‌రోడ్‌ ధరలో RTO ఛార్జీలు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, హెల్మెట్, ఇతర అవసరమైన అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి.

2. ఇంజిన్ ఎలా ఉంది?

ఈ బైక్‌లో 124.5cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించారు. ఇది 8,500 rpm వద్ద 12 hp పవర్, 6,000 rpm వద్ద 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా ఇంజిన్‌ను ట్యూన్ చేశారు. తక్కువ వేగంలో కూడా సాఫీగా స్పందించడం ఈ బైక్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

3. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

పల్సర్ N125లో ఆధునిక ఫీచర్లకు కొదవ లేదు.

* LED హెడ్‌ల్యాంప్* బ్లూటూత్ కనెక్టివిటీ* కాల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు* మోనోక్రోమ్ LCD డిస్ప్లే* సైలెంట్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్* ఫ్రంట్ డిస్క్ బ్రేక్* రియర్ డ్రమ్ బ్రేక్* టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్* రియర్ మోనోషాక్

ఈ ఫీచర్లు రోజువారీ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

4. ఏయే కలర్లలో లభిస్తుంది?

బజాజ్ ఈ బైక్‌ను మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.

* వైన్ రెడ్ & బ్లాక్* పర్పుల్ & బ్లాక్* గ్రే & లైమ్ గ్రీన్

మూడు రంగులకూ ఒకే ధర ఉంటుంది. యువతను ఆకట్టుకునే స్పోర్టీ గ్రాఫిక్స్ కూడా ఇందులో ఉన్నాయి.

5. బరువు ఎంత?

పల్సర్ N125 కర్బ్ వెయిట్ కేవలం 125 కిలోలు మాత్రమే. దీంతో ఈ సెగ్మెంట్‌లో తక్కువ బరువు కలిగిన బైక్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

తక్కువ బరువు కారణంగా ట్రాఫిక్‌లో సులభంగా నడపవచ్చు. మలుపులు తిరిగేటప్పుడు కూడా చురుకుదనం స్పష్టంగా తెలుస్తుంది. కొత్త రైడర్లకు కూడా ఈ బైక్ సులభంగా హ్యాండిల్ చేయగలిగే విధంగా ఉంటుంది.

కొనవచ్చంటారా?

స్పోర్టీ లుక్, తక్కువ బరువు, ఆధునిక ఫీచర్లు, మంచి పనితీరు కలిగిన 125సీసీ బైక్ కోసం చూస్తున్న వారికి బజాజ్ పల్సర్ N125 మంచి ఎంపికగా నిలుస్తుంది. ముఖ్యంగా నగర ప్రయాణాలకు ఇది సరైన ప్యాకేజీగా చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.