Bajaj Chetak Electric Scooty Launch Range: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, స్కూటీలకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు భరించలేని కస్టమర్లు.. ఎక్కువ రేంజ్, తక్కువ మెయింటెనెన్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు/ స్కూటీల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో, బజాజ్ తన లెజెండరీ స్కూటర్ చేతక్‌ను EV స్కూటీ వెర్షన్‌లో మార్కెట్‌కి తీసుకురాబోతోందని (Bajaj going to introduce a new electric scooty) సమాచారం.
డిజైన్‌లో రాయల్ టచ్‌చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీ.. డిజైన్ రెట్రో లుక్‌ను మోడ్రన్ టచ్‌తో కలిపి తీసుకువస్తుంది. స్మూత్ కర్వ్స్, LED హెడ్‌ల్యాంప్స్, ప్రీమియం మెటల్ బాడీ ఫినిష్‌తో ఈ స్కూటర్ రోడ్డుపై నెక్ట్స్ లెవెల్‌లో కనిపించనుంది. మహిళా రైడర్లను దృష్టిలో పెట్టుకుని, ఈ స్కూటీ తయారీ కోసం లైట్ వెయిట్ అల్యూమినియం ఉపయోగించనున్నారు, దీని వల్ల బాడీ బలంగా ఉండి కూడా ఎక్కువ బరువుగా అనిపించదు.
ఫీచర్ల పరంగా అడ్వాన్స్‌డ్Bajaj Chetak Electric Scooty, కొత్త టెక్నాలజీతో లాంచ్ కానుంది. లాంగ్ రైడ్స్‌లోనూ అసౌకర్యం కలిగించని సీటు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడ్, రేంజ్, బ్యాటరీ స్టేటస్ వంటి డీటైల్డ్ ఇన్ఫో చూపించే డిస్‌ప్లే ఉంటాయని తెలుస్తోంది. అదనంగా IP67 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో రానుంది. తద్వారా, ఇది వర్షాకాలంలో కూడా సేఫ్. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా, రైడింగ్ సమయంలో మరింత సమాచారాన్ని రియల్ టైమ్‌లో పొందవచ్చు.
పెర్ఫార్మెన్స్ హైలైట్స్‌చేతక్ EVలో 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీనివల్ల ఇది సింగిల్ ఛార్జ్‌తో 200 కి.మీ. పైగా కవర్ చేస్తుందని అనధికారిక సమాచారం. రియల్ వరల్డ్ రేంజ్ సుమారు 108 కి.మీ. ఉండవచ్చు. ఈ బండి టాప్ స్పీడ్ గంటకు 60 కి.మీ. వరకు చేరుకుంటుంది. రెండు రైడింగ్ మోడ్స్ - ఈకో & స్పోర్ట్ - దీనిలో అందుబాటులో ఉండవచ్చు. దీని అర్ధం, మీ అవసరానికి తగ్గట్టు పవర్ లేదా బ్యాటరీ సేవింగ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు.
ఛార్జింగ్ స్పీడ్ & రేంజ్‌ఈ స్కూటర్ 3 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. కొత్త టెక్నాలజీతో వచ్చే మోడల్ కావడం వల్ల 200 కి.మీ. పైగా రేంజ్ ఇస్తుందని బజాజ్ చెబుతోంది. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే డైలీ కమ్యూట్ కోసం మరోసారి ఛార్జింగ్ ఆలోచన ఉండదు.
ధర వివరాలుబజాజ్ చేతక్ స్కూటీని రూ. 1,23,000 (బేస్ వెరియంట్) నుంచి రూ. 1,32,000 (టాప్ వెరియంట్) ప్రైస్ రేంజ్‌లో లాంచ్ చేయవచ్చు. హైదరాబాద్, విజయవాడ సహా అన్ని తెలుగు నగరాల్లో కూడా ఇదే రేంజ్ ధర ఉండే అవకాశం ఉంది.
ఎవరికి బెటర్ ఆప్షన్?ఎక్కువ రేంజ్, తక్కువ బడ్జెట్‌లో రాయల్ లుక్ కోరుకునేవారికి ఇది సరైన ఆప్షన్. ఇంధనం ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్న విద్యార్థులు, ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు కోసం ఇది పర్ఫెక్ట్ చాయిస్.
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్లు, రేంజ్ అన్నీ కలిపి ఒక "పర్ఫెక్ట్ ప్యాకేజ్" కాగలదు. రాయల్ లుక్ ఇచ్చే తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్ కొనాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా మంచి అవకాశం అవుతుంది.