Bajaj Chetak Electric Scooter All Variants: చేతక్‌కు మళ్లీ తీసుకువచ్చినప్పటి నుంచి, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మార్కెట్‌లో బజాజ్‌ పేరు మోగిపోతోంది. బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆ ఊపును కొనసాగించడానికి, బజాజ్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ & మార్కెట్ రీసెర్చ్‌ ఆధారంగా తన EVలను నిరంతరం అప్‌డేట్‌ చేస్తోంది. ప్రస్తుతం, బజాజ్‌ చేతక్‌లో అందుబాటులో ఉన్న అన్ని బ్యాటరీ ప్యాక్‌లు, రేంజ్‌ & రేట్ల గురించి తెలుసుకుందాం.

బ్యాటరీ, రేంజ్‌, ఛార్జింగ్ సమయం

3001 వేరియంట్‌ఈ వేరియంట్‌లో అతి చిన్నది 3001 మోడల్‌, దీనిలో 3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది & 127 కి.మీ. రైడింగ్‌ రేంజ్‌ ఇస్తుంది. మునుపటి 2903 వేరియంట్‌ను భర్తీ చేసేందుకు 3001 వేరియంట్‌ను తీసుకొచ్చారు. 3001 ఛార్జింగ్ సమయం బాగా మెరుగుపడింది. 2.9kWh ప్యాక్ 4 గంటల్లో 0-80 శాతం ఛార్జ్‌ అవుతుంది. కొత్త 3kWh యూనిట్ మరికొంచం వేగంగా, 3 గంటల 50 నిమిషాల్లో ఈ రేంజ్‌కు చేరుతుంది. 3001 వేరియంట్‌కు 750W ఛార్జర్‌ ఇస్తున్నారు.

35 సిరీస్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ - 153 కి.మీ. రేంజ్‌3.5kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ 35 సిరీస్‌లోని మూడు వేరియంట్‌లలో లభిస్తుంది - 3501, 3502 & 3503. వీటిలో... 3501 & 3502 రెండూ 153 కి.మీ. రేంజ్‌ను అందిస్తాయి. 3503 వేరియంట్‌ 151 కి.మీ. రేంజ్‌ ఇస్తుంది. 3503 గరిష్ట వేగం 63 కి.మీ. కాగా; మిగిలిన రెండూ (3501, 3502) గంటకు‌ 73 కి.మీ. వేగాన్ని సాధించగలవు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బిగ్‌ 3.5kWh ప్యాక్‌ను, దీని కంటే చిన్నదైన 3kWh బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి పట్టే సమయం కంటే ఎక్కువ టైమ్‌ పట్టదు. ఈ మోడళ్ల కోసం అందిస్తున్న 900W ఛార్జర్ కారణంగా బ్యాటరీలు వేగంగా ఛార్జ్‌ అవుతాయి. 3502 & 3503 పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 గంటల 25 నిమిషాలు పడుతుంది, టాప్-స్పెక్ 3501 కేవలం 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. 

ఫీచర్లు

3001 & 3503 వేరియంట్‌ ఫీచర్లలో పెద్దగా తేడాలు ఉండవు. ఈ రెండిటిలోనూ, కనీస ఫీచర్లయిన మొబైల్ కనెక్టివిటీతో నెగటివ్ LCD డాష్ కనిపిస్తుంది. మరో రూ.4000 ఎక్కువ చెల్లిస్తే... కాల్/మెసేజ్ అలెర్ట్స్‌ను స్క్రీన్‌ మీద చూపించడం, మ్యూజిక్‌ కంట్రోల్‌, రివర్స్ మోడ్, హిల్-హోల్డ్ అసిస్ట్ & గైడ్-మీ-హోమ్ లైట్స్‌ వంటి TecPac యాడ్‌ అవుతుంది. రెండు మోడళ్లలో డ్రమ్ బ్రేక్‌లు ఉపయోగించారు.

3501 & 3502 వేరియంట్లలో యాప్ కనెక్టివిటీతో TFT డాష్ (3501లో ఇది టచ్‌స్క్రీన్ యూనిట్) సహా మరిన్ని ప్రీమియం ఫీచర్లు చూడవచ్చు. TecPac తీసుకుంటే... ఓవర్‌స్పీడ్ అలర్ట్స్‌, గైడ్-మీ-హోమ్ లైట్స్‌, వెహికల్ ఇమ్మొబిలైజేషన్ & మ్యూజిక్ కంట్రోల్‌ వంటి ఫీచర్లు యాడ్‌ అవుతాయి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ ఉన్న వేరియంట్స్‌ ఇవే. 3501లో కీలెస్ ఇగ్నిషన్ & సీక్వెన్షియల్ ఇండికేటర్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

ధరలు

3001 వేరియంట్ ధర మునుపటి 2903 వేరియంట్ కంటే ఎక్కువ అయినప్పటికీ, కొత్త వేరియంట్లలో తక్కువ ధర. సరసమైన వేరియంట్, 3001 వేరియంట్ ధర రూ. 99,900. 

3503 ధర ఇప్పుడు రూ.8 వేలు తగ్గి రూ. 1.02 లక్షలుగా ఉంది. 

3502 ధర రూ.1.22 లక్షలు. 

అగ్రస్థానంలో ఉన్న 3501 ధర రూ.1.35 లక్షలు.