Bajaj Chetak 2026: దేశంలో అత్యంత ఐకానిక్ స్కూటర్ బ్రాండ్‌ చేతక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తన సత్తాను చాటుకుంటోంది. సరికొత్త రికార్డులు సృష్టించేందుకు డిజిటల్ యుగంలో కూడా తన స్థానాన్ని పదిలం చేసేందుకు లేటెస్ట్ అప్‌గ్రేడ్‌తో ఈవీని తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వేగం, దూరం, టెక్నాలజీ మిక్స్ చేసి చేతక్‌  C3501 పేరుతో మార్కెట్‌లోకి వచ్చింది. 

Continues below advertisement

నేటి తరం వాహదారులు కేవలం ప్రయాణం కోసం మాత్రమే కాకుండా, నాణ్యత, నమ్మకాన్ని ఆశిస్తున్నారు. ప్లాస్టిక్ బాడీ కలిగిన ఇతర స్కూటర్ల కంటే చేతక్‌ మెటల్ బాడీ వారిని ఆకట్టుకోనుంది. 

పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణించే వారికి నెలకు కేవలం 472 ఖర్చుతో ది ప్రత్యామ్నాయంగా మారనుంది. బజాజ్‌ ఇప్పుడు చేతక్‌ ఐదు ప్రధాన వేరియంట్లలో అందిస్తోంది.  C3501, C3502,  C3503, C2501 మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో టాప్‌ ఎండ్‌  C3501 బైక్ గరిష్టంగా 153 కిలోమీటర్ల రేంజ్‌, 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది. ఇది ప్రీమియం అనుభూతి ఇస్తుంది. 

Continues below advertisement

బేస్‌ మోడల్‌ C3001 ధర 1,11,006గా ఉంది. ఫీచర్లు పెరిగే కొద్దీ ధర 1,47,507 వరకు మారుతుంది. మీ బడ్జెట్, అవసరాలకు తగినట్టుగా ఈ వేరియంట్‌లో ఏదైనా ఒకదానిని ఎంచుకునే వీలును బజాజ్ కల్పించింది. 

టెక్నాలజీలో బారీ మార్పులు 

కొత్త చేతక్‌లో 5 అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. దీని ద్వారా మీరు ప్రయాణంలో కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్‌ చేయవచ్చు. టెక్‌ప్యాక్‌ యాడ్ ఆన్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్, హిల్-హోల్డ్‌ అసిస్ట్‌, స్పోర్ట్ మోడల్‌ను పొందవచ్చు. 

ఛార్జింగ్‌- రేంజ్

C3501మోడ్‌ 3 గంటల్లోనే 0-80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇంటి దగ్గరే సులభంగా చార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సాధారణ సిటీ ట్రాఫిక్‌లో ఇది 120 నుంచి 140 కిలోమీటర్ల వరకు వాస్తవ రేంజ్ ఇస్తుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. 

చేతక్‌ కొనుగోలును సులభతరం చేసేందుకు బజాజ్ ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ ఆఫర్లను అందిస్తోంది. ప్రారంభ డౌన్‌ పేమెంట్‌ కేవలం రూ. 10,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 9 శాతం వడ్డీ రేటుతో 36 నెలల కాలపరిమితికి నెలకు సుమారు 3,347ఈఎంఐతో ఈ స్కూటర్‌ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి 90 శాతం వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది. డీలర్ల వద్ద దీనిపై సమగ్ర సమాచారం ఉంటుంది. 

చేతక్‌ సీటు 775 ఎంఎం ఎత్తులో ఉంటుంది. దీని వల్ల తక్కువ ఎత్తు ఉన్న వారు కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. స్కూటర్ కింద ఉన్న 35 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ హెల్మెట్‌ లేదా ఇతర వస్తువులను భద్రపరుచుకోవడానికి వీలుగా ఉంటుంది. 

ప్రస్తుతం చేతక్‌ ఏథర్‌ 450ఎక్స్‌,టీవీఎస్‌ ఐక్యూబ్  ఓలా ఎస్‌1ప్రో వంటి స్కూటర్లతో పోటీ పడుతుంది.అయితే దాని మెటల్ బాడీ, క్లాసిక్‌ డిజైన్ దానిని మిగతా కంటే భిన్నంగా ఉంటుంది. చాలా మంది వినియోగదారులు దీనిని స్మూత్ రైటింగ్, సర్వీస్‌ సెంటర్ల లభ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిల్‌ ఏరియాల్లో కూడా దీని డైరెక్ట్‌ డైరెక్ట్‌ డ్రైవ్‌ మోటార్‌ అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని రైడర్లు చెబుతున్నారు.