Bajaj Bikes Under 1 Lakh 2026: రూ.1 లక్ష ధర లోపులో బజాజ్ బైక్‌గానీ, స్కూటర్‌గానీ కొనాలని భావిస్తున్నారా? మీ బడ్జెట్‌లో 8 రకాల బజాజ్‌ బైక్‌లు, స్కూటర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణానికి అనువుగా ఉండే బైక్స్ నుంచి స్పోర్టీ లుక్ కోరుకునేవారికి సరిపోయే మోడళ్ల వరకు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Continues below advertisement

Bajaj Platina 100 ఈ జాబితాలో తక్కువ ధరలో లభించే మోడల్‌ ఇది. దీని ఎక్స్‌-షోరూమ్ ధర రూ.65.41 లక్షలు. ఇందులో 100cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. తక్కువ ఖర్చుతో రోజువారీ ప్రయాణం చేయాలనుకునేవారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక.

Bajaj CT 110Xధర రూ.67.28 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో 115cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. బలమైన డిజైన్‌తో ఈ బైక్ ఆకట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలు, రోజువారీ పనుల కోసం బైక్‌ను ఉపయోగించేవారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.

Continues below advertisement

Bajaj Platina 110బజాజ్ ప్లాటినా 110 ధర రూ.69.28 లక్షలు. ఇందులో 115cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. తక్కువ బడ్జెట్‌లో కొంచెం ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కోరుకునేవారికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది.

Bajaj Freedom 125 NG04బజాజ్ ఫ్రీడమ్ 125 ఎన్‌జీ04 ధర రూ.90.98 లక్షల నుంచి రూ.1.07 లక్షల వరకు ఉంది. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 93 కిలోమీటర్లు. ఈ మోడల్‌కు మూడు వేరియంట్లు ఉన్నాయి. అయితే అన్ని వేరియంట్లు రూ.1 లక్ష లోపు ఉండవు. బడ్జెట్‌ను కచ్చితంగా పాటించాలనుకునేవారు వేరియంట్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి.

Bajaj Pulsar NS125బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్125 ధర రూ.92.18 లక్షల నుంచి రూ.98.40 లక్షల వరకు ఉంది. ఇందులో 124cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. స్పోర్టీ లుక్ కోరుకునే యువతకు ఈ బైక్ ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మైండ్ బ్లోయింగ్ Hero Xoom స్కూటర్ రూ.78 వేలకే.. దీని లోన్‌ వివరాలు, EMI లెక్కలు తెలుసుకోండి

Bajaj Pulsar N125బజాజ్ పల్సర్ ఎన్125 ధర రూ.92.27 లక్షలు. ఇందులో 125cc ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. కంపెనీ పేర్కొన్న మైలేజీ 60 కిలోమీటర్ల వరకు ఉంది. పనితీరు, మైలేజీ రెండింటినీ పరిగణనలోకి తీసుకునేవారికి ఇది ఆసక్తికరమైన ఎంపిక.

Bajaj Pulsar 125బజాజ్ పల్సర్ 125 ధర రూ.93.89 లక్షల నుంచి రూ.1.04 లక్షల వరకు ఉంది. ఇందులో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. రూ.1 లక్ష బడ్జెట్‌లో కొనాలనుకునే వారు ప్రారంభ వేరియంట్లను పరిశీలించవచ్చు.

Bajaj Chetakబజాజ్ చేతక్ ధర రూ.96.40 లక్షల నుంచి రూ.1.34 లక్షల వరకు ఉంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్. అన్ని వేరియంట్లు రూ.1 లక్ష లోపు ఉండవు. పర్యావరణహితంగా ప్రయాణం చేయాలని కోరుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం.

ఇది కూడా చదవండి: మీ బడ్జెట్‌లో వచ్చే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు.. ధర రూ.1 లక్షలోపే, మీరు ఏది తీసుకుంటారు?

పైన చెప్పినవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. కాబట్టి, ఆన్‌రోడ్ ధర, ఫీచర్లు, నిర్వహణ ఖర్చుల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.