Continues below advertisement

Self Driving Three Wheeler Cost In India | జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన తరువాత భారతదేశంలో వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ సైతం విక్రయాలలో టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇటీవల ఒక పెద్ద లాంచింగ్ జరిగింది. వాస్తవానికి, ఒమేగా సీకి మొబిలిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయంప్రతిపత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ (Autonomous Three Wheeler) ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ.4 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ త్రీ-వీలర్‌ను కమర్షియల్ పర్పస్‌లోనూ ఉపయోగించవచ్చు. ఈ త్రీ-వీలర్ ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం?

డ్రైవర్ లేని ఈ ఆటో ధర ఎంత?

ఒమేగా సీకి మొబిలిటీ ప్యాసింజర్ వేరియంట్ ధర రూ. 4 లక్షలు, కాగా కార్గో వేరియంట్ ధర రూ. 4.15 లక్షలుగా ఉంది. దీని కార్గో వేరియంట్‌ను ఇంకా విడుదల చేయలేదు, అయితే త్వరలో కార్గో వేరియంట్ మార్కెట్లోకి రానుంది. ఒమేగా సీకి మొబిలిటీ స్వయం గతిని OSM ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫాం, AI-ఆధారిత స్వయంప్రతిపత్తి సిస్టమ్‌పై తయారు చేసింది. ఈ ఆటోను విమానాశ్రయాలు, స్మార్ట్ క్యాంపస్‌లు, ఇండస్ట్రీయల్ పార్కులు, రద్దీగా ఉండే ప్రదేశాలలో డ్రైవర్ లేకుండా సులభంగా నడపవచ్చు.

Continues below advertisement

త్రీ-వీలర్ ఆటో ఫీచర్లు ఎలా ఉన్నాయి? 

త్రీ-వీలర్‌ ఆటోలో అమర్చిన బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంది. ఇందులో పలు అద్భుతమైన, అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్వయంప్రతిపత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ Swayamgatiలో Lidar, జీపీఎస్ ఉన్నాయి. 

ఒమేగా సీకి మొబిలిటీ కంపెనీ ఈ త్రీ-వీలర్‌లో AI-ఆధారిత గుర్తింపును కలిగి ఉంది. మల్టీ-సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను విమానాశ్రయాలు, టెక్ పార్కులు, స్మార్ట్ సిటీలు, క్యాంపస్‌లు, ఇండస్ట్రీయల్ కారిడార్లను  దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. 

కంపెనీ వ్యవస్థాపకుడు ఏమన్నారు..

ఒమేగా సీకి మొబిలిటీ కంపెనీ వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ.. సెల్ఫ్ డ్రైవింగ్  ప్రారంభించడం అనేది కేవలం ఒక ప్రొడక్టును మార్కెట్‌లోకి తీసుకురావడం మాత్రమే కాదు, భారతదేశ రవాణా వ్యవస్థ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఒక అడుగుగా అభివర్ణించారు. దీంతో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ అనేది వాహనదారుల కల కాదు, నేడు ప్రజల అవసరం అని అన్నారు. AI, LiDAR వంటి టెక్నాలజీని భారతదేశంలో చౌక ధరకే తయారు చేయవచ్చని ఇది నిరూపిస్తుందని పేర్కొన్నారు.