Car Price Hike 2026: కొత్త సంవత్సరం మొదలవుతూనే కార్‌ కొనుగోలుదారుల్లో ఒక సందేహం మొదలైంది. “2026 జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతున్నాయి కాబట్టి, GST తగ్గింపు వల్ల వచ్చిన లాభం అంతా పోతుందా?” అన్నదే ఆ ప్రశ్న. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే, ధరలు కొంత పెరిగినా, మొత్తం లెక్కలో కార్లు ఇప్పటికీ GST 2.0కు ముందు కంటే చౌకగానే ఉన్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

Continues below advertisement

ధరల పెంపునకు కారణం ఇదే2026 జనవరి నుంచి అనేక కార్‌ తయారీ సంస్థలు ధరల పెంపును ప్రకటించాయి. ముడి సరుకుల ఖర్చు పెరగడం, లాజిస్టిక్స్‌ వ్యయం ఎక్కువ కావడం, రూపాయి బలహీనత - ఇవన్నీ ధరల పెంపుకు ప్రధాన కారణాలుగా కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెంపు ఎక్కువగా 2 నుంచి 3 శాతం మధ్యే ఉండడం గమనించాల్సిన విషయం.

మెర్సిడెస్‌ బెంజ్‌మెర్సిడెస్‌ బెంజ్‌ తమ మొత్తం లైనప్‌పై జనవరి 1, 2026 నుంచి గరిష్టంగా 2 శాతం ధరలు పెంచనుంది. GLS వంటి మోడళ్ల ధర సుమారు ₹3 లక్షల నుంచి ₹4 లక్షల వరకు పెరగొచ్చు. C-Class ధర సుమారు ₹1.18 లక్షల నుంచి ₹1.29 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయినా GST తగ్గింపు తర్వాత సెప్టెంబర్‌లో వచ్చిన భారీ తగ్గింపుతో పోలిస్తే, GLS ఇప్పటికీ దాదాపు ₹5 లక్షల నుంచి ₹6 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు చౌకగానే ఉంటుంది.

Continues below advertisement

BMW2025 సెప్టెంబర్‌లోనే ధరలు సవరించిన BMW, జనవరి 2026లో కూడా 2 నుంచి 3 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా పూర్తిగా దిగుమతి చేసే మోడళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 3 సిరీస్‌ ధర సుమారు ₹1.21 లక్షలు, 5 సిరీస్‌ ధర దాదాపు ₹1.45 లక్షలు పెరగవచ్చు. అయితే GST 2.0 తర్వాత వచ్చిన ₹3.5 లక్షల నుంచి ₹10 లక్షల వరకు తగ్గింపుతో పోలిస్తే, కొత్త ధరలు ఇంకా తక్కువగానే ఉంటాయి.

MG మోటార్‌MG వాహనాల్లో మోడల్‌ ఆధారంగా ధరల మార్పు కనిపిస్తోంది. విండ్సర్‌ ధరలు ₹30,000 నుంచి ₹37,000 వరకు పెరిగే అవకాశం ఉంది. కామెట్‌ ధరలు ₹10,000 నుంచి ₹20,000 వరకు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పటికీ, ఈ మోడళ్లు కూడా GST 2.0 ముందు కంటే తక్కువకే లభిస్తాయి. ఆసక్తికరంగా, హెక్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ పాత మోడల్‌తో పోలిస్తే దాదాపు ₹2 లక్షలు తక్కువ ప్రారంభ ధరతో వచ్చింది.

నిస్సాన్‌నిస్సాన్‌ జనవరి 2026 నుంచి గరిష్టంగా 3 శాతం ధరలు పెంచనుంది. మాగ్నైట్‌ వేరియంట్‌ను బట్టి ₹17,000 నుంచి ₹32,000 వరకు పెరగొచ్చు. GST 2.0 తర్వాత మాగ్నైట్‌ ధరలు దాదాపు ₹95,000 వరకు తగ్గింది. కాబట్టి, రేట్లు పెరిగినా కొనుగోలుదారులకు ఇంకా లాభమే ఉంటుంది.

రెనాల్ట్‌రెనాల్ట్‌ క్విడ్‌, కైగర్‌ మోడళ్ల ధరలు ₹8,000 నుంచి ₹21,000 వరకు పెరగవచ్చు. ట్రైబర్‌ బేస్‌ వేరియంట్‌ ధర సుమారు ₹12,000 పెరిగే అవకాశం ఉంది. అయితే గతంలో GST తగ్గింపుతో ఈ కార్ల ధరలు ₹40,000 నుంచి ₹96,000 వరకు తగ్గాయి. అందువల్ల లాభం ఇప్పటికీ కొనుగోలుదారులకే.

2026 జనవరి ధరల పెంపు GST 2.0 వల్ల వచ్చిన ప్రయోజనాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేదు. 2025 చివర్లో ఉన్నంత భారీ సేవింగ్స్‌ ఉండకపోవచ్చు, కానీ GST ముందు ధరలతో పోలిస్తే కార్లు ఇప్పటికీ చౌకగానే ఉన్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్లు, దిగుమతి వాహనాల్లో ధరలు కొంచెం ఎక్కువగా పెరిగినా, మొత్తం లెక్కలో కొనుగోలుదారుడికి నష్టమైతే లేదు.

మొత్తంగా చెప్పాలంటే, కొత్త ఏడాది ధరల పెంపు భయపడాల్సినంత పెద్ద విషయం కాదు. కారు కొనాలనుకుంటున్నవారికి 2026 కూడా ఇంకా అనుకూలంగానే కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.