Kia Carnival Unveiled: కియా ఎట్టకేలకు తన కొత్త కార్నివాల్ ఎంపీవీని రివీల్ చేసింది. ఈ మోడల్‌ను కంపెనీ భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్నివాల్ మోడల్ దేశీయ మార్కెట్లో చాలా కాలంగా ఉంది. అదే సమయంలో ఈ కొత్త తరం మోడల్, దాని ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దదిగా ఉండటమే కాకుండా అనేక కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి.


కొత్త కార్నివాల్ డిజైన్ మునుపటి కంటే చాలా బాగుంది. ఇది ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. 5156 మిల్లీమీటర్ల పొడవు కలిగిన ఈ కారు భారతదేశంలోని పొడవైన కార్లలో ఒకటి. అలాగే ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దది. దీని డాష్‌బోర్డ్‌లో డబుల్ 12.3 అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. అలాగే, ఈ మోడల్ గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.


ఈ MPVలోని స్లైడింగ్ డోర్లు దీని ప్రత్యేక ఫీచర్. లోపలి భాగంలో లగ్జరీ అప్‌హోల్స్ట్రీతో చూడడానికి మంచి స్థలం ఉంది. దీన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా చేయడానికి ADAS, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు అందించారు. కొత్త తరం కార్నివాల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉన్న పెద్ద డీజిల్ ఇంజన్‌పై పని చేయనుంది. విదేశాల మోడల్లో కొత్త కార్నివాల్ పెద్ద పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించారు.


భారతదేశంలో ఈ కారు రీజనబుల్ రేటుకే లాంచ్ అవుతుంది. టయోటా వెల్‌ఫైర్, ఇన్నోవా హైక్రాస్ కంటే చాలా బాగా హైఎండ్ మోడల్. దీని ధర ఇన్నోవా హైక్రాస్ టాప్ ఎండ్ వేరియంట్ రేంజ్‌లో ఉంటుందని అంచనా వేయవచ్చు. సుదీర్ఘమైన, సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం ప్రీమియం ఎంపీవీలకు మంచి డిమాండ్ ఉంది. కియా కొత్త కార్నివాల్ ఆ అవసరాన్ని తీరుస్తుంది.