Ather Rizta Z 2.9kWh Price And Features: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న కంపెనీలలో Ather Energy ఒకటి. కుటుంబ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ విడుదల చేసిన స్కూటర్ Ather Rizta. ఇందులో బేస్ వేరియంట్ S గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసు. అయితే, S కంటే కొంచెం ఎక్కువ ఫీచర్లతో వచ్చిన Rizta Z 2.9kWh వేరియంట్ కూడా మంచి డిమాండ్‌లో ఉంది.
Rizta Z 2.9kWh కొనాలనుకుంటున్న వారు ముందుగా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్య విషయాలు:
1. పవర్ & టాప్ స్పీడ్
Ather Rizta Z 2.9kWh వేరియంట్‌లో 4.3kW పీక్ పవర్ & 22Nm పీక్ టార్క్ లభిస్తుంది. ఈ పవర్‌తో స్కూటర్ Zip మోడ్‌లో 80 కిలోమీటర్ల వేగం వరకు వెళ్లగలదు. ముఖ్యంగా, ఈ పవర్ & టాప్ స్పీడ్ అన్ని Rizta వేరియంట్లలో దాదాపు ఒకేలా ఉంటుంది.
2. S వేరియంట్‌తో పోలిస్తే అదనపు ఫీచర్లు
బేస్ మోడల్ అయిన Rizta S లో సాధారణ ఫీచర్లు మాత్రమే ఉంటాయి. అందులో సెగ్మెంటెడ్ కలర్ LCD డ్యాష్ & బేసిక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అయితే, Rizta Z వేరియంట్‌లో మాత్రం అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో...
7 అంగుళాల టచ్ TFT డిస్‌ప్లే
Google Maps నావిగేషన్
WhatsApp మెసేజ్ ప్రివ్యూ
డాక్యుమెంట్ స్టోరేజ్
Ather యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ
వంటివి ఉన్నాయి. వీటికి అదనంగా Magic Twist రీజెనరేటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ టోన్ సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. కుటుంబంతో ప్రయాణించే వారికి ఇవి మరింత సౌకర్యం కలిగిస్తాయి.
3. ఛార్జింగ్ టైమ్
Ather కంపెనీ ప్రకారం, ఈ స్కూటర్‌ను హోమ్ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 6 గంటల 30 నిమిషాలు పడుతుంది.
0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 8 గంటల 30 నిమిషాలు సమయం పడుతుంది. ఈ ఛార్జింగ్ సమయం Rizta అన్ని వేరియంట్లలో దాదాపు ఒకే విధంగా ఉంటుంది.
4. రేంజ్ ఎంత వస్తుంది?
2.9kWh బ్యాటరీతో వచ్చే ఈ వేరియంట్‌కు కంపెనీ IDC రేంజ్ 123 కిలోమీటర్లు అని ప్రకటించింది.
అయితే, నిజమైన రోడ్డు పరిస్థితుల్లో ఈ స్కూటర్ సుమారు 105 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని పరీక్షల్లో వెల్లడైంది.
ఇక పెద్ద 3.7kWh బ్యాటరీ ఉన్న వేరియంట్‌లో IDC రేంజ్ 159 కిలోమీటర్లు వరకు ఉంటుంది.
5. ధర ఎంత?
Ather Rizta Z 2.9kWh వేరియంట్ ధర ₹1.33 లక్షల నుంచి ₹1.35 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) ఉంటుంది.
ఆన్-రోడ్ ధర విషయానికి వస్తే, ₹1.43 లక్షల నుంచి ₹1.63 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎక్స్ షోరూమ్ ధరతో పాటు RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్ & ఇతర ఖర్చులు కూడా ఉంటాయి.
మొత్తంగా చూస్తే, కుటుంబ వినియోగానికి సరిపోయే స్పేస్, మంచి ఫీచర్లు, సరిపడే రేంజ్‌తో Ather Rizta Z 2.9kWh మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. టెక్నాలజీ ఫీచర్లు కోరుకునే వారికి ఇది మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది.
