Ather Project Redux: ఇండియాలో, ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో చురుగ్గా ఉన్న Ather Energy, మరోసారి తన ఇన్నోవేషన్‌తో హైలైట్‌ అయ్యింది. కంపెనీ CEO తారుణ్‌ మెహతా తాజాగా ప్రకటించిన Project Redux అనే కాన్సెప్ట్ వాహనం, నిజంగానే భవిష్యత్తు రవాణా ఎలా ఉండబోతుందో చూపిస్తోంది.

Continues below advertisement

లీన్ అవ్వగానే స్పీడ్ పెరుగుతుందిRedux కాన్సెప్ట్‌ వాహనం ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఈ బండి మీద ప్రయాణిస్తున్నప్పుడు, కాస్త ముందుకు వంగితే అయితే అది వెంటనే స్పందిస్తుంది. వాహనం తన జ్యామెట్రీని ఆటోమేటిక్‌గా రీ-అడ్జస్ట్ చేసుకుని, సస్పెన్షన్‌ను మార్చుకుని, మరింత వేగంగా, స్థిరంగా ప్రయాణిస్తుంది. అంటే, ఫాంటసీ సినిమా తరహాలో ఇది సూచనలకు స్పందించడమే కాదు, డ్రైవర్‌ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుంది.

నిజమైన కీలెస్ ఎంట్రీ - వింతైన అనుభవంతారుణ్‌ మెహతా చెప్పిన ప్రకారం, “ఈ వాహనం దగ్గరకి మీరు నడుస్తూ వెళ్ళగానే అది మిమ్మల్ని గుర్తిస్తుంది. ఎటువంటి తాళం చెవి, ఎటువంటి హడావిడి అవసరం లేదు. ఇది నిజమైన కీలెస్ ఎక్స్‌పీరియన్స్‌.” అంటే, వాహనం మీ ఉనికిని గుర్తించి ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ టెక్నాలజీ మేజిక్‌ను ఏథర్‌ కొత్త కాన్సెప్ట్‌ వెహికల్‌లో ఉపయోగిస్తారు.

Continues below advertisement

ఫ్యూచరిస్టిక్ డిస్‌ప్లే డిజైన్Redux డాష్‌బోర్డ్ సంప్రదాయంగా ఉండదు. ఈ బండిలో పెద్ద వెర్టికల్ స్క్రీన్ ఉంటుంది. అది కిందికి వంగి మీకు అవసరమైన సమాచారం మాత్రమే చూపిస్తుంది. ఫ్యూచర్‌ డిజైన్‌లో ఇది యూజర్‌ ఫ్రెండ్లీ, డిస్ట్రాక్షన్‌-ఫ్రీ (ఏకాగ్రతను చెడగొట్టని) అనుభవాన్ని ఇస్తుంది.

పర్ఫార్మెన్స్‌తోపాటు ఇన్నోవేషన్Redux ప్రత్యేకతలు కేవలం సాఫ్ట్‌వేర్‌లోనే కాక, హార్డ్‌వేర్‌లోనూ ఉన్నాయి.

సీట్లు 3D ప్రింటెడ్ లాటిస్ మెష్ టెక్నాలజీతో తయారవుతాయి. ఇవి తేలికగా ఉండి, అవసరమైన చోట మాత్రమే ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి, కంఫర్ట్‌కు గ్యారంటీ ఉంటుంది.

బాడీ యాంప్లిటెక్స్‌ (Amplitex) అనే కొత్త హై-పర్ఫార్మెన్స్ మెటీరియల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఇది బరువు తగ్గిస్తుంది కానీ బలం మాత్రం తగ్గదు.

Redux ఎందుకు స్పెషల్?తరుణ్‌ మెహతా మాటల్లో చెప్పాలంటే “Redux ఒక సాధారణ ప్రోటోటైప్ కాదు. దీని ప్రతి భాగం, ఇంటర్‌ఫేస్ నుంచి బాడీ మెటీరియల్ వరకు, అన్నీ రైడర్‌ అనుభవాన్ని కొత్తగా మార్చడానికి రూపుదిద్దుకున్నాయి.

భవిష్యత్‌ మొబిలిటీకి కొత్త దారిRedux కాన్సెప్ట్‌ వాహనం అనేది కేవలం టెక్నాలజీ ప్రదర్శన కాదు. రాబోయే దశాబ్దంలో వాహనాలు ఎలా ఉండబోతాయో వివరించే ఒక ముందస్తు చూపు. కీలెస్‌ ఎంట్రీ, లీన్‌-టు-స్పీడ్ టెక్నాలజీ, 3D ప్రింటెడ్ సీట్లు, తేలికైన యాంప్లిటెక్స్‌ బాడీ - ఇవన్నీ కలిసి, భవిష్యత్‌ తరం Ather వాహనాలు ఎంత ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి.

Ather Energy ఇప్పటికే ఇండియన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు Reduxతో, ఈ కంపెనీ భవిష్యత్‌ వాహనాలకు కొత్త నిర్వచనం చెబుతోంది.