Ather Electric Scooter Price Hike From January: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తక్కువ కాలంలోనే ఫేమస్‌ అయిన తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ నుంచి, కొత్త సంవత్సరం ముందే ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ఈ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ధరల పెంపు ఏథర్ విక్రయిస్తున్న అన్ని మోడళ్లకు వర్తిస్తుంది.

Continues below advertisement

ముడి పదార్థాల ధరల పెరుగుదల, ఫారెక్స్ ఒత్తిడి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ భాగాల ధరలు పెరగడం వంటి అంశాలను ఈ నిర్ణయానికి కారణంగా ఏథర్ వెల్లడించింది. స్కూటర్‌లో ఎలాంటి మార్పులు చేయకపోయినా, తయారీ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.

డిసెంబర్‌లో కొనుగోలు చేస్తే లాభం        

Continues below advertisement

ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుండటంతో, డిసెంబర్ నెలను ఏథర్ ఒక మంచి అవకాశంగా చూపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఎలక్ట్రిక్ డిసెంబర్’ ఆఫర్ కింద, ఎంపిక చేసిన నగరాల్లో రూ.20,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్లు, నగదు ప్రోత్సాహకాలు, అలాగే కొన్ని మోడళ్లకు 8 సంవత్సరాల ఉచిత బ్యాటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఉంది.

Ather Rizta కొత్త ధరలు

ఏథర్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్ ఏథర్ రిజ్టా. ఇది S, Z అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ప్రస్తుతం Rizta S ధర రూ.1,14,546 (ఎక్స్‌-షోరూమ్‌) కాగా, ధర పెంపు తర్వాత ఇది సుమారు రూ.1,17,546 (ఎక్స్‌-షోరూమ్‌) అవుతుంది.

Rizta  Z ప్రస్తుతం రూ.1,34,047 (ఎక్స్‌-షోరూమ్‌) కాగా, కొత్త ధర రూ.1,37,047 (ఎక్స్‌-షోరూమ్‌) ఉండనుంది.       

Ather 450 సిరీస్‌ ధరల వివరాలు      

Ather 450S ప్రస్తుతం రూ.1,22,889 (ఎక్స్‌-షోరూమ్‌) వద్ద లభిస్తోంది. జనవరి నుంచి ఇది రూ.1,25,889 (ఎక్స్‌-షోరూమ్‌) వరకు చేరుతుంది.

Ather 450X ధర ప్రస్తుతం రూ.1,50,046 (ఎక్స్‌-షోరూమ్‌). ధర పెంపు తర్వాత ఇది రూ.1,53,046 (ఎక్స్‌-షోరూమ్‌) అవుతుంది.

ఫ్లాగ్‌షిప్ మోడల్ Ather 450 Apex ప్రస్తుతం రూ.1,82,946 (ఎక్స్‌-షోరూమ్‌) వద్ద లభిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి దీని ధర రూ.1,85,946 (ఎక్స్‌-షోరూమ్‌)కు చేరనుంది.               

కొనుగోలుదారులపై ఇది ఎంత ప్రభావం చూపుతుంది?

రూ.3,000 ధర పెంపు పెద్ద షాక్‌లా అనిపించకపోయినా, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది కొంతమందికి ఆలోచనకు దారి తీసే అంశమే. అందుకే ఏథర్ ఫైనాన్సింగ్ ఎంపికలు, EMI సౌలభ్యాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది.

2026లో ఏథర్ స్కూటర్ కొనాలనుకునేవారు డిసెంబర్‌లోనే బుక్ చేసుకుంటే డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. లేదంటే, జనవరి నుంచి కొంచెం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.         

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.