Ather 450X vs Honda Activa e: భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పెట్రోల్‌ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈవీ వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈవీ సెగ్మెంట్‌లో ఒక వెలుగు వెలిగిన స్టార్టప్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తూ, దశాబ్దాల నమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌ అయిన హోండా తన సరికొత్త అస్త్రం హోండా యాక్టివా ఇను మార్కెట్‌లోకి దింపింది. టెక్నాలజీ, పెర్ఫార్మెన్స్‌, స్టోర్టీ లుక్స్‌తో ఇప్పటికే ఇండియన్ యూత్‌ను క్రేజీగా ఆకట్టుకుంటున్న ఈవీ కింగ్ ఏథర్‌ 450ఎక్స్ సవాల్ విసురుతోంది. 

Continues below advertisement

మీరు కూడా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? నమ్మకమైన హోండా యాక్టివా ఇ కొనాలా లేకా టెక్ లోడెడ్‌ ఏథర్‌ 450ఎక్స్‌ వైపు మొగ్గు చూపాలా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారా మీ డైలమాను క్లియర్ చేయడానికి ఈ రెండు మోస్ట్ పాపులర్‌ ఈవీ స్కుటర్ల పవర్‌, పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, రేంజ్‌, ధరల గురించి ఇన్‌డెప్త్ ఎనాలసిస్‌ మీ కోసం. 

డిజైన్, లుక్‌ అండ్ స్పేస్‌ మేనేజ్‌మెంట్‌

డిజైన్ విషయానికి వస్తే ఈ రెండు స్కూటర్లు పూర్తిగా భిన్నమైన ఫిలాసఫీలను కలిగి ఉన్నాయి. ఏథర్‌ 450ఎక్స్‌ నుంచి చూడగానే అదొక ఫ్యూచరిస్టిక్‌ గేమింగ్‌ గ్యాడ్జెట్‌లా కనిపిస్తుంది. దీని షార్ప్‌ ప్యానెల్‌, అగ్రెసివ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ సెటప్‌, లైట్‌ వెయిట్ స్టూడెంట్స్‌, జెన్‌జీ ఆడియన్స్‌ను ఈ లుక్స్‌ ఇన్‌స్టెంట్‌గా పడేస్తాయి. దీని కర్బ్‌ వెయిట్‌ కేవలం 108 కేజీలు మాత్రమే ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా కట్‌ చేయవచ్చు. 

Continues below advertisement

మరోవైపు హోండా యాక్టివా ఇ తన సాంప్రదాయ పెట్రోల్ మోడల్‌ డిజైన్ లెగసీని అలాగే కాపాడుకుంటూ వచ్చింది. క్లాసిక్‌ మెట్ బాడీ ఫీల్, రోడ్డుపై స్టెబిలిటీ ఇచ్చే అండర్ బోన్‌ ఫ్రేమ్‌, ఎలిగెంట్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌తో ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లా కనిపిస్తుంది. దీని కర్బ్ వెయిట్ 118కేజీలుగా ఉంది. అంటే ఏథర్‌ కంటే ఇది పది కేజీలు బరువు ఎక్కువగా ఉంది. 

బూట్‌స్పేస్ వార్‌

స్పేస్ మేనేజ్‌మెంట్‌లో  రెండింటి మధ్య నైట్ అండ్‌ డే డిఫరెన్స్ ఉంది. ఇందులో 22 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఏథర్‌లో లభిస్తుంది. మీ హాఫ్‌ఫేస్ హెల్మెంట్‌ లేదా ఆఫీస్‌ బ్యాక్‌ను ఇందులో సులభంగా క్యారీ చేయవచ్చు. హోండా యాక్టివా ఇలో అండర్ సీట్ స్టోరేజ్‌ స్పేస్‌ అసలు లేదు. హోండా వాడిని స్వాపబుల్‌ బ్యాటరీ టెక్నాలజీ వల్ల సీటు కింద ఉండే స్పేస్ మొత్తం రెండు భారీ బ్యాటరీలు ఆక్రమించేశాయి. కేవలం ముందు భాగంలో 500ml చిన్న స్టోరేజ్‌ కంపార్టమెంట్‌ మాత్రమే ఇచ్చారు. మార్కెట్‌కు వెళ్లి సామాన్లు తేవాలనుకునే ఫ్యామిలీ యూజర్లకు ఇది కొంత నిరాశ కలిగించే విషయం. 

పవర్‌, స్పీడ్ అండ్ యాక్సిలేన్

పెర్ఫార్మెన్స్‌ ప్రేమికులకు ఏథర్ ఒక ఎమోషన్. ఎథర్‌ 450ఎక్స్‌లో అమర్చిన పర్మనెంట్‌ మాగ్నెట్‌ సిస్క్రోనస్‌ మోటరా ఏకంగా 6.4kW పీక్ పవర్. మైండ్ బ్లోయింగ్‌ 26Nm టార్క్‌ ప్రొడ్యూసర్ చేస్తుంది. దీని క్రేజీ వార్ప్‌మోడ్ ఆన్ చేస్తే చాలు కేవలం 3.3 సెకన్లోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సిగ్నల్‌ పడగానే రాకెట్‌లా దూసుకెళ్లడం ఏథర్‌ స్టైల్. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లను కంపెనీ పేర్కొంది. 

ఒక జపనీస్‌ ఇంజినీరింగ్ పవర్‌తో వచ్చిన హోండా యాక్టివా ఇ కూడా తక్కువేమీ కాదు. ఇందులో 6kW పీక్ పవర్‌ అందించే వీల్‌ సైడ్ మౌంటెడ్‌ PMSW మోటార్‌ను ఉపయోగించారు. ఇది 22Nm టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. యాక్టివా ఇ లో యాక్సిలరేషన్ చాలా లీనియర్‌గా స్మూత్‌గా ఉంటుంది. సడన్ జెర్క్స్‌ లేకుండా ప్రశాంతంగా ప్రయాణించాలనుకునే వారికి పెద్ద వయు వారికి హోండా పవర్‌ ట్రెయిన్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. 

బ్యాటరీ ఎకో సిస్టమ్ అండే రేంజ్‌ 

ఎలక్ట్రిక్ వాహనదారులను వేధించే అతి పెద్ద సమస్య రేంజ్‌ యాంగ్జైట్‌. ఈ విషయంలో రెండు కంపెనీలు రెండు భిన్న వ్యూహాలను అనుసరించాయి. ఏథర్‌ 450ఎక్స్‌లో 2.9 kWh కెపాసిటీ గల ఫిక్స్‌డ్‌ లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 126 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ ఇస్తుంది. ఇందులో 3.7kwh వేరియంట్‌ కూడా ఉంది. అది 161 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని రియల్‌ వర్డ్‌ రేంజ్‌ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్‌గా ఉంటుంది. అయితే దీనిని ఇంటి వద్ద ఛార్జ్ చేయాలనుకుంటే 4 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. లాంగ్‌ రైడ్స్‌ వెళ్లినప్పుడు ఏథర్‌ గ్రిడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. 

హోండా యాక్టివా ఇ ఇక్కడే ఒక గేమ్‌ ఛేంజర్‌ టెక్నాలజీతో వచ్చింది. ఇందులో 3 kWh కెపాసిటీ కలిగిన రెండు మొబైల్‌ పవర్ ప్యాక్ స్వాపబుల్‌ బ్యాటరీలను వాడారు. ప్రతి బ్యాటరీ బరువు 10.2 కేజీలు. ఈ స్కూటర్‌ సర్టిఫైడ్‌ రేంజ్‌ 102 కిలోమీటర్లు. దీని ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్‌ అయిపోగానే గంటల తరబడి చూడాల్సిన పని లేదు. సమీపంలోని హోండా ఇ స్వాప్ స్టేషన్‌లోకి వెళ్లి డిశ్చార్జ్ అయిన బ్యాటరీలను ఇచ్చి కేవలం 2 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్డ్‌ బ్యాటరీలను మార్చుకోవచ్చు. అయితే మీ నగరంలో ఈ స్వాపింగ్ నెట్‌వర్క్ ఎంత వరకు అందుబాటులో ఉందనే దీనిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హోమ్ ఛార్జ్‌ వాడితే దీనికి కూడా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. 

ఇంటెలిజెంట్ ఫీచర్స్‌ అండే డ్యాష్ బోర్డ్ 

ఫీచర్లపరంగా చూస్తే ఏథర్‌ ఒక నడుస్తున్న కంప్యూటర్‌. ఏథర్‌ 450ఎక్స్‌లో 7-ఇంచ్‌ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. ది స్నాప్‌డ్రాగన్‌ 212 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో గూగుల్ మ్యాప్స్‌ ఇన్‌బిల్ట్‌ నేవిగేషన్ బ్లూటూత్‌ కనెక్టివిటీ. మ్యూజిక్‌ కంట్రోల్స్, ఓవర్‌ది ఎయిర్‌ అప్‌డేట్స్ ఉన్నాయి. సరికొత్త ఏథర్‌ స్టాక్‌ 7 అప్‌డేట్ ద్వారా ఇప్పుడు ఇందులో వాయిస్ కమాండ్స్‌, స్క్రీన్‌పైనే క్రికెట్ స్కోర్ చూస్తే ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. అయితే ఈ ప్రీమియం ఫీచర్స్‌ అన్నీ వాడాలంటే మీరు అదనంగా ప్రో ప్యాక్‌ సబ్‌స్క్రిప్షన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

హోండా యాక్టివా ఇలో కూడా అద్భుతమైన టెక్నాలజీని అందించారు. ఇందులో 7 ఇంచ్‌ డైనమిక్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 100nitsపీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. దీని వల్ల మిట్ట‌ మధ్యాహ్నం ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హోండా రోడ్‌ సింక్‌ డ్యూఓ యాప్ ద్వారా స్మార్ట్‌ోన్ కనెక్టివిటీ, టర్న్‌బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ లభిస్తాయి. ఏథ్‌ లాగా టచ్‌స్క్రీన్ కాకపోయినప్పటికీ, హ్యాండిల్ బార్‌పై ఇచ్చే ఇంట్యూటివ్‌‌ జోయస్టిక్‌ కంట్రోలర్‌తో రైడింగ్ చేస్తూనే స్క్రీన్‌ను ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. బేస్ వేరియంట్‌ అయిన ఎస్‌టీడీలో మాత్రం సాధారణ డిజిటల్‌ కన్సోల్‌ మాత్రమే లభిస్తుంది. 

రైడ్‌కంఫర్ట్‌, బ్రేకింగ్ అండ్ సేఫ్టీ

రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ విషయానికి వస్తే మీ ప్రాధాన్యతలను బట్టి ఛాయిస్ మారుతుంది. ఏథర్‌ సస్పెన్షన్‌ సెటప్‌ కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. దీని వల్ల హైస్పీడ్‌ కార్నరింగ్‌, హ్యాండ్లింగ్‌ అదిరిపోతుంది. కానీ గుంతల రోడ్లపై వెళ్లేటప్పుడు జెర్క్స్‌ ఎక్కువగా తెలుస్తాయి. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో ఫ్రంట్‌ 200mm, రియర్‌ 190mmడ్యూయల్‌ డిస్క్‌బ్రేక్స్ ఉన్నాయి. బ్రేకింగ్ బైట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇండియన్ రోడ్లై లగ్జరీ కంఫర్ట్ ఇవ్వడంలో హోండా దిట్ట. దీని ముందు భాగంలో టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, వెనుక వైపు 3-స్టెప్‌ అడ్జెస్టబుల్ స్ప్రింగ్‌ లోడెడ్‌ హైడ్రాలిక్‌ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది ఎంతటి గుంతలనైనా సులభంగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీని సీటు పొడవు కూడా ఎక్కువగా ఉండటం వల్ల వెనుక కూర్చునే వాళ్లకు సూపర్ కంఫర్ట్ దక్కుతుంది. ఇందులో ఫ్రంట్‌ డిస్క్‌, రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌ కాంబినేషన్‌తోపాటు హోండా పేటెంటెడ్‌ కంబైన్డ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ అందించారు. 

మీ బడ్జెట్‌కు ఏ ఈవీ పర్ఫెక్ట్ ఛాయిస్‌

చివరగా ధరల విషయానికి వస్తే, హోండా యాక్టివా ఇ బేస్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్ ధర 1,18,147  రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్‌ రోడ్ సింక్‌ డ్యూయో వేరియంట్‌ ధర 1,52,747 రూపాయలు ఉంటుంది. హోండా బ్యాటరీ రెంటల్‌, స్వాపింగ్ ప్లాన్స్‌ ద్వారా రన్నింగ్ కాస్ట్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు.  మరోవైపు ఏథర్‌ 450ఎక్స్‌  ఎక్స్‌షోరూమ్‌ ధర 1,51,547 రూపాయలు నుంచి ప్రారంభవుతుంది. ప్రో ప్యాక్ వేరియంట్లతో 1,73,000 రూపాయలు దాటుతుంది. హోండాతో పోలిస్తే ఏథర్ ప్రారంభ ధర దాదాపు 33 వేల రూపాయలు ఎక్కువ.