Ather 450X Infinite Cruise Feature: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో Ather Energy, తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ Ather 450Xకు ఒక హై-ఎండ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఖరీదైన మోడళ్లలో మాత్రమే కనిపించే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను ఇప్పుడు ‘Infinite Cruise’ పేరుతో Ather 450X లోనూ పరిచయం చేసింది.
కొత్తగా అమ్ముడయ్యే అన్ని Ather 450X స్కూటర్లలోనూ ఈ ఫీచర్ స్టాండర్డ్‌గా ఉంటుంది. అలాగే, 2025 జనవరి 1 తర్వాత కొనుగోలు చేసిన 450X స్కూటర్లకు OTA అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్‌ను కంపెనీ అందిస్తోంది. తద్వారా, దాదాపు 44,000 మందికి పైగా Ather 450X యూజర్లకు ఈ అప్‌డేట్ చేరనుంది.
Infinite Cruise అంటే ఏమిటి?Infinite Cruise అనేది సాధారణ క్రూయిజ్ కంట్రోల్‌లా కాకుండా కొంచెం అడ్వాన్స్‌డ్ సిస్టమ్. రైడర్ బ్రేక్ వేస్తే ఇది తాత్కాలికంగా ఆగుతుంది. మళ్లీ యాక్సిలరేటర్ ఇస్తే, కొత్త వేగానికి అనుగుణంగా తిరిగి పని చేయడం మొదలుపెడుతుంది. అంటే ప్రతిసారి మళ్లీ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదే దీని ప్రత్యేకత.
సిటీ రైడింగ్‌కు ఎంతో ఉపయోగంఈ ఫీచర్ కేవలం 10 kmph నుంచే పని చేయడం మరో పెద్ద ప్లస్ పాయింట్. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో నెమ్మదిగా కదిలే ట్రాఫిక్‌లో కూడా ఇది ఉపయోగపడుతుంది. లాంగ్ రైడ్స్‌తో పాటు రోజువారీ ఆఫీస్ ప్రయాణాల్లో కూడా రైడర్‌కు అలసట తగ్గుతుంది.
హిల్ కంట్రోల్ ఫంక్షన్Infinite Cruiseలో Hill Control అనే ఫీచర్ కూడా ఉంది. మెరక రోడ్లు, వాలు రోడ్లపై కూడా స్కూటర్ ఒకే వేగంతో దూసుకెళ్లేలా పవర్ డెలివరీ, రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను ఈ సిస్టమ్ ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఇది భద్రతతో పాటు కంఫర్ట్‌ను కూడా పెంచుతుంది.
డాష్‌బోర్డ్‌లో నోటిఫికేషన్‌ఈ అప్‌డేట్‌కు అర్హులైన వినియోగదారులకు స్కూటర్ డిజిటల్ డాష్‌బోర్డ్‌పై నోటిఫికేషన్ కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తయ్యాక ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
విజయవాడ, హైదరాబాద్‌లో Ather 450X ధరలు
Ather 450X - విజయవాడలో ఆన్-రోడ్ ధరఎక్స్-షోరూమ్ ధర: ₹ 1,47,841RTO ఖర్చు: ₹ 785ఇన్సూరెన్స్ (కాంప్రెహెన్సివ్): ₹ 7,372క్యాష్ డిస్కౌంట్: ₹ 1,001మొత్తం ఆన్‌రోడ్ ధర: ₹ 1,54,997
Ather 450X - హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధరఎక్స్-షోరూమ్ ధర: ₹ 1,48,419RTO ఖర్చు: ₹ 935ఇన్సూరెన్స్ (కాంప్రెహెన్సివ్): ₹ 7,382క్యాష్ డిస్కౌంట్: ₹ 1,001మొత్తం ఆన్‌రోడ్ ధర: ₹ 1,55,735
మొత్తమ్మీద, Infinite Cruise ఫీచర్‌తో Ather 450X ఇప్పుడు మరింత ప్రీమియం, మరింత స్మార్ట్‌గా మారింది. సిటీ రైడింగ్, డైలీ కమ్యూట్, లాంగ్ డ్రైవ్స్... ఇలా ఏ పరిస్థితిలోనైనా రైడర్‌కు అదనపు కంఫర్ట్ అందించే ఫీచర్‌గా ఇది నిలుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో Ather మరోసారి తన టెక్నాలజీ బలాన్ని చాటిందని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.