Ather 450 Apex review: ఏథర్ 450 అపెక్స్ అనేది 450X ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత అడ్వాన్స్‌డ్, మోస్ట్ పవర్‌ఫుల్ వెర్షన్. ఏథర్ తన టెక్నాలజీని ఎంత దూరం తీసుకెళ్లిందో చూపించే మోడల్ ఇది. 2025 అప్‌డేట్‌తో కొత్త ఫీచర్లు జోడించడంతో, ఇది సాధారణ వినియోగదారుల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపాలన్న ఉత్సాహం ఉన్నవాళ్లనే లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ స్కూటర్ నిజంగా మీకు సరిపోతుందా? కొనాల్సిన కారణాలు ఏమిటి? వదిలేయాల్సిన అంశాలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Ather 450 Apex ఎందుకు కొనాలి? - 3 కారణాలు
1. ఉత్సాహాన్ని పెంచే పనితీరు
Ather 450 Apexకు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చిన Warp+ మోడ్ ఈ స్కూటర్‌ను పూర్తిగా వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది. టార్క్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉండటంతో పాటు టాప్ ఎండ్ కూడా షార్ప్‌గా అనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్ టెస్టుల్లో 0 నుంచి 40 కి.మీ, వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో, 80 కి.మీ. వేగాన్ని 11.59 సెకన్లలో అందుకుంది. ఇది 450X Gen3తో పోలిస్తే దాదాపు 5 సెకన్లు ఎక్కువ వేగం. పవర్ డెలివరీ తక్షణమే ఇచ్చినా ఎక్కడా జర్క్ అనిపించదు. థ్రాటిల్ కాలిబ్రేషన్ చాలా శుభ్రంగా ఉండటం వల్ల ఓవర్‌టేక్ చేయాలన్నా, వేగంగా ముందుకు దూసుకెళ్లాలన్నా నమ్మకంగా అనిపిస్తుంది.
2. సిటీ రైడింగ్‌ను సులభం చేసే టెక్నాలజీ
Ather Stack 7.0 అప్‌డేట్‌లో భాగంగా Apexకు వచ్చిన Infinite Cruise ఫీచర్ నిజంగా గేమ్ ఛేంజర్. ఇది హైవే కంటే మన నగరాల్లో ఉండే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.
City Cruise ట్రాఫిక్‌లో ఒకే వేగాన్ని కొనసాగిస్తుంది. బ్రేక్ వేస్తే ఆటోమేటిక్‌గా ఆగి, మళ్లీ యాక్సిలరేటర్ తిప్పితే కొత్త వేగాన్ని లాక్ చేస్తుంది. Hill Control ఎత్తులు, దిగువల్లో రీజెనరేటివ్ బ్రేకింగ్ సహాయంతో స్థిరమైన వేగాన్ని ఉంచుతుంది. Crawl Control అయితే కేవలం 10 కి.మీ. వేగంతో నెమ్మదిగా సాగేందుకు సహాయపడుతుంది. రోజూ ట్రాఫిక్‌లో నడిపేవారికి ఇది పెద్ద రిలీఫ్.
3. ప్రత్యేకమైన డిజైన్ & ప్రీమియం ఫీల్
450X లాగే కాంపాక్ట్, షార్ప్ డిజైన్ ఉన్నా, Apexకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆరెంజ్ కలర్ వీల్స్, ట్రాన్స్‌పరెంట్ సైడ్ ప్యానెల్స్ లోపల కనిపించే బ్రైట్ ఆరెంజ్ ట్రెలిస్ ఫ్రేమ్ ఈ స్కూటర్‌కు కాన్సెప్ట్ బైక్ లుక్ ఇస్తాయి.
ఈ ఏడాది ఏథర్ బ్రాండ్‌కు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక 10వ వార్షికోత్సవ స్టిక్కర్లు ఇచ్చారు. Indium Blue కలర్ స్కీమ్ రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Ather 450 Apex ఎందుకు కొనకూడదు? - 2 కారణాలు
1. ABS లేకపోవడం
ప్రీమియం, హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్ అయినప్పటికీ Apexలో ABS లేదు. గట్టిగా బ్రేక్ వేస్తే వెనుక వీల్ సులభంగా లాక్ అవుతుంది. 100 కి.మీ. వేగాన్ని తాకే స్కూటర్‌కు ఇది ఒక 'పెద్ద మైనస్ పాయింట్'.
2. అధిక ధర
దాదాపు రూ.1,91 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో Ather 450 Apex చాలా ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సాధారణ వినియోగదారుల కంటే ఔత్సాహికులకే ఎక్కువగా సరిపోతుంది. 450X ఇప్పటికే బాగా పెనితీరు ఇస్తుండగా, దాని కంటే ఎక్కువ ధర చెల్లించడానికి అందరూ సిద్ధంగా ఉండకపోవచ్చు.
Ather 450 Apex ఆన్‌రోడ్ ధరలు
హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర:ఎక్స్-షోరూమ్: ₹ 1,90,419RTO: ₹ 635ఇన్సూరెన్స్: ₹ 8,128మొత్తం: ₹ 1,99,182
విజయవాడలో ఆన్‌రోడ్ ధర:ఎక్స్-షోరూమ్: ₹ 1,89,841RTO: ₹ 485ఇన్సూరెన్స్: ₹ 8,116మొత్తం: ₹ 1,98,442
మొత్తంగా చూస్తే, అత్యంత వేగం, కొత్త టెక్నాలజీ, ప్రత్యేకమైన స్టైల్ కావాలంటే Ather 450 Apex ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కానీ... అధిక ధర, ABS లేకపోవడం వంటి అంశాలను కచ్చితంగా ఆలోచించాల్సినవే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
