Aprilia SR-GP Replica 175 vs Hero Xoom 160: ప్రముఖ ఇటాలియన్ టూవీలర్‌ కంపెనీ అప్రిలియా, తన కొత్త & శక్తిమంతమైన స్కూటర్ SR-GP Replica 175 ను తెలుగు రాష్ట్రాలు సహా భారతదేశ వ్యాప్తంగా లాంచ్‌ చేసింది. SR 175 ప్రత్యేక ఎడిషన్‌గా ఇది వచ్చింది, డిజైన్ & స్టైలింగ్‌లో పూర్తిగా కొత్త MotoGP టచ్ ఇచ్చారు. కంపెనీ, ఈ టూవీలర్‌ ఎక్స్-షోరూమ్ ధరను ₹1.22 లక్షలుగా నిర్ణయించింది, ఇది ప్రామాణిక మోడల్ కంటే కేవలం ₹3,000 ఎక్కువ. దీని అతి పెద్ద హైలైట్ దాని MotoGP-ఇన్‌స్పైర్డ్‌ డిజైన్, ఇది రేసింగ్ ఫీల్‌ ఇస్తుంది.

Continues below advertisement

డిజైన్ ఎలా ఉంది?SR-GP Replica రూపురేఖలు, దీనిని ఇతర స్కూటర్ల నుంచి భిన్నంగా చూపిస్తాయి. ఎరుపు & ఊదా రంగు గ్రాఫిక్స్‌తో కూడిన మాట్టే బ్లాక్ బాడీతో ఇది వచ్చింది. ముందు వైపు ఉన్న ఆప్రాన్ & సీటు కింద ప్యానెల్‌పై ఉన్న అప్రిలియా బ్రాండింగ్ & స్పాన్సర్ లోగోలు దీనిని నిజమైన రేసింగ్ మెషిన్‌లా కనిపించేలా చేస్తాయి. ఇంకా, ముందు చక్రంపై రెడ్‌ లైన్‌ స్పోర్టీ టచ్‌కు మరింత మెరుపును జోడిస్తుంది. మొదటి చూపులోనే ఈ స్కూటర్ స్పోర్ట్స్ బైక్‌లా అనిపిస్తుంది.

ప్రీమియం ఫీచర్లు లోడెడ్‌Aprilia SR-GP Replica 175 లో చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో 5.5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉంది. ఈ స్కూటర్‌లో ఆల్‌ LED లైటింగ్ & USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి, ఇది ప్రీమియం & కనెక్టెడ్‌ స్కూటర్‌గా ఉంటుంది.

Continues below advertisement

భద్రత & రైడింగ్ సౌకర్యంరైడింగ్ సౌకర్యం & భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు భాగంలో 220mm డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ & సింగిల్-ఛానల్ ABS ద్వారా బ్రేకింగ్ వ్యవస్థ ఉంది. ఈ ఫీచర్లు, అధిక వేగంలోనూ రైడర్‌కు అద్భుతమైన నియంత్రణను అందిస్తాయి.

పవర్‌ట్రెయిన్అప్రిలియా SR-GP రెప్లికా 175, స్టాండర్డ్‌ మోడల్‌లోని ఇంజిన్‌తోనే పని చేస్తుంది. అంటే, ఇది 174.7cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, 13.08 bhp & 14.14 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది, ఇది స్కూటర్‌ను సున్నితంగా & సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది.

మార్కెట్లో పోటీ స్కూటర్లుHero Zoom 160 & Suzuki Burgman వంటి స్కూటర్‌లతో SR-GP రెప్లికా 175 నేరుగా పోటీ పడుతుంది. Hero Zoom 160 ఈ సంవత్సరం జనవరిలో లాంచ్‌ అయింది & దీని ధర ₹1,48,500 ఎక్స్-షోరూమ్. GST తగ్గింపు తర్వాత ఈ హీరో స్కూటర్ రేటు ₹11,602 తగ్గింది.

హీరో జూమ్ 160 ఇంజిన్ & ఫీచర్లుఈ మ్యాక్సీ-స్కూటర్ 156cc, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 14.6 bhp & 14 Nm టార్క్‌ను ఇస్తుంది. LED లైటింగ్, స్మార్ట్ కీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ & రిమోట్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.