Andhra man pays Rs 2 crore for number plate:  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు. తన కారు నంబర్ ప్లేట్ కోసం ఏకంగా 2.08 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే దీనికికారణం.  ఒక సాధారణ లగ్జరీ కారు ధర కంటే కేవలం నంబర్ ప్లేట్ కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారి.   గుంటూరుకు చెందిన కిరణ్ కొలపాకుల అనే వ్యాపారవేత్త ఈ అసాధారణమైన వేలంలో విజేతగా నిలిచారు. ప్రముఖ లగ్జరీ కార్ల విక్రయ సంస్థ  బిగ్ బాయ్ టాయ్జ్  (Big Boy Toyz) ఇటీవలే తమ కొత్త వేలం ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ ఆక్షన్‌లో  DDC 0001 అనే వీఐపీ నంబర్ ప్లేట్‌ను కిరణ్ రూ. 2.08 కోట్లకు దక్కించుకున్నారు. భారతదేశ చరిత్రలో ఒక వాహనం నంబర్ ప్లేట్ కోసం వెచ్చించిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం.

Continues below advertisement

 ఎందుకింత ధర? 

నిజానికి ఈ నంబర్ ప్లేట్ గతంలో  బిగ్ బాయ్ టాయ్జ్ వ్యవస్థాపకుడు జతిన్ అహూజా వ్యక్తిగత వినియోగంలో ఉండేది.  0001  అనే అంకెకు ఉన్న క్రేజ్ ఒక ఎత్తు అయితే,  DDC  అనే ప్రత్యేక అక్షరాల కలయిక దీన్ని మరింత అరుదైనదిగా  మార్చింది. ఈ నంబర్ ప్లేట్‌ను కేవలం రిజిస్ట్రేషన్ నంబర్‌గా మాత్రమే కాకుండా, ఒక  డిజిటల్ అసెట్  లేదా కలెక్టబుల్ గా భావించి ఈ స్థాయిలో వేలం పాట జరిగినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

 కారు కంటే నంబర్ ప్లేటే ఖరీదు! 

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ నంబర్ ప్లేట్‌ను ఒక  మారుతి సుజుకి ఇగ్నిస్ కారుపై అమర్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు మార్కెట్ విలువ సుమారు 7 నుంచి 10 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. అంటే, కారు ధర కంటే దాని నంబర్ ప్లేట్ ధర దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉండటం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. అయితే, భవిష్యత్తులో ఈ నంబర్‌ను కిరణ్ తన వద్ద ఉన్న ఏదైనా ఖరీదైన లగ్జరీ కారుకు మార్చుకునే అవకాశం ఉందని  భావిస్తున్నారు.

సరికొత్త రికార్డులు 

ఇంతకుముందు హర్యానాకు చెందిన ఒక వ్యక్తి తన కారు నంబర్ HR 88B 8888 కోసం రూ. 1.17 కోట్లు వెచ్చించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును కిరణ్ కొలపాకుల భారీ తేడాతో అధిగమించారు. కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి కూడా లగ్జరీ వస్తువులపై పెట్టుబడి పెట్టే ఆసక్తి పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది.  నచ్చిన వస్తువు కోసం ఎంతైనా ఖర్చు చేయవచ్చు అనే మాటకు ఈ డీల్ ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

నంబర్ రిటెన్షన్ ద్వారా మార్చుకోవచ్చు!  పాత వాహనం   రిజిస్ట్రేషన్ నంబర్‌ను కొత్త వాహనానికి మార్చుకోవచ్చు. దీనిని  నంబర్ రిటెన్షన్ విధానం అంటారు.  పాత వాహనాన్ని విక్రయించేటప్పుడు లేదా స్క్రాప్ చేసేటప్పుడు, ఆ నంబర్‌ను మీ వద్దే ఉంచుకోవాలని సంబంధిత ఆర్టీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన నామినల్ ఫీజును చెల్లించి, పాత వాహనానికి కొత్త నంబర్‌ను కేటాయించేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొనుగోలు చేసే కొత్త వాహనానికి అదే పాత నంబర్‌ను కేటాయించమని డీలర్ లేదా ఆర్టీఓ అధికారులను కోరవచ్చు.  ఈ ప్రక్రియ అంతా పాత వాహనం రిజిస్ట్రేషన్ రద్దు కావడానికి ముందే లేదా విక్రయించిన వెనువెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లాంఛనాలు పూర్తి చేసి ఈ నెంబర్ ను వేలం వేస్తున్నారు.