Hyd Marathon Traffic Diversions : ప్రతిష్టాత్మక హైదరాబాద్ మారథాన్ 2025 ఆదివారం ప్రారంభం కానుంది. దేశ విదేశాలకు చెందిన అథ్లెట్లు ఈ రేసులో పార్టిసిపేట్ చేయనున్నారు. మొత్తం 3 విభాగాల్లో ఈ మారథాన్ లోని కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో మారథాన్ విభాగంలోని 42 కి.మి రేసును, అలాగే హాఫ్ మారథాన్ విభాగంలోని 21 కిమీ రేసును నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతుంది. అలాగే పది కి.మీ. రేసును మాధాపూర్ లోని హైటెక్స్ గ్రౌండ్స్ లో జరుపుతారు. ఇక కల్మినిషేన్ విభాగంలోని రేసులను గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక రేసుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఆంక్షలు కూడా విధించారు. సండే ఉదయం ఐదు నుంచి 11.30 ప్రాంతంలో ఈ రేసులను నిర్వహించనున్నారు. 14వ మారథాన్ రేసును ఉద్దేశించి, నగరంలోని వివిధ రోడ్లలో ఈ రేసు జరుగుతందని, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్లు, డైవెర్షన్లు ఉండనున్నాయని పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియ జేశారు.
ఈ ప్రాంతాల్లోని వారు.. ఇక హైదరాబాద్ మారథాన్ జరిగే ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ డైవర్షన్లను గమనించాలని పోలీసులు కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఏయే సమయాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయో వివరంగా తెలియ జేశారు. కొత్తగూడ-సైబర్ టవర్స్ ప్రాంతాల్లో ఉదయం 7.15 నిమిషాల వరకు, ఇందిరా నగర్- హెచ్సీయూ గేట్ నెం.2 ప్రాంతంలో ఉదయం 11.30 నిమిషాలకు,లెమన్ ట్రీ-సైబర్ టవర్స్ ఉదయం 8 గంటల వరకు, ఐకియా -సైబర్ టవర్స్ ప్రాంతంలో ఉదయం 8 గంటల వరకు, రోడ్ నం.45 ఫ్లై ఓవర్, కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో ఉదయం 8.30 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని, గమనించాలని కోరారు.
ఎనలేని క్రేజ్..గత 13 ఎడిషన్లుగా జరుగుతున్న హైదరాబాద్ మారథాన్ లో దేశ, విదేశాల నుంచి అథ్లెట్లు పాల్గొంటారు. ఈసారి ఎడిషన్ కు కూడా అంతర్జాతీయంగా పేరొందిన అథ్లెట్లు వచ్చారు. ఇక ఈ మరాథాన్ ప్రైజ్ మనీ కూడా భారీగానే ఉంది. తొలిస్థానంలో నిలిచిన వారికి రూ.3 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అలాగే రెండవ స్థానంలో నిలిచిన వారికి రెండున్నర లక్షలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రెండు లక్షల రూపాయల బహుమతి అందించనున్నారు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన వారికి 1.5 లక్షలు, రూ.1 లక్ష అందించనున్నారు. మహిళలు, పురుషులకు ప్రైజ్ మనీ ఒకే విధంగా ఉండనుంది.