All New Car Launches September 2025:

Continues below advertisement

సెప్టెంబర్ 2025లో, ఆటోమొబైల్ మార్కెట్‌ నిజంగా హైలైట్స్‌తో నిండిపోయింది. కొత్త మోడల్స్, స్పెషల్ ఎడిషన్స్, కొత్త వేరియంట్లు- అన్నీ ఒకే నెలలో వచ్చాయి. Maruti నుంచి VinFast వరకు, Hyundai నుంచి Skoda వరకు... ప్రతి బ్రాండ్‌ ఆటో లవర్స్‌కి ఏదో ఒక కొత్త సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

Maruti Victorisసెప్టెంబర్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది మారుతి విక్టోరిస్. తెలుగు రాష్ట్రాల్లో, రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ధరలో లాంచ్ అయింది. అరీనా డీలర్‌షిప్స్‌ ద్వారా అమ్ముతున్న మొదటి ప్రీమియం SUV ఇది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌, 10.25 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లే, 64 కలర్స్ అంబియెంట్ లైటింగ్, లెవల్ 2 ADAS వంటి హైటెక్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంది. మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG ఆప్షన్లతో వచ్చింది. AWD ఆప్షన్ కూడా ఉంది.

Continues below advertisement

VinFast VF6 & VinFast VF7వియత్నాం EV బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఇండియాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చింది. VF6 SUV ధర రూ. 16.49 లక్షల నుంచి స్టార్ట్ కాగా, VF7 SUV రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల వరకు ఉంది. VF6లో 468 కి.మీ. రేంజ్‌ & VF7లో 532 కి.మీ. వరకు రేంజ్ అందిస్తుంది. 12.9 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, పానోరమిక్ రూఫ్‌, డ్యూయల్ జోన్ AC, లెవల్ 2 ADAS వంటి ఫీచర్స్ ఈ కార్లలో ఉన్నాయి.

Volvo EX30వోల్వో నుంచి వచ్చిన EX30, ఇప్పటి వరకు ఇండియాలో లాంచ్ అయిన అతి చవకైన Volvo EV. రూ. 41 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధర ఉన్న ఈ SUVని 2025 అక్టోబర్ 19 లోపు బుక్ చేస్తే ప్రత్యేక ఆఫర్‌ రూ. 39.99 లక్షలకు దొరుకుతుంది. 480 కి.మీ. రేంజ్, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్‌, గూగుల్ ఇంటిగ్రేషన్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Skoda Kodiaq Lounge Variantస్కోడా, తన Kodiaq SUVకి కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌ "Lounge"ను తీసుకొచ్చింది. రూ. 40 లక్షల ధరలో లభించే ఈ SUV 5 సీటర్ లేఅవుట్‌లో వచ్చింది 10.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, పానోరమిక్ సన్‌రూఫ్‌, డిజిటల్ క్లస్టర్ ఫీచర్స్‌ ఈ కారులో ఉన్నాయి.

Hyundai Creta King Variantక్రెటా 10వ వార్షికోత్సవం సందర్భంగా, హ్యుందాయ్ "క్రెటా కింగ్" వేరియంట్‌ను విడుదల చేసింది. కొత్త మ్యాట్ బ్లాక్ షేడ్‌, డాష్‌ క్యామ్‌, సీట్‌ బ్యాక్ ట్రే వంటి ప్రత్యేక ఫీచర్స్‌ దీని సొంతం. లిమిటెడ్ ఎడిషన్‌లో వచ్చిన "కింగ్", ఈ బ్రాండ్‌కు ప్రత్యేక ఆకర్షణ.

ఇతర కీలక లాంచ్‌లు

Updated Honda Elevate - కొత్త గ్రిల్‌, కొత్త ఇంటీరియర్ కలర్స్, 360 కెమెరా వంటి అప్‌డేట్స్.

Citroen Basalt X - కొత్త డ్యాష్‌ బోర్డ్‌, వెంటిలేటెడ్ సీట్లు, 360 కెమెరా.

Renault Kwid 10th Anniversary Edition - స్పెషల్ కాస్మెటిక్ అప్‌డేట్స్.

Hyundai Creta Electric Knight, Hyundai Alcazar Knight, Hyundai i20 Knight ఎడిషన్స్ - ఆల్ బ్లాక్ థీమ్‌ & స్పోర్టీ లుక్స్‌తో వచ్చాయి.

సెప్టెంబర్ 2025లో లాంచ్ అయిన ఈ మోడళ్లు ఆటోమొబైల్‌ మార్కెట్‌లో కొత్త ఊపు తెచ్చాయి. ప్రాక్టికల్ ఫ్యామిలీ SUVs నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్స్‌ వరకు, ప్రతి బడ్జెట్‌కు ఏదో ఒక ఆప్షన్ సెప్టెంబర్‌లో వచ్చింది.