Office College Affordable Electric Bikes Bikes 2025: టూవీలర్ల విభాగంలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్‌ భారతంలోనూ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ టూవీలర్లే సేల్స్‌ రేస్‌లో ముందున్నాయి. పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి జనం ఈ-బైక్స్‌ కొంటున్నారు. ఇవి, జేబుపై భారాన్ని తగ్గించడమే కాకుండా, సజావుగా ప్రయాణించడం & సులభమైన నిర్వహణను కూడా అందిస్తాయి. ముఖ్యంగా, నగరాల్లోని రోజువారీ ప్రయాణానికి ఎలక్ట్రిక్‌ బైకులు బాగా ఉపయోగపడుతున్నాయి. మీ బడ్జెట్ పరిమితంగా ఉండి, ₹1 లక్ష కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటే, ఈ వార్త మీ కోసమే. 

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ (Ola Roadster X)ఓలా లాంచ్‌ చేసిన కొత్త రోడ్‌స్టర్ X, కంపెనీ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ బైక్. ప్రత్యేకంగా పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించారు. దీని బేస్ వేరియంట్ 2.5 kWh బ్యాటరీతో వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీని ధర ₹1,04,999 (ఎక్స్‌-షోరూమ్‌). అయితే, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మీద ఇచ్చే డిస్కౌంట్లు పోను ఇది ₹74,999 ఎక్స్‌-షోరూమ్‌ ధరకు వస్తుంది, భారతదేశంలో అత్యంత అందుబాటు ధర ఎలక్ట్రిక్ బైక్‌గా నిలిచింది. పరిధి పరంగా, IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) సర్టిఫికేషన్ ప్రకారం, ఈ బైక్ 252 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అయితే, వాస్తవ ప్రపంచ పరిస్థితులలో, ఇది సులభంగా 150 కి.మీ. పరిధిని అందిస్తుంది. ఛార్జింగ్ సమయాలు కూడా ఆకట్టుకుంటాయి - కేవలం 3 నుంచి 4 గంటల్లో 0 నుండి 80% వరకు ఛార్జ్‌ అవుతుంది. MoveOS 5 ఆధారిత 4.3-అంగుళాల LCD డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), జియో-ఫెన్సింగ్ & థెఫ్ట్‌ అలెర్ట్‌ వంటి ఆధునిక సాంకేతికతలు దీనిలో ఉన్నాయి. 

ఒబెన్ రోర్ EZ (Oben Rorr EZ)ఒబెన్ రోర్ EZ లుక్స్ & పెర్ఫార్మెన్స్ రెండింటిలోనూ ప్రీమియం. దీని బేస్ వేరియంట్ (2.6 kWh LFP బ్యాటరీ) ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹99,999, అయితే టాప్ వేరియంట్ (4.4 kWh) ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹1,29,999. ఈ బండి బ్యాటరీ LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. IDC ప్రకారం దీని రైడింగ్‌ రేంజ్‌ టాప్ వేరియంట్‌కు 175 కి.మీ. పరిధిని అందిస్తుంది. వాస్తవ పరిస్థితులలో ఇది సుమారు 140 కి.మీ. రేంజ్‌ అందిస్తుంది. 277 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 7.5 kW మోటారుతో శక్తినిస్తుంది & బైక్ గరిష్ట వేగం గంటకు 95 కి.మీ.కు చేరుతుంది. ఒబెన్ రోర్ EZ లో మూడు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి - ఎకో, సిటీ & స్పోర్ట్. 

మ్యాటర్ ఎరా (Matter Erra)మ్యాటర్ ఎరాను అహ్మదాబాద్‌కు చెందిన మ్యాటర్ మోటార్స్ అభివృద్ధి చేసింది. భారతదేశంలో మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే. బేస్ వేరియంట్ (ఎరా 5000) ధరలు ₹1,81,308 నుంచి ప్రారంభమవుతాయి, టాప్ వేరియంట్ (ఎరా 5000+) ధర ₹1,93,826. ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ దాని 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో దీని పెర్ఫార్మెన్స్‌ అసాధారణంగా ఉంటుంది. ఇంజిన్‌కు బదులుగా గేర్‌బాక్స్ & ఎలక్ట్రిక్ మోటారు కలయిక దీనికి పెట్రోల్ లాంటి అనుభూతిని ఇస్తుంది. దీని IDC పరిధి 125 నుంచి 172 కి.మీ. & గరిష్ట వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ. 

మీ బడ్జెట్ ₹75,000 వరకు ఉంటే & రోజువారీ సిటీ రైడింగ్ కోసం ఓలా రోడ్‌స్టర్ X ఉత్తమ ఎంపిక. కొంచెం ఎక్కువ రేంజ్ & పవర్ కోరుకుంటే ఒబెన్ రోర్ EZ కు ఓటేయవచ్చు. ఎలక్ట్రిక్‌లో కూడా గేర్‌లను ఆస్వాదించాలనుకుంటే మ్యాటర్ ఎరా మీకు సరిపోయే ప్రీమియం ఆప్షన్‌.