Abhishek Sharma Haval H9 Specifications: ఆసియా కప్‌ 2025లో టీమ్‌ ఇండియాకు స్టార్‌ ఓపెనర్‌గా మెరిసిన అభిషేక్‌ శర్మ, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టోర్నమెంట్‌ మొత్తాన్ని శాసించాడు. దీంతో ఈ యువ డాషింగ్‌ బ్యాటర్‌కు "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌" అవార్డు దక్కింది. ఈ అవార్డ్‌లో భాగంగా, GWM హావల్‌ H9 SUV ని అభిషేక్‌ శర్మ గిఫ్ట్‌గా పొందాడు. ఈ స్ట్రైకింగ్‌ ఓపెనర్‌, మొత్తం 7 మ్యాచుల్లో 314 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరి, అభిషేక్‌ శర్మ దక్కించుకున్న GWM హావల్‌ H9 SUV ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?.

Continues below advertisement

GWM Haval H9 SUV - ధర ఎంత?

GWM హావల్‌ H9 SUV ప్రస్తుతం ఇండియాలో లేదు. కానీ సౌదీ అరేబియా వంటి దేశాల్లో దీని ధర సుమారు రూ. 33.60 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). అంటే, ఇండియాలో అందుబాటులో ఉంటే ఇది సూపర్ ప్రీమియం SUV అవుతుంది.

Continues below advertisement

ఇంజిన్‌ & స్పెసిఫికేషన్స్‌

GWM హావల్‌ H9 SUVలో 2.0 లీటర్‌ ఫోర్‌-సిలిండర్‌ టర్బోచార్జ్‌డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది గరిష్టంగా 380Nm టార్క్‌ జనరేట్‌ చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ZF ట్రాన్స్‌మిషన్‌తో ఇది శక్తిమంతమైన డ్రైవింగ్‌ అనుభవాన్ని ఇస్తుంది. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా ప్రయాణం సాగించేలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో, చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్‌ (GWM) హవల్ బ్రాండ్‌ కారును రూపొందించింది.

ఇంటీరియర్‌ విషయానికి వస్తే, 14.6 ఇంచుల టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, 10 స్పీకర్ల సౌండ్‌ సిస్టమ్‌ లగ్జరీ ఫీల్‌ ఇస్తాయి. ఈ SUV పొడవు 4950 mm, వెడల్పు 1976 mm. అదనంగా అడాప్టివ్‌ క్రూజ్‌ కంట్రోల్‌ ఉండటంతో హైవేపై లాంగ్ డ్రైవ్స్‌ మరింత ఈజీ అవుతాయి & ట్రాఫిక్‌ను బట్టి వేగం సర్దుబాటు అవుతుంది. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్‌ డిటెక్షన్ ఫెసిలిటీలు ఉన్నాయి. ఆటో, ఎకో, స్పోర్ట్‌, సాండ్‌, స్నో, మడ్‌ వంటి డ్రైవ్‌ మోడ్స్ ఉన్నాయి. లాంగ్‌ డ్రైవ్స్‌లో ఇబ్బంది లేకుండా వెంటిలేటెడ్‌ సీట్లు ఉపయోగపడతాయి, ఒంటికి చల్లదనం ఇస్తాయి. రిఫ్రెష్ డ్రైవింగ్ కోసం మసాజ్‌ ఫీచర్‌ కూడా ఈ కారులో ఉంది.

ఇండియాలోకి తెచ్చుకోవాలంటే డ్యూటీ బాంబ్

"ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌" కింద అద్భుతమైన SUV గెలుచుకున్నాడు గానీ, అభిషేక్‌ శర్మ ఈ బండిని ఇండియాలోకి తీసుకురావాలంటే కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సిందే. వాహనం ధర ఎంతైతే, అంతే మొత్తంలో (100%) డ్యూటీ కట్టాలి. అంటే SUV ధర రూ. 33.60 లక్షలు అయితే, అదే మొత్తంలో డ్యూటీ అంటే మరో రూ. 33.60 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా దాన్ని ఇండియాలో రోడ్లపై నడపాలంటే రూ. 67 లక్షలు పైగా ఖర్చు అవుతుంది.

అభిషేక్‌ శర్మ - ఆసియా కప్‌ 2025 స్టార్‌

2025 ఆసియా కప్‌లో, టీమ్‌ ఇండియా అజేయంగా ఆడింది. ఓటమి అన్నదే ఎరగకుండా టైటిల్‌ గెలుచుకుంది. అభిషేక్‌ శర్మ ఈ టోర్నమెంట్‌లో 7 మ్యాచ్‌ల్లో 314 పరుగులు చేసి టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. మూడు అర్ధ శతకాలు నమోదు చేసి, 200 స్ట్రైక్‌ రేట్‌తో బౌలర్లను బాదేశాడు. ప్రస్తుతం అతను ప్రపంచ నంబర్ వన్‌ T20 బ్యాట్స్‌మన్‌ కూడా.

హావల్‌ H9 SUV లాంటి కారు అభిషేక్‌ శర్మ లెవెల్‌ ప్లేయర్‌కి సరిపోతుందనడంలో సందేహం లేదు. కానీ దీన్ని ఇండియాలో నడపాలంటే అతనికి డ్యూటీ బాంబ్‌ తప్పదు. ఆసియా కప్‌లో తన బ్యాటింగ్‌తో మెరిసిన అభిషేక్‌ శర్మ, ఇప్పుడు లగ్జరీ SUV గెలుచుకోవడంతో డబుల్‌ సెలబ్రేషన్‌లో ఉన్నాడు.