Underrated Cars India 2025: భారతదేశంలో, కార్ల మార్కెట్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సెగ్మెంట్‌లో వందలాది మోడల్స్ ఉన్నా… వాటిలో కొన్ని మాత్రం తమ స్థాయికి తగ్గ అమ్మకాలను అందుకోలేకపోతున్నాయి. ఫీచర్లు బాగున్నా, డిజైన్ యూనిక్‌గా ఉన్నా, డ్రైవ్ క్వాలిటీ మంచిగా ఉన్నా... బ్రాండ్ ఇమేజ్, మార్కెటింగ్, ప్లానింగ్ వంటి కారణాలతో ఈ కార్లు ప్రజల్లో సరైన గుర్తింపును సంపాదించలేకపోతున్నాయి.
అమ్మకాల కంటే మెరిట్ ఎక్కువగా ఉన్న 8 కార్లు:
1. Citroen Aircross X – నెలకు కేవలం 100 యూనిట్లుమిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో Hyundai Creta దాదాపు నెలకు 15,000 యూనిట్లు అమ్ముతుంటే… Citroen Aircross X మాత్రం 100 యూనిట్లకే పరిమితం అవుతోంది. బ్రాండ్ ఇన్వెస్ట్‌మెంట్ తక్కువగా ఉండటం, పాత వెర్షన్‌లో కీలక ఫీచర్లు లేకపోవడం ప్రధాన కారణాలు. అయినా... క్లాసీ ఇంటీరియర్, డిఫ్యూజ్ అంబియంట్ లైటింగ్, పూర్తిగా తీసివేయగలిగే మూడో వరుస సీట్లు ఈ కారును ప్రత్యేకంగా నిలబెడతాయి.
2. Jeep Meridian – నెలకు 110 యూనిట్లుJeep పేరెంట్ కంపెనీ అయిన Stellantis’, భారత మార్కెట్‌పై పెట్టుబడి తగ్గించడం, అప్‌డేట్లు ఇవ్వకపోవడం వల్ల ఈ మోడల్ అమ్మకాలు పడిపోయాయి. పెట్రోల్ ఆప్షన్ లేకపోవడం కూడా ఒక లోపం. అయినా... హైవేపై రైడ్ క్వాలిటీ, ఆఫ్‌రోడ్ కెపాబిలిటీ విషయంలో మెరిడియన్ తన క్లాస్‌లో టాప్.
3. Citroen Basalt X – దాదాపు 200 యూనిట్లుసిట్రోయెన్ బ్రాండ్ ఇమేజ్ సమస్యలతో పాటు పాత మోడల్‌లో ఫీచర్లు తక్కువగా ఉండటం అమ్మకాలను ప్రభావితం చేసింది. అయినా... Basalt X లో ఉన్న స్మూత్ 1.2 టర్బో ఇంజిన్, ఈజీ డ్రైవ్, మంచి సస్పెన్షన్ ఈ కారును గొప్పగా నిలబెడతాయి.
4. Audi A4 – జర్మన్ ప్రత్యర్థులే బెటర్BMW 3 Series, Benz C-Class లాంటి మోడల్స్ కొత్త టెక్నాలజీతో వస్తుండటంతో A4 కొంచెం పాతగా కనిపిస్తుంది. కానీ... ప్రైస్ బెనిఫిట్, హై-ప్రొఫైల్ టైర్ల కారణంగా మంచి రైడ్ క్వాలిటీ, ఆడి బిల్డ్ క్వాలిటీ - ఇవన్నీ A4 ను డబ్బుకు పూర్తి విలువైన కారుగా నిలబెడతాయి.
5. Maruti Suzuki Invicto – నెలకు 250 యూనిట్లుToyota Hycross హైబ్రిడ్ దాదాపు 20 రెట్లు ఎక్కువ అమ్ముడవుతుంటే, Invicto మాత్రం తక్కువగానే ఉంది. మారుతి "ప్రీమియం" ఇమేజ్ లేదని కొంతమంది భావించడం అమ్మకాలకు అడ్డుగా మారింది. అయినా... హైబ్రిడ్ టెక్నాలజీ, మంచి మైలేజ్, మారుతి సర్వీస్ నెట్‌వర్క్ దీని బలాలు.
6. Hyundai Creta Electric – సుమారు 800 యూనిట్లుBE 6 వంటి రైవల్స్‌తో పోలిస్తే Creta EV స్టైలింగ్ అంత యూనిక్‌గా లేదు. కానీ, 400 కి.మీ. రియల్ రేంజ్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఫన్-టు-డ్రైవ్ స్వభావం EV మార్కెట్లో దీనిని బలమైన ఆప్షన్‌గా నిలబెడతాయి.
7. Nissan Magnite – నెలకు 1,860 యూనిట్లునిస్సాన్ బ్రాండ్ ప్రెజెన్స్ తక్కువగా ఉండటం, పోర్ట్‌ఫోలియో చిన్నది కావడం వల్ల అమ్మకాలు పెరగడం లేదు. అయినా Magnite లో SUV లుక్, మంచి కేబిన్ స్పేస్, టర్బో ఇంజిన్, CVT స్మూత్ డ్రైవ్ కారణంగా దీనికి మరింత అమ్మకాలు రావాల్సిందే.
8. Maruti Suzuki Ignis – నెలకు 2,770 యూనిట్లుఈ యూరోపియన్ డిజైన్ కారు భారత మార్కెట్‌లో అందరికీ నచ్చడం లేదు. అయినా, స్మూత్ సస్పెన్షన్, సరసమైన ధర, సైజ్ చిన్నగా ఉన్నా SUV తరహా లుక్ ఇగ్నిస్‌కు ప్రత్యేకతను ఇస్తాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.