New Honda Dio 110 Features Price: యూత్‌కి ఫేవరెట్‌గా నిలిచిన హోండా డియో ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, ఫీచర్లతో రీ-ఎంట్రీ ఇచ్చింది. యాక్టివా 110లో ఉపయోగించిన ఇంజిన్‌ను పంచుకుంటూ.. తన షార్ప్‌ డిజైన్‌, ఫంకీ కలర్స్‌తో యువతను ఆకట్టుకుంటోంది. ఇపుడు GST 2.0 తర్వాత దీని ధర తగ్గడంతో స్కూటర్‌ బయ్యర్స్‌కి మరింత అట్రాక్టివ్‌ ఆప్షన్‌గా మారింది. 

Continues below advertisement

హోండా డియో 110 కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన 7 కీలక విషయాలు ఏంటి?:

1. ట్యూబ్‌లెస్‌ టైర్లు    హోండా డియో 110 ముందు 12-అంగుళాల, వెనుక 10-అంగుళాల ట్యూబ్‌లెస్‌ టైర్లతో వస్తుంది. ఇవి మంచి గ్రిప్‌, కంఫర్ట్‌ రైడ్‌ అందిస్తాయి. పంక్చర్‌ అయినా వెంటనే గాలి లీక్‌ కాకుండా సేఫ్‌గా మీ రైడ్‌ కొనసాగించవచ్చు.

Continues below advertisement

2. ఆటో స్టార్ట్‌/స్టాప్‌ సిస్టమ్‌     ఈ స్కూటర్‌లో ఇంజిన్‌ ఆటో స్టార్ట్‌/స్టాప్‌ ఫీచర్‌ ఉంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఇంజిన్‌ ఆటోమేటిక్‌గా ఆగి, యాక్సిలరేటర్‌ తిప్పగానే తిరిగి స్టార్ట్‌ అవుతుంది. ఇది మైలేజ్‌ను మెరుగుపరుస్తుంది.

3. సైడ్‌ స్టాండ్‌ కటాఫ్‌   సేఫ్టీ పరంగా హోండా డియో 110 ని సూపర్‌గా డిజైన్‌ చేశారు. సైడ్‌ స్టాండ్‌ కిందకు ఉంటే ఇంజిన్‌ ఆన్‌ అవ్వదు, ఆ స్టాండ్‌ను మూసేస్తేనే ఇంజిన్‌ స్టార్ట్‌ అవుతుంది, ప్రమాదాలను నివారిస్తుంది. ఇది కొత్త రైడర్స్‌కి బాగానే ఉపయోగపడే సేఫ్టీ ఫీచర్‌.

4. బ్లూటూత్‌ TFT డ్యాష్‌      హోండా డియో 110లో 4.2 అంగుళాల బ్లూటూత్‌ ఎనేబుల్డ్‌ TFT డిస్‌ప్లే ఉంది. దీనిలో కాల్స్‌, మ్యూజిక్‌, నావిగేషన్‌ ఇన్ఫర్మేషన్‌ కనిపిస్తుంది. ఇది స్కూటర్‌కి ప్రీమియం టచ్‌ ఇస్తుంది.

5. కలర్‌ ఆప్షన్స్‌     ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో, ఐదు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తోంది, అవి - ఎరుపు, నీలం, గ్రే, డార్క్‌ గ్రే-బ్లాక్‌, బ్లాక్‌. ఈ కలర్‌ కాంబినేషన్స్‌ అన్నీ కూడా యువత అభిరుచికి తగ్గట్టుగానే ఉన్నాయి.

6. ఇంజిన్‌ పవర్‌      హోండా డియో 110లో 109.5cc సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 7.9 హెచ్‌పీ పవర్‌, 9Nm టార్క్‌ ఇస్తుంది. ఈ ఇంజిన్‌ యాక్టివా 110లో ఉన్నదే. కానీ, డియోలో రైడింగ్‌ ఫీల్‌ మరింత లైవ్లీగా ఉంటుంది.

7. కొత్త ధరలు (జీఎస్టీ 2.0 తర్వాత)       జీఎస్టీ 2.0 రివిజన్‌ తర్వాత డియో 110 ధరలు తగ్గాయి. ప్రస్తుతం, రూ. 72,589 నుంచి రూ. 83,467 వరకు (ఎక్స్‌-షోరూమ్‌) ఉన్నాయి. పాత ధరతో పోలిస్తే ఎక్స్‌-షోరూమ్‌ రేటు దాదాపు రూ.7,5000 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌-రోడ్‌ ధర రూ. 91,195 నుంచి రూ. 1,03,633 వరకు ఉంది.

హోండా డియో 110 ఇప్పుడు స్పోర్టీ లుక్స్‌, టెక్నాలజీ ఫీచర్లు, ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీతో నయా జనరేషన్‌కి పర్ఫెక్ట్‌ పార్ట్‌నర్‌ అవుతుంది. యాక్టివా కన్నా స్టైలిష్‌గా, డైలీ యూజ్‌కి సూట్‌ అయ్యేలా దీనిని చక్కగా డిజైన్‌ చేశారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.