Maruti Victoris Price Features In Telugu: మారుతి సుజుకి ఎప్పటి నుంచో “ఫ్యామిలీ కార్ బ్రాండ్”గా ఫేమస్. కానీ, మారుతున్న కాలంతో పాటు ఈ ఇమేజ్‌ను మార్చుకుంటోంది, SUV మార్కెట్‌లోనూ పోటీదారుగా మారింది. SUV మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా నిలబడటానికి విక్టోరిస్‌తో కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది. ముఖ్యంగా, ఈ కారులో తొలిసారిగా వచ్చిన ఏడు కొత్త ఫీచర్లు ఆటో లవర్స్‌కి మేజర్ అట్రాక్షన్.
1. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌విక్టోరిస్‌లో ఇచ్చిన ఈ పెద్ద టచ్‌స్క్రీన్ వాస్తవానికి మారుతి కార్లలో గేమ్‌చేంజర్. ఇది కేవలం సైజ్‌కే కాకుండా, కొత్త UIతో స్మూత్‌గా పని చేస్తుంది. Alexa Auto Voice AI ద్వారా మీరు వాయిస్‌తోనే మ్యూజిక్, నావిగేషన్, కాల్స్ కంట్రోల్ చేయొచ్చు. OTT Apps, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైర్‌లెస్ Android Auto & Apple CarPlayతో యువతరానికి ఇది “పర్ఫెక్ట్ స్మార్ట్ డ్రైవింగ్ అనుభవం” ఇస్తుంది.
2. అండర్‌బాడీ CNG ట్యాంక్‌ఇప్పటివరకు, CNG వాహనాల్లో బూట్ స్పేస్ తగ్గిపోవడం పెద్ద ఇష్యూ. కానీ విక్టోరిస్‌లో అండర్‌బాడీ CNG ట్యాంక్‌ని ఫిట్ చేశారు. అంటే లగేజ్ పెట్టుకోవడానికి పూర్తి బూట్ స్పేస్ మీకే మిగులుతుంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో సేఫ్టీ & ప్రాక్టికాలిటీ రెండూ సెట్ అయ్యాయి. తరచూ ట్రావెల్ చేసే కుటుంబాలకు ఇది పెద్ద ప్లస్ పాయింట్.
3. పవర్డ్ టెయిల్‌గేట్ విత్ జెస్చర్ కంట్రోల్‌చేతుల్లో లగేజ్ ఫుల్‌గా ఉన్నప్పుడు కారు డోర్ ఓపెన్ చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని, విక్టోరిస్‌లో జెస్చర్ కంట్రోల్‌తో పవర్డ్ టెయిల్‌గేట్ ఇచ్చారు. కాలు సెన్సార్ దగ్గర కదిపితే ఆటోమేటిక్‌గా టెయిల్‌గేట్ ఓపెన్ అవుతుంది. ఇది గల్జరీ SUVలలో మాత్రమే కనిపించే ఫీచర్, ఇప్పుడు మారుతి కూడా ఈ లిస్ట్‌లోకి వచ్చింది.
4. లెవల్-2 ADAS (Advanced Driver Assistance System)ఇది విక్టోరిస్ హైలైట్ ఫీచర్. తొలిసారి మారుతి SUVలో Level-2 ADAS అందుబాటులోకి వచ్చింది. ఇందులో:
Adaptive Cruise Control - హైవేలో స్పీడ్‌ని ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుంది.
Lane Keep Assist - లేన్ నుంచి కారు పక్కకు వస్తే అలర్ట్ ఇస్తుంది.
Autonomous Emergency Braking - ముందున్న వాహనం దగ్గరగా వస్తే కారు ఆటోమేటిక్‌గా బ్రేక్ వేస్తుంది.
Forward Collision Warning - ప్రమాదం జరగకముందే డ్రైవర్‌కు వార్నింగ్.
Rear Cross-Traffic Alert - రివర్స్ చేస్తున్నప్పుడు వెనుక ఏదైనా వాహనం వస్తే అలర్ట్.
ఈ ఫీచర్, విక్టోరిస్ టాప్-స్పెక్ ZXi Plus ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే దొరుకుతుంది. ఇది మారుతి సేఫ్టీ స్టాండర్డ్స్‌లో పెద్ద అడుగు.
5. 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేడ్రైవర్ సీట్లో కూర్చుంటే మొదట కనిపించేది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. విక్టోరిస్‌లో 10.25-అంగుళాల పెద్ద డిజిటల్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది కేవలం స్పీడ్, ఫ్యూయల్ ఎకానమీ చూపడమే కాదు, గేర్ పొజిషన్, డ్రైవింగ్ మోడ్, రేంజ్, నావిగేషన్ వరకు క్లియర్‌గా చూపిస్తుంది. లాంగ్ డ్రైవ్స్‌కి ఇది సూపర్ యూజ్‌ఫుల్.
6. 64-కలర్ ఆంబియంట్ లైటింగ్‌డ్రైవింగ్ అనుభవానికి లైటింగ్ కూడా ఎంతో ఇంపార్టెంట్. విక్టోరిస్ SUVలో తొలిసారిగా 64-కలర్ ఆంబియంట్ లైటింగ్ వచ్చింది. నైట్ డ్రైవ్‌లో మూడ్ బట్టి లైట్స్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇది కారు ఇంటీరియర్‌ని ప్రీమియం లుక్‌లోకి మార్చేస్తుంది.
7. ఇన్ఫినిటీ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌సంగీతం అంటే పిచ్చి ఉన్నవాళ్లకు ఈ ఫీచర్ మస్ట్ లవ్. తొలిసారి, మారుతి, ఒక SUVలో ఇన్ఫినిటీ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చింది. ఇందులో సబ్‌వూఫర్, సెంటర్ స్పీకర్, Dolby Atmos టెక్నాలజీ ఉన్నాయి. 8-చానల్ అంప్లిఫైయర్‌తో సౌండ్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది.
లాంచ్ & ధరమారుతి విక్టోరిస్ SUV డెలివెరీలు ఇంకా ప్రారంభం కాలేదు, బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ధరను ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు, ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు ₹9.75 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయని అంచనా. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్ SUVలతో పోటీ పడనుంది.