Skoda Kodiaq RS Price And Features: స్కోడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కోడా కొడియాక్ RS భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ SUV కోసం కంపెనీ జూన్ 22న బుకింగ్స్ ప్రారంభించగా, తొలి విడతలో కేటాయించిన 50 యూనిట్లు (కార్లు) కేవలం 6 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడైపోయాయి. అధికారిక ధర ఇంకా ప్రకటించకపోయినా, ఈ SUV ధర సుమారు రూ.60 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Continues below advertisement

ఏంటి ఈ కారు స్పెషాలిటీ?

స్కోడా కొడియాక్ RS ప్రత్యేకత దాని శక్తివంతమైన ఇంజిన్‌లోనే ఉంది. ఇందులో 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ TSI ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 265 hp పవర్ & 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ కొడియాక్ మోడల్‌తో పోలిస్తే అదనంగా 61 hp పవర్ & 80 Nm టార్క్‌ను అందిస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 'ఆల్ వీల్ డ్రైవ్' (AWD) సిస్టమ్‌ను కూడా అందించారు.

Continues below advertisement

స్కోడా కార్లలోనే అత్యంత వేగం

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ SUV కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని స్కోడా వెల్లడించింది. దీంతో భారతదేశంలో ఇప్పటివరకు విడుదలైన స్కోడా కార్లలోనే అత్యంత వేగవంతమైన మోడల్‌గా కొడియాక్ RS నిలిచింది. ఇందులో డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ ప్లస్ (DCC Plus) అడాప్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉంది.

ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌

డిజైన్ పరంగా ఈ SUV ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మూన్ వైట్, స్టీల్ గ్రే, వెల్వెట్ రెడ్ & మ్యాజిక్ బ్లాక్ అనే నాలుగు రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఇంటీరియర్‌లో పూర్తిగా బ్లాక్ థీమ్‌తో పాటు ఎరుపు రంగు స్టిచింగ్ & స్పోర్టీ టచ్‌ను అందించారు.

ఫీచర్ల విషయానికి వస్తే, 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 13 స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేషన్ ఉన్న వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

వెంటిలేటెడ్, హీటెడ్ & మెమరీ ఫంక్షన్ కలిగిన పవర్డ్ స్పోర్ట్స్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ ORVMలు, ఆటో డిమ్మింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. బయటి భాగంలో LED మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్, వెల్‌కమ్ లైటింగ్, LED టెయిల్ ల్యాంప్స్ & 20 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

9 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్స్‌

భద్రత పరంగా కూడా స్కోడా ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఆటో పార్క్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజెస్‌తో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో ప్రీమియం పెర్ఫార్మెన్స్ SUVలకు పెరుగుతున్న డిమాండ్‌కు స్కోడా కొడియాక్ RS విజయవంతమైన బుకింగ్స్ నిదర్శనంగా నిలిచాయి. అధికారిక ధర ప్రకటించకముందే కేవలం 6 నిమిషాల్లో తొలి బ్యాచ్ సేల్ అవుట్ కావడం, ఈ మోడల్‌పై వినియోగదారుల ఆసక్తి ఎంత ఉందో స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు ధర ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.