Maruti Suzuki E-Vitara amazing features: మారుతి సుజుకి కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు జనవరి 2026లో విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఈ మధ్యే విడుదల చేసింది. అయితే డిసెంబర్ 2025 ప్రారంభంలో ఈ ఎలక్ట్రిక్ కారు గురించి అనేక ముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ-విటారా, మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ కారు కావడంతో చాలా మంది దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ-విటారా భారత మార్కెట్లోకి ప్రవేశించే ముందు భారత్ NCAP క్రాష్ టెస్ట్ కూడా పాస్ అయ్యింది. 5-నక్షత్రాల భద్రతా రేటింగ్ను సాధించింది. భారతదేశంలో ఈ కారు విడుదల చేయడానికి ముందు, ఈ EVకి సంబంధించిన 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం.

Continues below advertisement

Maruti E-Vitara యొక్క 5 ముఖ్యమైన విషయాలు      

మారుతి ఈ-విటారా పొడవు 4,275 mm, వెడల్పు 1,800 mm , ఎత్తు 1,640 mm. ఈ ఎలక్ట్రిక్ కారులో 2700 mm వీల్బేస్ ఉంది. మారుతి ఈ EV Heartect-e ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. అంటే ఈ కారును నేరుగా ఎలక్ట్రిక్ మోడల్‌గా తయారు చేశారు, పెట్రోల్-డీజిల్ మోడల్ తయారు చేసిన తర్వాత ఈ కారును తయారు చేయలేదు.               

రెండు బ్యాటరీల ఆప్షన్‌లతో ఈ విటారా

ఈ-విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది, ఒకటి 49 kWh కాగా రెండవది 61 kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండు బ్యాటరీ ప్యాక్లలో లిథియం ఐరన్-ఫాస్ఫేట్ (LFP) బ్లేడ్ సెల్స్ ఉపయోగించారు. దీని వలన 49 kWh బ్యాటరీ ప్యాక్‌పై 143 bhp, 61 kWh బ్యాటరీ ప్యాక్‌పై 173 bhp పవర్‌ లభిస్తుంది. ఈ వాహనంలో సింగిల్ మోటార్ ఉపయోగించారు. మారుతి ఈ-విటారా 61 kWh బ్యాటరీ ప్యాక్‌తో 543 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని పేర్కొంది, 

Continues below advertisement

Also Read: Volkswagen Virtus GT Line vs Hyundai Creta - డ్రైవింగ్‌ థ్రిల్‌ కావాలా? ఫ్యామిలీ కంఫర్ట్‌ కావాలా?

ఇది ఈ కారు ప్రత్యర్థులతో పోలిస్తే ఎక్కువ.

ఈ-విటారాలో అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 10.25-అంగుళాల స్క్రీన్, 10.1-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వాలుగా ఉండే వెనుక సీట్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే,  ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవెల్ 2 ADAS, 7 ఎయిర్బ్యాగ్లు, డ్రైవర్ సీటును 10 విధాలుగా సర్దుబాటు చేసే ఫీచర్ ఉన్నాయి.

భారీగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నద్ధం

ఈ-విటారా కోసం మారుతి మెరుగైన పర్యావరణ వ్యవస్థను కూడా సిద్ధం చేసింది. మారుతి సుజుకి 1,000 కంటే ఎక్కువ నగరాల్లో 2,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ప్రజలకు ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేసే సౌకర్యం లభిస్తుందని మారుతి పేర్కొంది. దీని కోసం, ఆటోమేకర్లు 'e for me' యాప్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

Also Read: ఇండియాలో ఏయే ఎలక్ట్రిక్ కార్లకు 5-స్టార్ రేటింగ్ ఉంది? జాబితాలో మారుతి-టాటా మహీంద్రా సహా చాలా కంపెనీలు!