Affordable adventure bikes 2026 India: భారత రోడ్డు పరిస్థితులకు అత్యంత సరిపడే మోటార్‌సైకిల్ ఫార్మాట్‌లలో అడ్వెంచర్ బైక్‌లు ఒకటి. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కారణంగా గుంతలు, బ్యాడ్ రోడ్లను ఇవి సులభంగా ఎదుర్కొంటాయి. అంతేకాదు, న్యూట్రల్, అప్‌రైట్ రైడింగ్ పొజిషన్ వల్ల లాంగ్ జర్నీల్లో కూడా కంఫర్ట్ తగ్గదు. ముఖ్యంగా, అడ్వెంచర్ బైక్ కోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నదే ఇప్పుడు పెద్ద ప్లస్. ప్రస్తుతం మన మార్కెట్‌లో లభిస్తున్న అత్యంత అఫోర్డబుల్ అడ్వెంచర్ బైక్‌ల టాప్ 5 లిస్ట్ ఇది.
5. Yezdi Adventure
ధర: రూ.1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ఇటీవలే, యెజ్డీ అడ్వెంచర్ పూర్తిగా కొత్త స్టైలింగ్ అప్‌డేట్ తీసుకుంది. అసిమెట్రికల్ ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్ దీనికి ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. ఇందులో 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండి 29.6hp పవర్, 29.8Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్మూత్ పనితీరు, షార్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ దీని బలం. 21 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక వీల్ సెటప్‌తో నిజమైన ఆఫ్‌రోడ్ సామర్థ్యం అందిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, 3 రైడ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.
4. Suzuki V-Strom SX
ధర: రూ.1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)
సుజుకి గిక్సర్ 250 ప్లాట్‌ఫామ్‌పైనే తయారైన ఈ బైక్‌లో 249cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 26.5hp పవర్, 22.2Nm టార్క్ ఇస్తుంది. నగర ప్రయాణాలు, హైవే టూరింగ్ రెండింటికీ సరిపడేలా రిలాక్స్‌డ్ ఎర్గోనామిక్స్ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా రోడ్ ఫోకస్‌డ్ బైక్ అయినప్పటికీ, 19 అంగుళాల ముందు వీల్ వల్ల తేలికపాటి ఆఫ్‌రోడింగ్‌కూ పనికివస్తుంది.
3. Kawasaki KLX230
ధర: రూ.1.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)
భారత్‌లో రోడ్ లీగల్‌గా అమ్మకంలో ఉన్న తొలి జపనీస్ డ్యువల్-స్పోర్ట్ బైక్ ఇదే. పూర్తి స్థాయి అడ్వెంచర్ బైక్ కాకపోయినా, నిజమైన ఆఫ్‌రోడ్ DNA కలిగి ఉంటుంది. 233cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 19hp పవర్, 19Nm టార్క్ ఇస్తుంది. పవర్ సంఖ్యలు తక్కువగా కనిపించినా, నగరంలోనూ, ఆఫ్‌రోడింగ్‌లోనూ స్పందన బాగా ఇస్తుంది.
2. Hero Xpulse 210
ధర: రూ.1.62 లక్షలు నుంచి (ఎక్స్-షోరూమ్)
Xpulse 210లో 210cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది Karizma XMR నుంచి తీసుకుని, లో-ఎండ్ పనితీరు మెరుగ్గా ఉండేలా ట్యూన్ చేశారు. 24.6hp పవర్, 20.7Nm టార్క్‌తో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్స్, పెడల్ హైట్స్ వల్ల రైడింగ్ ఎర్గోనామిక్స్‌ను మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, 21 అంగుళాల ముందు - 18 అంగుళాల వెనుక వీల్స్ దీనిని గట్టి ఆఫ్‌రోడర్‌గా నిలబెడతాయి.
1. Hero Xpulse 200 4V
ధర: రూ.1.40 లక్షలు నుంచి (ఎక్స్-షోరూమ్)
మన దేశంలో లభించే అత్యంత చౌకైన అడ్వెంచర్ బైక్ ఇదే. 199.6cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో 18.9hp పవర్, 17.4Nm టార్క్ ఇస్తుంది. తక్కువ బరువు, ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఇది రోజువారీ కమ్యూటింగ్‌కూ, వీకెండ్ ఆఫ్‌రోడింగ్‌కూ బాగా సరిపోతుంది. బేస్ వేరియంట్‌లోనే 220mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ప్రో, డకార్ ఎడిషన్‌లలో అయితే సస్పెన్షన్ ట్రావెల్ మరింత పెరుగుతుంది.
Honorable Mention: TVS Apache RTX
ధర: రూ.1.99 లక్షలు నుంచి (ఎక్స్-షోరూమ్)
యెజ్డీ అడ్వెంచర్‌తో పోలిస్తే కేవలం రూ.1,000 ఎక్కువ ధర ఉన్న Apache RTX ఈ లిస్ట్‌లో ప్రత్యేకంగా గుర్తించాల్సిన బైక్. కొత్త 299cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో 36hp పవర్, 28.5Nm టార్క్ ఇస్తుంది. క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు బేస్ వేరియంట్‌లోనే ఉన్నాయి. పై వేరియంట్లలో క్విక్‌షిఫ్టర్, అడ్జస్టబుల్ సస్పెన్షన్, TPMS కూడా లభిస్తాయి.
మొత్తంగా, తక్కువ బడ్జెట్‌లో అడ్వెంచర్ రైడింగ్ అనుభూతి కోరుకునే వారికి ఇప్పుడు భారత్‌లో మంచి ఆప్షన్లు ఉన్నాయి. నగరం, హైవే, ఆఫ్‌రోడ్ అన్నింటికీ సరిపోయే ఈ బైక్‌లలో మీ అవసరాలకు తగినదాన్ని ఎంచుకోవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
