Cheapest Diesel SUVs 2025: డీజిల్ SUVలు తెలుగు ప్రజలకు ప్రధాన వాహనాలు. తెలుగు వాళ్లు కోరుకునే అధిక టార్క్, అత్యుత్తమ శక్తి & ఇంధన సామర్థ్యం వీటికి ఉండడమే దీనికి కారణం. ముఖ్యంగా, 7-సీటర్‌ డీజిల్ SUVలు ఫ్యామిలీతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటాయి. మహీంద్రా & టాటా వంటి కంపెనీలు ఇప్పటికీ ఈ విభాగంలో బలమైన పట్టును కొనసాగిస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న, అత్యంత తక్కువ ధర గల 5 డీజిల్ SUVలు:

మహీంద్రా బొలెరోమహీంద్రా బొలెరో, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్‌ అయిన & అందుబాటు ధరలో దొరికే 7-సీటర్‌ డీజిల్ SUV. దీని ప్రారంభ ధర సుమారు ₹9.28 లక్షలు. ఇది 75 bhp & 210 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో శక్తి పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై, లీటరుకు సుమారు 16 కి.మీ. మైలేజీ అందిస్తుంది. బొలెరో డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ దృఢమైనది. ఈ డిజైన్‌ ఈ బండిని కఠినమైన భూభాగాలు & ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు అనుకూలంగా మారుస్తుంది. పవర్ స్టీరింగ్, AC & సెంట్రల్ లాకింగ్ వంటి ప్రైమరీ ఫీచర్లు మాత్రమే ఉన్నప్పటికీ, అధిక మన్నిక & తక్కువ నిర్వహణ వంటివి దీనిని గ్రామీణ & పట్టణ వినియోగదారులకు ఇష్టమైన కారుగా మార్చాయి.

మహీంద్రా బొలెరో నియోబొలెరో నియో అనేది క్లాసిక్ బొలెరోకు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చిన వెర్షన్. దీని ప్రారంభ ధర ₹9.43 లక్షలు. ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 100 bhp & 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ దాదాపు 17 కి.మీ/లీ. దీని డిజైన్ బొలెరో కంటే స్టైలిష్‌గా ఉంటుంది. LED టెయిల్‌లైట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & రియర్‌ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది. దీనిలోని 7-సీట్ల లేఅవుట్‌లో, మూడో వరుస సీటు పిల్లలకు లేదా తక్కువ దూరం ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ SUV బొలెరో కంటే సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ క్లాసిక్‌ తరహాలో ఆఫ్-రోడ్ సామర్థ్యం ఉండదు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ & స్కార్పియో Nస్కార్పియో క్లాసిక్ పాతదే అయినప్పటికీ ఇప్పటికీ పాపులర్‌ SUV. దీని ప్రారంభ ధర ₹13.03 లక్షలు. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, 130 bhp & 300 Nm టార్క్‌ను ఇస్తుంది. దీని మైలేజ్ దాదాపు 15 కి.మీ/లీ. దీని దూకుడైన రూపం & బలమైన సస్పెన్షన్ వల్ల గ్రామీణ & పట్టణ ప్రాంతాలలో ఈ SUV ఒక పాపులర్‌ ఆప్షన్‌ అయింది. 

స్కార్పియో N ఈ విభాగంలో మరింత ఆధునిక SUV. దీని ప్రారంభ ధర ₹13.61 లక్షలు. దీని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 200 bhp వరకు జనరేట్‌ చేస్తుంది & 14.5 km/లీ మైలేజీ ఇస్తుంది. దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని 4x4 వేరియంట్ ఆఫ్-రోడింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది & ప్రీమియం SUV లుక్స్‌ను ఇష్టపడే వారికి ఇది సరైనది.

మహీంద్రా XUV700 మహీంద్రా XUV700, ఈ బ్రాండ్‌ ప్రీమియం SUVల్లో ఒకటి. దీని ప్రారంభ ధర ₹14.18 లక్షలు. ఇది 200 bhp పవర్‌ ఇచ్చే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. మైలేజ్ దాదాపు 17 కి.మీ/లీ. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా & పనోరమిక్ సన్‌రూఫ్‌ దీని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు. ఈ కారు 6  లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది & AWD ఎంపికను కూడా అందిస్తుంది. టెక్నాలజీ & లగ్జరీ లక్షణాలకు ప్రాధాన్యతనిచ్చే వారి వచ్చింది ఈ SUV.

టాటా సఫారి టాటా సఫారీ చాలా కాలంగా తెలుగు ప్రజలకు ప్రియమైన పేరు. ₹14.66 లక్షల ధరతో, ఇది 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 170 bhp & 350 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. మైలేజ్ సుమారు 16.3 కి.మీ/లీ. సఫారీ కూడా 6 & 7-సీట్ల లేఅవుట్‌లలో లభిస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ & పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి దీని ఫీచర్లు. ఈ SUV బోల్డ్ డిజైన్ & విశాలమైన మూడో వరుస సీటు దీనిని ఫ్యామిలీ SUV విభాగంలో బలమైన పోటీదారుగా నిలబెట్టాయి.

భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో డీజిల్ SUVల పట్ల క్రేజ్ ఇంకా తగ్గలేదు, అందుకే ఈ ఐదు డీజిల్ SUVలకు కూడా డిమాండ్‌ తగ్గలేదు.