Best motorcycle helmets 2025: మోటార్‌ సైకిల్ హెల్మెట్ ఎంపిక చేసుకోవడం అంటే కేవలం సర్టిఫికేషన్ స్టిక్కర్ చూసి కొనడం మాత్రమే కాదు. రోజూ ట్రాఫిక్‌లో తిరిగేటప్పుడు, హైవేపై లాంగ్ రైడ్‌కు వెళ్లేటప్పుడు, లేదా వీకెండ్‌లో సరదాగా బైక్ నడిపేటప్పుడు.. హెల్మెట్ మీకు ఎంత కంఫర్ట్ ఇస్తుంది, ఎంత భద్రంగా అనిపిస్తుంది అన్నదే అసలు విషయం. 2025లో, ఆటోమొబైల్‌ ఎక్స్‌పర్ట్‌లు వాడి, రివ్యూ చేసిన అనేక హెల్మెట్లలో ఈ ఐదు హెల్మెట్లు ప్రత్యేకంగా నిలిచాయి.

Continues below advertisement

Steelbird Ignyte IGN 7

Steelbird Ignyte IGN 7, ఈ జాబితాలో, బడ్జెట్‌లోనే గ్లోబల్ భద్రత ఇచ్చే హెల్మెట్‌గా నిలుస్తుంది. ISI, DOT, ECE 22.06 అనే మూడు భద్రతా ప్రమాణాలు ఉండటం దీని పెద్ద ప్లస్. క్లియర్ అవుటర్ వైజర్‌తో పాటు ఇన్నర్ సన్ వైజర్ కూడా ఉంటుంది. వేడి వాతావరణంలో కూడా కంఫర్ట్ కోసం డైనమిక్ వెంటిలేషన్ ఛానెల్స్ ఇచ్చారు. వాష్ చేయగల ఇన్నర్ ప్యాడ్స్‌, రియర్ స్పాయిలర్‌, రిఫ్లెక్టివ్ ఎలిమెంట్స్ లాంటి ఫీచర్లు డైలీ రైడింగ్‌కు ఉపయోగపడతాయి. సుమారు ₹6,499 ధరలో ఈ హెల్మెట్ మంచి విలువ ఇస్తుంది.

Continues below advertisement

Korda Icon

Korda Icon కూడా మూడు గ్లోబల్ సర్టిఫికేషన్లతో వస్తుంది. సుమారు 1,550 గ్రాముల బరువుతో స్పోర్టీ లుక్‌ను ఇష్టపడే రైడర్లకు ఇది బాగా నచ్చుతుంది. డ్యుయల్ వైజర్ సిస్టమ్‌, మంచి వెంటిలేషన్‌, డబుల్ డీ రింగ్ స్ట్రాప్‌, ఎమర్జెన్సీ రీలీజ్ ట్యాబ్స్ ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ లేదా ఇంటర్‌కామ్ పెట్టుకునేందుకు స్పీకర్ పాకెట్స్ ఉండటం లాంగ్ రైడ్స్ చేసే వారికి ఉపయోగపడుతుంది. ధర సుమారు ₹8,499 అయినా, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు.

KYT Striker 2

KYT Striker 2 లుక్ విషయంలో చాలా మందిని ఆకట్టుకుంటుంది, ముఖ్యంగా బ్లూ కలర్‌లో ఇది రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. ₹7,000లోపు ధరలో ఇది స్టైలిష్ ఫుల్ ఫేస్ హెల్మెట్. ISI సర్టిఫికేషన్ మాత్రమే ఉన్నా, డైలీ కమ్యూటింగ్‌కు సరిపడే రక్షణ ఇస్తుంది. క్లియర్ వైజర్‌తో పాటు ఇన్నర్ సన్ షీల్డ్‌, స్పెక్టకిల్స్ పెట్టుకునే స్లాట్స్‌, డబుల్ డీ రింగ్ స్ట్రాప్ ఉన్నాయి. అయితే హైవే స్పీడ్‌లో విండ్ నాయిస్ కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు.

SMK Laminar

SMK Laminar ఓపెన్ ఫేస్ హెల్మెట్ అయినా భద్రత విషయంలో ఏమాత్రం తక్కువ కాదు. ISI, DOT, ECE 22.06 సర్టిఫికేషన్లతో వస్తుంది. సుమారు ₹2,799 నుంచి ప్రారంభమయ్యే ధరలో ఈ స్థాయి రక్షణ దొరకడం పెద్ద ప్లస్. లైట్ వెయిట్ షెల్‌, లాంగ్ క్లియర్ వైజర్‌, కంఫర్టబుల్ ప్యాడింగ్‌ నగర ప్రయాణాలకు బాగా సరిపోతాయి.

Studds Drifter Batman Edition

బ్యాట్‌మాన్ థీమ్‌తో వచ్చిన Studds Drifter ఈ జాబితాలో స్టైల్ కింగ్. ఫుల్ ఫేస్ డిజైన్‌, మంచి వెంటిలేషన్‌, తక్కువ బరువు కారణంగా సిటీ రైడింగ్‌కు బాగా సరిపోతుంది. డ్యుయల్ వైజర్ సిస్టమ్ డైలీ యూజ్‌లో ఉపయోగపడుతుంది. ISI, DOT సర్టిఫికేషన్లు ఉన్నాయి. క్విక్ రీలీజ్ చిన్ స్ట్రాప్ ట్రాఫిక్‌లో తరచూ ఆగాల్సినప్పుడు సౌకర్యంగా ఉంటుంది.

మొత్తానికి, మీరు బడ్జెట్‌లో ఉన్నా, గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలన్నా, లేదా స్టైల్ ముఖ్యమన్నా… 2025లో ఈ ఐదు హెల్మెట్లు ప్రతి రైడర్ అవసరానికి సరిపోయే ఆప్షన్లు అందిస్తున్నాయి. హెల్మెట్ అంటే యాక్సెసరీ కాదు, మీ ప్రాణాలకు రక్షణ అనే విషయం మర్చిపోకుండా, మీ రైడింగ్ స్టైల్‌కు సరిపోయేదాన్ని ఎంచుకోవడమే అసలు తెలివైన నిర్ణయం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.