Honda Elevate ZX Loan and EMI Details: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగంలో హోండా ఎలివేట్‌ది ప్రత్యేక స్థానం. ప్రత్యేకంగా ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ అయిన హోండా ఎలివేట్ ZX.. టెక్నాలజీ, సేఫ్టీ & ప్రీమియం లుక్స్ విషయంలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, లెథరెట్ సీటింగ్ & అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.
హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ & ఆన్‌రోడ్ ధర వివరాలుహైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ZX Petrol Manual ఎక్స్-షోరూమ్ ధర రూ. 15,39,000. ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు టాక్స్, కార్ ఇన్సూరెన్స్, ఫాస్టాగ్ & ఇతర ఛార్జీలు అన్నీ కలిపి దీని ఆన్‌రోడ్ ధర దాదాపు రూ. 19.15 లక్షల వరకు ఉంటుంది. ZX Petrol Automatic (CVT) ఎక్స్-షోరూమ్ ధర రూ. 16,89,000 & ఆన్‌రోడ్ ధర రూ. 20.99 లక్షల వరకు ఉంటుంది.
విజయవాడలో ఎక్స్-షోరూమ్ & ఆన్‌రోడ్ ధర వివరాలువిజయవాడలోనూ హోండా ఎలివేట్ ZX Petrol Manual & ZX Petrol Automatic (CVT) ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 15,39,000 &రూ. 16,89,000. ఆన్‌రోడ్ ధరలు వరుసగా రూ. 18.98 లక్షలు & రూ. 20.99 లక్షల వరకు ఉంటాయి.
కనీస డౌన్‌పేమెంట్ & లోన్ వివరాలుమీరు హోండా ఎలివేట్ ZX Petrol Manual వేరియంట్‌ను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, బ్యాంకులు సాధారణంగా ఆన్‌రోడ్ ధరలో 80% వరకు రుణం ఇస్తాయి. మీరు కనీసం 20% వరకు కనీస డౌన్‌పేమెంట్ చేయాలి. అంటే సుమారు రూ. 3,60,000 ముందుగానే చెల్లించాలి. మిగిలిన డబ్బును లోన్‌గా తీసుకుని ఈ కారును సొంతం చేసుకోవచ్చు.
బ్యాంక్‌లు & ఫైనాన్స్ కంపెనీల తాజా వడ్డీ రేట్లుప్రస్తుతం, ప్రముఖ బ్యాంకులు అయిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా & బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కొత్త కార్ల రుణాలపై వార్షికంగా 8.7% నుంచి 14% వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. కస్టమర్ సిబిల్ (CIBIL) స్కోరు, ఆదాయ ప్రొఫైల్ ఆధారంగా ఈ వడ్డీ రేటు మారుతుంది.
ఇది కూడా చదవండి: టాటాకు భారీ షాక్.. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన మహీంద్రా.. సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల లెక్కలు
10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4, 5, 6, 7 ఏళ్ల EMIల లెక్కలు
మీరు రూ.3,60,000 లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన రూ.15.38 లక్షలను బ్యాంక్ లోన్‌గా తీసుకోవాలి. ఈ లోన్‌పై 10% వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, EMI వివరాలు:
4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 38,9975 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 32,6696 ఏళ్ల కాలపరిమితి (72 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 28,4857 ఏళ్ల కాలపరిమితి (84 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 25,525
మీరు రూ.5,00,000 లక్షలు డౌన్‌పేమెంట్ చేస్తే, మిగిలిన రూ.13.98 లక్షలను లోన్‌గా తీసుకోవాలి. ఈ లోన్‌పై 10% వార్షిక వడ్డీ రేటు అనుకుంటే, EMI వివరాలు:
4 ఏళ్ల కాలపరిమితి (48 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 35,4465 ఏళ్ల కాలపరిమితి (60 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 29,6946 ఏళ్ల కాలపరిమితి (72 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 25,8917 ఏళ్ల కాలపరిమితి (84 నెలలు): ప్రతి నెల చెల్లించాల్సిన EMI సుమారు రూ. 23,201
ఈ ప్రకారం, మీరు రూ.5,00,000 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి, 7 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకుంటే, నెలకు కేవలం రూ.23,201 EMIతో ఈ ప్రీమియం కారును పెద్దగా ఆర్ధిక భారం లేకుండా మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్
కారు రుణం తీసుకునే ముందు మీ క్రెడిట్ స్కోరును 750 కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు & తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశం ఉంటుంది. రుణ కాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ EMI తగ్గినా, మీరు చెల్లించే మొత్తం వడ్డీ పెరుగుతుందని గుర్తుంచుకోండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
